నేటిదనుక ఈ యుద్యమ వ్యాప్తిని గూర్చి కొంచెము ముచ్చటించెదను.
గ్రంథాలయముల చరిత్ర
౧౯౧౮-వ సంవత్సరమునందు ప్రకటింపబడిన గ్ర౦థాలయముల చరిత్రివలన ఆంధ్రదేశమునందు అమితముగ ఉత్సాహము జనియించి, రాగల వత్సరము విశేషముగ అభివృద్ధిని జూపవలెనను పట్టుదల కలిగినది. ఈ సంగతిని గ్రహించినవారమై ౧౯౧-వ సంవత్సరమునకుగూడ ఆంధ్రదేశమునందున్న గ్రంథాలయముల చరిత్రను ప్రకటించితిమి. ౧౯౧౪-వ సంవత్సరము నందు అచ్చుపడిన చరిత్రకు ౧౪౦ గ్రంథాలయముల చరిత్రమాత్రము దొరుకగా, ౧౯౧౫-వ సం॥ మున చరిత్రనుందు ౨౧౦ గ్ర౦థాలయముల చరిత్ర ప్రకటింపబడి యుండు టెంతము సంతోషదాయకము. ఇవిగాక చరిత్రల సంపని ౭౯ గ్రంథాలయములు గూడ గలవు. ఈ యంకెలనుబట్టి ఈ యుద్యమ ప్రారంభమునుండియు గ్రంధాలయము లెట్లభివృద్ధి నొందుచున్నవియు సులభముగా గ్రహింపవలెను. ఈ చరిత్ర యొక్క ప్రయోజనముగూర్చి మద్రాసునఁదు ప్రకటింపబడుచున్న "న్యూ ఇండియా" పత్రిక ఇట్లు వ్రాసినది: "ఈ గ్రంధమువలన ఆంధ్రజన ప్రబోధమును, ఆంధ్రుల స్వధర్మాచరణ పరాయణత్వమును తేటపడుచున్నవి. “నళ" నామ సంవత్సరమునకు ఆంధ్రదేశ గ్రంథాలయముల చరిత్రను ప్రత్యేకముగ గ్రంధరూపమున బ్రకటింపక, గ్రంథాలయ సర్వస్వమునందే అచ్చువేయవలెనని తలంచుచున్నారము.
గ్రంథాలయ సర్వస్వము
ఈ సంఘపక్షమున గ్రంథాలయముల యభివృద్ధికై "గ్రంథాలయ సర్వస్వ" మను నామమున మూడు మాసముల కొక గ్రంథమును ప్రకటించుచున్న సంగతి మీకు తెల్లమేను. గ్రంథాలయోద్యమ మందలి వివిధ దశలనుగూర్చి విపులముగ బోధించునట్టి వ్యాసములు ప్రతి భాగమునందును ఆయా విషయములనుగూర్చి ప్రత్యేక పరిశ్రమ జేసిన సమర్ధులచే రచింపబడియున్నవి. ఈ వ్యాసములయందు, పాశ్చాత్య దేశములందును బరోడా రాజ్యమునందుకు గ్రంథాల యోద్యమమెటుల పనిచేయుచున్నదియు చూపబడినది. మఱియు ఆయా దేశముల యందీ ముద్యవ ప్రచారమునకు అవలంబింపబడుచున్న అభివృద్ధి మార్గములు మని దేశమునకు అనుగుణముగ నుండునటుల అనుభవ సిద్ధముగ బోధింపబడినవి. గ్రంథాలయమునకు కావలసిన నింబంధనములు, పట్టికల నమోనాలు కూడ ఇందు ముద్రింపబడినవి. ఆంధ్రదేశమునందు స్వంత భవనములు గలిగియున్న గ్రంథాలయముల చరిత్రములను గూడ క్రమముగా నిందు ముద్రించుచున్నారము ఇంతియేగాక వాఙ్మయము, చరిత్ర, మొదలగు విషయములనుగూర్చిన వ్యాసములును, గ్రంధములమీది విమర్శనములును సమర్థులగు పండితులచే వ్రాయబడుచున్నవి. ఇతర విషయములకు సంబంధించిన వానిని గూడ నిందు ముద్రించితివి. ఐనను ప్రధమ సంపుటమునకు రూ. ౫౧౪-౪-౦ నష్టమువచ్చినది. ద్వితీయ సంపుటమునకైన ఇంత కన్న తక్కువ నష్టము వచ్చునటుల గాన్పించదు. ఐనను సొమ్ము ముందుగా పెట్టుబడి పెట్టి కాగితములు మొదలగు వారిని దెప్పించి నిలవయు౦చి నను, అని వారివ్యములగు ఇతర ఇబ్బందులవలన ఈ సంవత్సరము రెండు సంచికలకన్న నెక్కువ వెలబడి యుండలేదు. ఈసభ జరిగిన వెంటనే మిగిలిన రెండు సంచికలనుగూడ ప్రకటిఁపవలెనని యత్నించుచున్నారము. ఈసందర్భమునందొక సంగతి మనవి జేయవలసినది యున్నది. గీతవత్సరము ఒంగోలు తాలూకా కొప్పెరప్పాడునందున్న శ్రీలక్ష్మీకాంత గ్రంథాలయమువారు తమ గ్రామమునకు మమ్ములను దొడ్కొనిపోయి ఏబది రూప్యముల నిచ్చిరి. ఈవత్సరము దీనికివచ్చిన నష్టమును గూర్చి విన్నవారై తెనాలి తాలూకా యందున్న పెదపాలెంగ్రామమునందున్న ఆర్యాణాల సమాజ గ్రంధాలయము వారు రూ. ౧౦ లను తీసుకొనివచ్చి యిచ్చిరి. హృదయపూర్వకముగ ఆవశ్యకతను గ్రహించి యిచ్చిన ఈసొమ్మేపదివేలు.