ణచేయుటకు కొన్ని సదుపాయములను చేయతలంచి అందులకు గాను కావలసిన రు ౭,౫౦౦ ల నీయ పారిశుద్ధ్యసంఘమువారిని కోరిరి. వారందులకు సమ్మతించి గ్రంథాలయమువారు కోరిన పూర్తి మొత్తమునిచ్చిరి.
ప్రధమమునప్రజలకు కావలసిన గ్రంధములను బీరువాలలోనుంచిరి. పిమ్మట ఈ గ్రంథములను చదువుకొనుటకు పాఠకులను బిలువసాగిరి. వారికీ రెండు విషయములలో నెటుల పరిశ్రమచేసినది, గ్రంథాలయ కార్యదర్శియగు “బ్లాకుమెరు” గారు న్యూయార్కు ములోని ఒక గ్రంథ ప్రకటన నికేతనము వారికీక్రింది విధముగా వ్రాసిన యుత్తరమునుబట్టి పాఠకులు గ్రహింపగలరు.
మా వ్యాపారమున కెట్టిబేరగాండ్రు కావలయునో మొదట యోచించితిమి. మా పురమునందు పాఠశాలలలో జదువుకొనుచున్న బాలురును యువకులును అనేకులు గలరు. వారిని ఆకర్షించుట కెట్టిగ్రంధములు కావలయునో అట్టివానిని మేము వందలకొలది కొంటిమి. తదనంతరము మాగ్రంథముల వారికెట్టుల చదువుటకీయవలయునో యోచించితిమి. దీనికిగాను మా గ్రంథాలయాధిపతీయు, నితర సభ్యులును కలిసి పురములోని ప్రతి విద్యాలయమునకును అనేక, గ్రంధములను వెంటదీసికొనిపోయి, బాలురకు ఆ గ్రంధములలో నుండు విషయముల సంగ్రహముచెప్పి గ్రంధములు చదువుచుండిన గలుగు లాభములు వివరించి, యా గ్రంథములను చదువుటకు మాగ్రంథాలయమున కాహ్వానించితిమి. ఏ గ్రంథ మెవరికి కావలయునో మాకు తెలియుటకు కొన్ని దరఖాస్తు నమోనాలను బాలురకిచ్చితమకు కావలసిన గ్రంధములనందుదహరించి తమ పోషకుల సంతకములను చేయించి పంపుటకు కోరితిమి. కాని మేమిచ్చిన దరఖాస్తు ఫారములలో ఒకటియైనమాకు చేరలేదు. కొందరు పోషకులసంతకములను చేయించలేదు. మరికొందరు తమ జనకుల సంతకములు కయిష్టమును సూచించిరి. అనేకమంది అటుల సంతకములు కోరుట మంచిదికాదనిరి. కొందరు పోషకులు తమ బిడ్డల దరఖాస్తు ఫారములలో సంతకములు చేయగొల్లకుండిరి. అంతట సంతకముల నిర్భంధమును దొలగించి బాలురందరికిని వారి పేరు, చదువుతరగతి, పాఠశాల - ఈవివరములుమాత్రము దీసికొని గ్రంధములనిచ్చుచుండుట కేర్పాటు గావించితిమి. ఈ విషయమును తెలుపుటకుగాను విద్యాలయములకుబోయి వారికిచెప్పి తిరుగ వివరములకు గాను దరఖాస్తు ఫారములనిచ్చితిమి. ఆ మరుదినమునుండియు వేలకొలది బాలుకు మా గ్రంథాలయమునకు వచ్చి గ్రంధముల నడుగసాగిరి. మూడవనాడు గ్రంథాలయము లో నొకపుస్తకమయినను లేనందున మరికొన్ని వందల గ్రంధములను కొనవలసివచ్చినది. పుస్తకములు కొనుటకు కొందరు ఉదారులు వెంటనే ద్రవ్యసహాయముచేసిరి. ఇటుల గ్రంథాలయములు ప్రజల నాకర్షించుటకు పనులుచేసిన ధనము ప్రోగగుటకేమియు సందియములేదు. ఇటులనే పన్నుచెల్లించువాని, కార్మికుని, వర్తకునిగృహములకు బోయిదరఖాస్తునమోనాలనిచ్చితిమి. వారును వరదలకొలదిగవచ్చి గ్రంధములను దీసినిపోవుచున్నారు.
ప్రజలుగ్రంధములను దొంగిలించెదరని మేమెన్నటికిని నమ్మజాలము. ఇంతవరకు మా నిలయములో నొకపుస్తకమయినను పోలేదు. జాగరూకతతో పనిచేసిన ప్రతిచోట నిటులనే యుండగలదని మేము నమ్మెదము. బాలురకు గూడ వారిపోషకుల సంతకములు లేకనే గ్రంధముల నిచ్చెదము. వారియందు మనకు నమ్మకముమాత్రముండిన చాలును. నమ్మకముండిన ఎంతటి ఘనకార్యమయిన చేయవచ్చును.
- ఎం.వి.ఎన్. శర్మ.