Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్ర భాష

ఆంధ్రులవలనను ఆంధ్రదేశమందును వాడఁబడుభాష ఆంధ్రభాష . పూర్వ మేతెగవారేదేశ ముందు నివసించి యుండిరో ఆప్రదేశమునకు ఆ తెగవారి పేరే వ్యవహారము నాకు వచ్చినది. పూర్వమునందు నట్టిప్రదేశములకు స్థిర ములైన హద్దులులేక ఆయా తెగవారు స్వాధీనపఱచు కొని ఆక్రమించుకోఁగలిగిన ప్రదేశమంతయు నా పేరు చేతనే వ్యవహరింపఁబడుచు వచ్చినది. ఆంధ్రరాజులు అరణ్య ప్రాయమగు నీ దేశము నాక్రమించుటచే దీనికిఁ గూడ నాంధ్రమని పేరువచ్చినది. ఆంధ్రులు ప్రప్రధమ మున మగధ దేశమును పరిపాలించినట్లు చరిత్రలవలనఁ దెలియుచున్నది. మనపూర్వులచే, లెక్కింపఁబడుచు మన పురాణములలో నక్కడక్కడ వాడఁబడు దేశముల లోని ఆంధ్రదేశ మదియేకాని ఇదికాదు. ప్రస్తుతము మన ము నివసించుచు మనచే నాంధ్ర దేశమని వ్యవహరింపఁబడు ప్రదేశము పూర్వము మహారణ్యప్రదేశముగానున్నట్లు పెక్కు నిదర్శనములు కలవు. గంగానది సాగర సంగమ మయిన ప్రదేశము మొదలు కృష్ణానదివరకును పూర్వము కళింగ దేశమని వాడబడుచుండునది. ఇది మూడుభాగ ములుగా విభజింపఁబడి. ఉత్తరకళింగ మనియు, మధ్య కళింగమనియు, దక్షిణ కళింగ మనియు వ్యవహరింపఁబడు చు మొత్తముమీద త్రికళింగ దేశమని వ్యవహరింపఁబడు చు వచ్చినది. ఆంధ్రులచే ప్రప్రథమమున నాక్రమించు కోబడిన ప్రదేశము కొంచెమించుమించుగా కృష్ణా గోదావరీ మధ్యప్రదేశమై యున్నట్లు తోచుచున్న ది. తరువాత త్రికళింగ దేశములో దక్షిణ మధ్యమకళింగలు వేగీపట్టణము రాజధాని గాగల రాజుల పరిపాలనలోనికి వచ్చి వేగీదేశమని వ్యవహరింపఁబడుచు వచ్చినను, త్రిక ళింగ దేశ తద్భవనుగు తెలుగుపదము మాత్రము దీనిని వదలలేదు.

తరువాత నాంధ్ర దేశమును తెలుగు దేశమును నొక రాజు పరిపాలనలోనికి వచ్చినతరువాత దానికిని దీనికిని గూడ తెలుగు దేశమనియు నాంధ్ర దేశమనియు వ్యవహా రమువచ్చినది. అంతేకాని ఆంధ్రమనునది సంస్కృత భాషాపడమనియుఁ దెలుఁగు దానికి తెలుఁగనియు నను కొనుట ప్రమాదమని నాయభిప్రాయము. తూర్పున మ, హేంద్రపర్వతము, దక్షిణమున ద్రాక్షారామము, పశ్చి మమున శ్రీశైలము, ఉత్తరమున కాళేశ్వరము, ఈహద్దుల మధ్యస్థమగు ప్రదేశము తెలుగుదేశమనియు నాంధ్రదేశ మనియు వ్యవహరింపఁబడుచున్నది. ప్రతాపరుద్రమహా రాజున కంకితమి యఁబడిన ప్రతాపరుద్రీయములో వి ద్యానాథనుహాకవి శ్రీశైల కాళేశ్వర ద్రాక్షా రామనివా సులగు దేవతల పేర్కొనుటగూడ - నీయంశము నే పఱచుచున్నది. కావున నీయెల్లల మధ్యస్థనుగు ప్రదేశము న మాటలాడు భాష తెలుఁగనియు నాంధ్రమనియు ప్ర స్తుతము వ్యవహరింపఁబడుచున్నది. రఘువంశములో రఘుదిగ్విజయవర్ణ నావసరమున కాళిదాసును, రాజతరంగి ణిలో ప్రవరసేనాది దిగ్విజయవర్ణ నవసరమున కల్హణ పండితుండును మహాభారతమున నర్జున దేశయాత్రా ప్రస్తావ మున వ్యాసమహర్షియు నారణ్యమగుటచే వర్ణింపక వద లిన యీ ప్రదేశము, నన్నయభట్టు నాటికి జనపదాలంకృ తంబై యుండుటంజేసి సంస్కృతమున లేకపోయినను నర్జున యాత్రాప్రస్థావమునం దీప్రదేశమును వేగీదేశము గా నన్నయభట్టు వర్ణించినను- దీనికి వేగీ దేశమను వ్యవ హారముగాని యీభాషకు వేగి భాషయను వ్యవహారము గాని రాలేదు. సరిహద్దులలోనున్న అరవము, కన్నడ ము, కళింగము, మొదలగు భాషల సంపర్కమువలనను నార్య సంతతిలోనివారును సంస్కృత భాషా ప్రవిష్టులునగు పండితులకు నివాసభూమియగుట వలనను యాంధ్రభాష క్రమక్రమముగా నాగరక భాషావస్థకు వచ్చినదగుటచే నాయాభాషాపదములన్నియు నిందుఁ జేరినవి.

ఈభాషయందు ప్రస్తుతము వ్యవహరింపఁబడు పద. ములలో నరవభాషాభవములు, కన్నడభాషాభవములు, కళింగభాషాభవములు, సంస్కృతభాషా భవములును