బోర్డువారు గాని ఉచితముగా దయచేయించుట కూడ ముఖ్యముని నా అభిప్రాయము. బరోడా మహారాజావారు గ్రంధాలయభివృద్ధికై ఎంతో ఖర్చు పెట్టచుచున్నారు. మన ప్రభుత్వము వారటులేని చేయరాదు?
మన గ్రంథాలయములలో ప్రాచీనమయినదగు తంజావూరి భాండాగారము ఇంగ్లాండునకు తీసికోనుపోవు ప్రయత్నము జరుగుచున్నట్లు తెలియవచ్చుచున్నది. అది నిజమే అయినయెడల దయచేసి దొరతనము వారీ దేశమునుఁడి అది తొలఁగి పకుండఁజేయ ప్రార్థితులు.
గంజాము విశాఖపట్టణము జిల్లాల స్థితి
గఁజాము జిల్లా లోను - విశాఖపట్టణము జిల్లాలోను ఉండవలసినన్ని గ్రంథాలయములు లేకపోవుట శోచనీయము. రెండు జిల్లాలలోని పెద్దలును శ్రమతీసికొని, ఎక్కువ గ్రంథాలయములు స్థాపింప ప్రయత్న౦చుట కర్తవ్యము. విశాఖపట్టణముజిల్లా శృంగవరపుకోట తాలూకా గుల్జాము గ్రామములో ఆంధ్ర బాల సరస్వతీ పుస్తక భాండాగారమునకు కార్యదర్శిని అగు శ్రీమతి తూర్పాటి సన్యాసమ్మగారు శూద్రస్త్రీ, ఆగ్రామములో శూద్రులు మాత్రము కలరు. విద్య నేర్చినవారు చాల తక్కువమంది. అట్టిస్థితిలో ఆమె గ్రంథాలయము స్థాపించుట - ౧౧౦౦ గ్రంధములు చేర్చుట - పెక్కుమంది అక్కడకువచ్చి చదువునట్టు చేయుట - చదువులేనివారికి గ్రంథములు చదివి వినిపించుట శ్లాఘనీయములు. పాపము! ఈ నడుమనే అమెభర్త పగలోకప్రాప్తి చెందెనఁట. పరాత్పరుఁడామెకు ధైర్యమొసఁగి, దేశసేవాపరాయణత్వమున భర్త శోకమునకు లోనుగాకు౦డఁ జేయుఁగాక! స్త్రీలే ఉత్సాహముతో పనిచేయుచున్నపుడు పురుషులీవిషయమున అశ్రద్ధచేయుట ధర్మముకాదు.
గ్రంథాలయ సర్వస్వము.
ఆంద్రదేశ గ్రంథాలయ సంఘమువారు గ్రంథాలయాభివృద్ధికై చేయు ప్రయత్నములు సర్వజన సమాదరణీయములు. అందులో గ్రంథాలయ సర్వస్వము ప్రచురింపపూనుకొనుట మిక్కిలి యెన్నఁదగియున్నది. ప్రధమసంపుటము నాలుగుభాగములుగా ప్రచురించినారు. దానివల్ల రు. ౫౦౪-౪-౦ నష్టమువచ్చినను వెనుకదీయక రెండవసంపుట భాగములు ప్రచరించుచున్నారు. గ్రంథాలయముల పక్షమున ఏదో పత్రిక ఉన్నయుక్తముగా నుండునని ఈ మహాసభా ద్వితీయాధ్యక్షోపన్యా సాంతమున సూచింపబడినది.
గ్రంథాలయ సర్వస్వము బయలుదేఱి ఆలోపము తీర్చినది; గానియందలి అచ్చు - చిత్రపటములు - మనోహరముగా ఉన్నవి. విషయములు జ్ఞానదాయకములు. కాని, దానికి నష్టముకలుగుటచూడ తగినవానికి తోడ్పడు నేర్పు మన వారికింకను కలుగలేదుగదా అని చింతిల్లవలసివచ్చుచున్నది. త్వరలో మనకీ లోపము తొలఁగుఁ గాక! ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘమువారు కార్యశూరులు; మార్గదర్శకులు; అట్టి వారెవరికి పూజ్యులు కారు? ఇంక, తమ సహజౌదార్యముతో గ్రంథాలయసర్వస్వమునకు నూఱురూపాయల వార్షిక మేర్పఱిచి వారికి తోడ్పడి ఇతరధనవంతులకు మార్గదర్శికులైన శ్రీ పిఠాపురము రాజుగారు మనకిందఱకును మాననీయులని వేఱే చెప్పనక్కఱలేదుగదా!
గ్రంథాలయముల ముఖ్యపుపని.
గ్రంథాలయములు బయలుదేఱినవి; బయలు దేఱును; పనిచేసినవి; చేయుచున్నవి; చేయును. కాని, అవి ముఖ్యముగా చేయవలసిన పని ఏమి? గ్రంథ సంపాదమా? అదేకాదు; బడులు పెట్టుట పురాణములు చదువుట, మొదలగు వానివల్ల జ్ఞానదానమా ? అదియును ఇప్పటివలెకాదు; అనఁగా దీనితోను దానితోను ఏదో మిడిమిడి జ్ఞానము కలిగించుట మాత్రము కాదు; ఒక్కొక విషయమునందు కావలసినంత జ్ఞానము కలిగించి, ఆది లాభకరముగా చేయుటయే గ్రంథాలయములు ముఖ్యపుపని. ఎట్లందురా? దయచేసి వినుఁడు, గ్రామములయందలి జనులకు ఏవోకొన్ని వృత్తులే ముఖ్యములుగా ఉండును, పట్టణములయందలి వారలకు పెక్కువృత్తులున్నను, అక్కడను అందులో కొన్నియే ముఖ్యములగును; ఒక్కొకచోట ఒకటియే ముఖ్య