Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వేఱుచేసినచో నాంధ్ర దేశ్యపదములు చాల తక్కువ గాను ననాగరికావస్థఁ దెలుపునవిగాను నుండకమానవు. ఈభా వకుమున్నే కవిత్వదశయందును వ్యవహారదశయందును మిక్కిలి యౌన్నత్యము పొందియున్న ద్రావిడ కళింగ కర్ణాటక భాషలలోనికే యాంధ్ర దేశ్యపదములు చేరినవ నుట అంత సమంజసమైనదిగను విశ్వసనీయవయినదిగను గాన్పింపదు. ఇట్లు ప్రాతి వేశిక భాషాపదములచే క్రమ క్రమాభివృద్ధమగుచున్న మనయాంధ్ర భాష చాలకాల మువరకు సంభాషణావస్థయందే యుండి క్రమము గాఁ బండిత భాషయగు సంస్కృతమునకున్న సుఖోచ్చారణ ముగల యక్షర సమామ్నాయమే దీని కతుడసమామ్నాయ ముగా నేర్పఱుపఁబడినను దేశ్యనుగు భాషను సంగ్ర హించుటకు మాత్రము 3౬ అక్షరములు మాత్రమే చాలియుండెను. పండిత భాష సంస్కృతవగుట చే వారు మాటలాడునపు దుపయోగింపఁబడుచు వచ్చిన తత్సమపదములకొఱకును, వారుపయోగించు పదములు సరిగా నుపయోగింపలేక యత్కించిద్వికృతి పూర్వక ముగా స్త్రీ బాలపామరజనులచే నుచ్చరింపఁబడు తద్భవ పదములకొరకును సంస్కృతామ్నాయమునందున్న య న్నియకురములును స్వీకరింపవలసివచ్చినది. దేశ్యపదములు కూడ పామరులచే నుపయోగింపఁబడవలసివచ్చినప్పుడు కొంచెము వికృతిగా నుచ్చరింపఁబడుటచే దేశ్యభవము లగు పదములు గూడ మెండైనవి, లేఖనము లేక శిక్షిత ముకాకయున్న యేభాషయును నిట్టివికారవేషము వహింపకమానదనుట సర్వజన విధితమేకదా! ఇట్లక్షర సమామ్నాయ మేర్పడినపిదప వ్రాయను చదువను నేర్చిన మనవారు రాజకీయవ్యవహారములయందును కొన్ని శాస నములయందును మాత్ర మీభాష నుపయోగించుచు వ చ్చిరి. కానీ ధర్మశాస్త్రములు, నీతిశాస్త్రములు, ప్రకృ తిశాస్త్రములు, రసశాస్త్రములు, మున్నగునవి సర్వ దేశ విద్వద్భాషయగు సంస్కృతమునందే రచింపఁ బడుచు వచ్చినవి. ఇంతేల నిత్య నైమిత్తిక కర్మానుష్ఠానముందు క్రియావిధానమున కుపయోగింపఁబడు సంభాషణ కు సంస్కృతమునందే వ్యవహరింపఁబడుచు వచ్చినది. దీనికి యింకొక కారణముకూడ కలదు. మాటలాడు భాష మార్పు జెందు స్వభావము కలదియగుటచే మతవిషయికమ గు కర్మలయందేమి వికృతి చెందునోయని ఎన్నడును మార్పు చెందని సంస్కృతమునందే ఆక్రియావిధానమంత యు నున్నయది. ఇంక సంభాషణావస్థలోనున్న భాష ప్రతిమనుష్యునందును భిన్నమై కొంతయుఁ బ్రతి గ్రామమునందును భిన్నమై కొంతయు, ప్రతిదేశమునం దును భిన్నమై కొంతయు నుండుటచే దేశ్యమనియు గ్రామ్యమనియు నింద్య గ్రామ్యమునియు తద్భవమనియు తత్సమమునియు నైదు భేదములు కలిగియుండెడిది. ఇతర భాషాభవములు ఇతర భాషాసమములుకూడ నున్నను సం స్కృత భాషా ప్రావీణ్యముకల యప్పటి పండితులవీ గుర్తిం పలేక యట్టివన్నియు దేశ్యములేయనియు సంస్కృతము నుమాత్రమే గుతి౯ంపఁగలుగుటచే తద్భవతత్సమపదము లలోనున్న తత్ అను పదమునకు సంస్కృతమనియే యర్ధమునుఁ జెప్పఁగలిగిరి. కాని దేశ్యపదములయందు సైతము ఇతర భాషాభవములు నితర భాషాసమములు నుండుటచేతను గ్రామ్య పదములయం దు దేశ్యభవసమములుండుట చేతను నింద్య గ్రాన్యుపద ములయంగు గ్రావ్యభవములుండుట చేతను తద్భవతత్స మపదములయందలి తత్పదమునకు సంస్కృతమని మా త్రమే చెప్పుటకు వలను పడదు. ఇంతేల మ్లేచ్ఛ రాజపరి పాలనము వచ్చినతరువాత తద్భాషాభవములు తద్భాషా సమములుకూడ కొన్ని మనభాషయందు సంక్రమించినవి. కాబట్టి మొట్ట మొదటినుండియు తద్భవపదములను తత్స మపదములను చేర్చుకొను నలవాటుగల మనయాంధ్ర భాష యాంగ్లేయభవములను యాంగ్లేయ సమములను జేర్చుకొనుటకు వెనుదీయుట భాషాహాని హేతువు గాని భాషాభివృద్ధి హేతువుకాదు. కొందరు యింతకుమున్ను మనభాషలో లేని యాంగ్లేయపదములు తీసికొనవలయు నుగాని యున్న పదములు తీసికొనరాదని వాదించుచు న్నారు. కాని యది యుక్తిసహముకాదు. దేశ్యపదము లున్నను ఆయర్ధమును బోధించు తద్భవతత్సమపదముల ను నన్నయభట్టారకాదులు పరిగ్రహింపలేదా! చూచు ధాతువుఁడగా నీక్షించుధాతువు పరిగ్రహింపఁ బడ లేదా ! అట్లని యావదాంగ్లేయ పదములు నాంధ్రభాష