Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.3-4 (1918).pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కిని వాడబడుచున్నది. పాండవులు భూరి సువర్ణదక్షణ లొసంగిరని జనులునమ్ముటకు నిదర్శనముగా నిప్పటికిని వర్షకాలమున వీధులలో "సువర్ణ వంగపరకలు,” "నందిపరకలు” దొరకుచున్నవి. నేడవి గ్రంథాలయ ప్రదర్శనమున కొసగబడివి. మరియు ఈప్రాంతమున పరశురాముడు ఉద్యానవనమువేసి తపస్సుచేసినట్లు ప్రతీతి గల 'ఉద్దాన' మను గ్రామము ఈశాన్యమూలగా సముద్రప్రాంతమున నారికేళ, కదళీ, పనసాది ఫలవృక్షములతోడను-పోకచెట్లు, తమలపాకులు తీగెలుగల తోటలతోడను అలరారుచు, రెండవ కోనసీసుయో యన్నట్లు నేత్రోత్సవముగ విరాజిల్లు చున్నది.

మహాజనులారా! మనదేశ మిప్పుడనుభవించుచున్న సర్వానర్ధములకు మూలకారణము ప్రజలయందుగల యజ్ఞానమేయని కీర్తి శేషులయిన దేశభక్త గోపాలకృష్ణ గోఖలే మహాశయుడు బాగుగా గ్రహించి ప్రజలంలో నిర్బంథోచిన ప్రారంభ విద్యాపద్ధతిని నెలకొల్పిదలచి మహాప్రయత్నము దేశీయుండెను. ఆయన యుద్దేశ్యము నెరవేర్చుటకు గ్రంథాలయము లెంతయు సాధనములు. ప్రస్తుతము విద్యావ్యాప్తికి పాఠశాలలే సాధనములు గానున్నవి. అందు హెచ్చుజీతము లిచ్చుకొనినగాని కొలది గ్రంథములనయినను చదువుకొనుటకు వీలులేదు. గ్రంథాలయములన్ననో అవి సాధారణముగా సర్వజనులును ఉచితముగ చదువుకొనుట కావకాశమిచ్చుటచే బీదసాదలగు సామాన్య ప్రజలెల్లరును ప్రయప్రయాసలు లేక అనేక గ్రంధములను పఠించి విశేష జ్ఞానము సంపాదించుటకు వీలును కలిగించును. ఈ విషయమును మనవారు బాగుగా గ్రహించినచో ప్రతి గ్రామమునందును గ్రంథాలయమును స్థాపించి జ్ఞానమును ప్రజలలో వ్యాపింపచేయుటకు తప్పక ప్రయత్నింతురు. ప్రస్తుతమున ఆంధ్రదేశమునగల పాఠశాల లెంత యుపయోగకరములుగా నుండగలవో క్రింద పట్టిక వలన తెలియనగును.

దేశమునందు జ్ఞానమభివృద్ధియయియయిన కొలదిని దేశజనులు విశేషనాగరికతను బొందుట సహజము. పూర్వము “గ్రీకు” “రోము” రాష్ట్రముల నాగరికతకు అచ్చటి గ్రంథాలయములే ముఖ్య సాధనములై యుండెను. జపాను, జర్మనీ, అమెరికా రాష్ట్రములయందు గ్రంథాలయవ్యాప్త అపరిమితము. మన దేశమునందును బరోడా సంస్థానమున గ్రంథాలయన్యాప్తికయి జేయుచున్న పని అత్యద్భుతము. అచ్చట నొక కేంద్ర గ్రంథా