Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మ్ము రు ౧౪ ను మాచే నిర్వహింపబడుచున్న రాత్రి పాఠశాలకు రు.౫-౧౪-0 లను యిచ్చితిమి. మఱియు ఈవత్సరము కృష్ణానది వరద కొల్లేరు మూలకాలచే బాధితులగు పేదలకు ఏర్పడిన నిధికి మేము ఉడతాభక్తిగా నాలుగు రూపాయలు మాత్రము వసూలుజేసి పంపగలిగితిమి.

భూపతిరాజు తిరుపతిరాజు
కార్యదర్శి


గుంటూరు మండల గ్రంథాలయసంఘము

గుంటూరుమండల గ్రంథాలయసంఘము ౨౬౼౫౼౧౯౧౬ తారీఖున తొమ్మిదిమంది కార్యనిర్వాహకులతో తెనాలి యందేర్పరచబడింది. పిమ్మట కార్యదర్శులలోనొకరు కర్లపాలెం వెంకట నారాయణప్పగారు బుర్రిపాలెం అత్తోట శిరిపూడిగ్రామములకుబోయి గ్రంథాలయముల ఆవశ్యకత గురించి ఉపన్యసించిరి. ౨౼౭౼౧౯౧౬ తారీఖున కార్యనిర్వాహక సభ జరుపబడినది; సంఘమునందు కొండముది శ్రీ రాములు గారు కుప్పా శ్రీరామశర్మగారు నాగేశ్వరసుందరంగారు భాగవతుల వెంకటసుబ్బయ్యగారు సభికులుగా చేర్చుకొనుచు రెండు తీర్మానములు చేయబడినవి. ౨౪౼౯౼౧౯౧౬ తారీఖున నిడుబ్రోలు యందున్న ఆంధ్ర సరస్వతీనిలయముయొక్క ప్రధమ వార్షికోత్సవమునకు కార్యదర్శకులతో గ్రంథాలయముల ఆవశ్యకతను గురించియు ఉపన్యసించిరి. ౨౪౼౧౨౼౧౯౧౬ తారీఖున బాపట్ల తాలూకా గ్రంథాలయ సంఘము యొక్క ఏర్పాటువిషయమయి కార్యదర్శకులు బాపట్లకు పోయి తాలూకాసంఘమును ఏర్పాటు చేసిరి. దానికి చోరగుడి వేంకటాద్రిపంతులుగారు అధ్యక్ష్యులుగాను చంద్రమౌళి చిదంబరరావుపంతులుగారు కార్యదర్శిగాను ఏర్పడిరి. ౨౯౼౧౨౼౧౯౧౬ తారీఖున కార్యదర్శకులలోనొకరగు తాడంకి వెంకయ్య గారు రేపెల్లెకు బోయి అక్కడసభ చేసి రేపెల్లెతాలూకా గ్రంథాలయసంఘమును ఏర్పాటు చేసిరి. దానికి రేపల్లె పురవాసులు లంక సూర్యనారాయణ శాస్త్రి గారును ధేనువకొండ రామమూతి౯ గారును నల్లూరు కాపురస్తులు అచ్చినేని రాఘవచౌదరి గారును సంయుక్తకార్యదర్శకులుగా నేర్పడిరి. శ్రీ రాఘవచౌదరిగారు ఆ తాలూకాలో సంచారముచేయుచు నూతన గ్రంథాలయవిషయమైని శేషప్రయత్నములను జేయుచున్నారు. ౩౦౼౧౨౼౧౯౧౬ తేదీన నిడుబ్రోలు ఆంధ్రసరస్వతి నిలయమువారి ఆహ్వానము మీద కార్యదర్శకులు వెళ్లి గ్రంథాలయముల ఆవశ్యకతనుగురించి ఉపన్యసించిరి. ఈ సంఘము యొక్క ఉద్దేశ్యములను తెలియజేయు ప్రకటన పత్రికలను నరసారావు పేట, పల్నాడు, తాలూకాలలోయున్న గ్రంథాలయములకును ఇతరులను పంపితిమి. విద్యావంతులను ధనవంతులను సహాయము చేసిన, కొలదికాలములోనే ఈ యుద్యమము జిల్లా యందంతటను వ్యవిపించునట్లుచేయగలమని విన్నవించుచున్నారము.

తాడంకి వెంకయ్య
సంయుక్త కార్యదర్శి