త్సరము ఆంధ్రదేశ గ్రంథాలయ ప్రతినిధుల మహాసభను ఇచ్చట జరపి ఆదరించుటచే దీని పేరాంధ్రదేశమున శాశ్వతముగా నెలకొనఁగలదు.
మన ప్రయత్నములలో వాఙ్మయాభివృద్ధి ప్రయత్నము జ్ఞానదాయకము; స్వయంసాహాయ్యముచే చాలవుకు సఫలము చేసికొనఁదగినది. దీనికొఱకు బంగాళీలు మహారాష్ట్రులు మొదలగువారు పాటుపడుచున్నారు; ఫలము పొందుచున్నారు. మనవారును, మాసపత్రికలు-వారపత్రికలు- దినపత్రికలు-గ్రంధమాలికలు-విద్యావిషయక సంఘములు స్థాపించి పనిచేయు చున్నారు. దీనితోపాటు గ్రంథాలయములును బయలు దేరినవి. ఇప్పటికి నాల్గువందలకు పైఁగా లెక్కకువచ్చినవి. కాని, ఇవి మిక్కిలి తక్కువ. విద్యార్ధులుగాక చదువునేర్చినవారు నూఱుమంది ఉన్న ప్రతి గ్రామమునందును గ్రంథాలయములు స్థాపించుట ఆక్షశ్యకము. ఇంగ్లాండు-ఫ్రాన్సు-జర్మనీ జపాను, దేశములలోను, ముఖ్యముగా అమెరికా సంయుక్త రాష్ట్రములలోను గ్రంథాలయములు పెక్కులుకలవు; కొన్ని కోట్లకొలఁది నిలువగలనియును ఉన్నవి. అందుచే సమస్త విషయములను తెలుపు గ్రంధములతోను, పటములు చిత్తరువులు మొదలగు సాధన సామగ్రితోడను నిండి పిల్లలకును పెద్దలకును ఉపయోగపడు చున్నవి. భగతఖండమున బరోడాసంస్థానములో గ్రంథాల యోద్యమము చక్కఁగా వర్ధిల్లి జనోపయోగకరముగా పనిచేయుచున్నది. ఆంధ్రదేశమున గ్రంథాల యోద్యమము వ్యాపించినను ధనలోపముచేతను, ఉత్సాహలోపము చేతిను జరుగవలసినంతపని జరిగి కావలసినంత సాయము జనులకు సమకూడకున్నది. ఉత్సాహలోపమునకు కారణము మనమే. 'శ్రేయాంసి బహువిఘ్నాని' అను మాట మనకు కొత్తది కాదు. ఎన్ని విఘ్నములు వచ్చినను తగ్గక నిలుచునదే సరి అయిన ఉత్సాహము. అట్టి ఉత్సాహశక్తి మనకున్నచో రెండవ లోపముకూడ త్వరలోనే చాలవఱకు తీఱును. కావున, గ్రంథాలయ కార్యనిర్వాహకులారా! తక్కిన ఉద్యమములను పూనుకొను వారికంటే మీరు ఎక్కువ ఉత్సాహముగలవారనియు, మీ ఉద్యమమే ఎక్కువగా వ్యాపించినదనియు, ఎక్కువగా స్థిరపడినదనియు సంవత్సరము పొడుగునను ఎక్కువగా పనిచేయుచున్నదనియు పేరుపొందినది. కావున మీరిఁక సంఘార్ణోత్సాహము కనఁబఱుపుఁడు; పనిచేయుఁడు; గ్రథాలయోద్యమము సఫలముచేయుఁడు; ఇతరులకు మార్గదర్శకులగుఁడు; ఆంధ్రులు సంస్కారప్రియులు-నూత్నోత్సాహము చూపువారు గాక కార్యశూరులని కూడ మెప్పూతెండు.
ఇప్పటి స్థితినిబట్టి విద్యార్థులకు పాఠశాలలలోను-కళాశాలలలోను భాండాగారములు కలవు గాన పై గ్రంథాలయములందు హెచ్చుగా పెద్దలకు పనికివచ్చు గ్రంథములే కొంతకాలమువఱకు సమకూర్చుట కర్తవ్యమని తోఁచుచున్నది. రామమోహన ధర్మపుస్తక భాండా గారము పిల్లలకు కూడ పనికివచ్చునటు లేర్పాటు చేసిన తత్కార్యనిర్వాహకుల ప్రయత్నము శ్లాఘనీయము. గ్రంథాలయములకు పత్రికాసమూహ మొకఅంగము. కాన, అది బలపఱుచుటకును, గ్రంథాలయ కార్యనిర్వాహకులు తోడ్పడవలసియున్నది. అందులో, ఆంధ్రపత్రికయే నునకున్న దినపత్రిక. ఎంతో నష్టము భరించి నాగేశ్వరరావు పంతులుగారది జరుపు చున్నారు. దాని ప్రచారము హెచ్చింప యత్నించినఁ గాని వారి నష్టము తగ్గుట దుర్లభము.
వాజ్మాయాభివృద్ధి
ఏ దేశమునందుఁగాని, వాఙ్మయమభివృద్ధిపొందని స్థితిలో గ్రంథాలయోద్యనుము ఫలించుననుకొనుట నీరులేక పంట పండుననుకొనుటయే. కావున, మన గ్రంథాలయములు మంచి స్థితిలోనికి వచ్చుటకు మంచి గ్రంథములు పెక్కులు కావలయును. ఇదివఱకున్నవి చాల తక్కువగాన క్రొత్తవి ఎన్నో వ్రాయవలసి ఉన్నది. అవి సులభ శైలిలో ఉండవలెను. ఈ శైలికి రావుబహద్దరు కందుకూరి వీరేశలింగము పంతులుగారు మార్గదర్శకులయిరి. వారి ననుసరించి మ-రా-రా-శ్రీ, నేమూరి విశ్వనాధశర్మగారు మొదలగువారు రసాయనశాస్త్రము మొదలగు కొన్ని మంచి గ్రంథములు వాసి దేశమునకు చాలవేలు చేసినారు. వివిధవిషయ