Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గీ॥ నిట్టనిలువున న్నెసి ఫణివ్రజంబు | ఫణములను వ్రాల్చి విసముఁగ్రక్కినవిధాన లేచుచుఁ, బడుచు, నురుఁగుఁగల్పించుచుండు | రేగుచుండెడు జలధియూర్మికల సమితి. గీ. నునుపుగా దువ్వి పట్టుకుచ్చుకుఁడించుఁ | గురుల పూవులు వాసనల్గురియు చుండ విభుల మొగములఁజూచి నవ్వించుచుండు | స్త్రీ వతంసము ల్మెల్లఁ జరించుచుంద్రు. వ. పదిములు మున్గుచోట నిలువద్ద గల యి దూకఁబోఁ గడు న్బదరునఁ గాళులెత్తి, పెరభాలగళంబునఁ జేయి వైచి స మ్ముదమునఁ గేరి కేకలిశూ ముద్దునిసుంగుల మోములందు దో పదు, తరుణీజనంబులత్రపాసహితంబగు రాగ మెయ్యెడక్. _కలచవీడు వేంకట రమణాచార్యులు,


"హెూబర్టు” గ్రామ గ్రంథాలయము, అమెరికాదేశము.

అమెరికా దేశమునందు గ్రంథాలయములు లక్షాధికారిమొదలు భిక్షాధికారివరకును గల జనులనందరి నాకర్షించుచుండును. ఇందులకు గల కారణమేమి? ఆ దేశస్థులు తమసర్వశక్తులను జనులను విద్యావంతులు జ్ఞానవంతులుగ జేయుటయందే వినియోగించుచున్నారు. అమెరికాదేశమునందు, గ్రంథాలయములు సర్వజనులకు ఉపయోగకారు లైవెలయుటకు ఏ యే మార్గముల నవలంబించెదరో దెలియుటకై ఒక చిన్న గ్రంథాలయమువారు చేయుచున్న పనినిగూర్చి మనము దెలిసికొందము.

సంయుక్త రాష్ట్రములలోని 'అక్లహోమా' మండలములలో '"హెూబర్టు” అను నొక చిన్న పట్టణముగలదు. ఆందు నాలుగు వేలమంది జనులు గలరు. కార్నీ జీ మహానుభావుడు ముప్పదివేల రూపాయలను వ్యయపరచి గొప్ప గ్రంథాలయము నొకదానిని ఆ పట్టణమునందు నిర్మించియున్నాడు. గ్రంథాలయమును నెలకొల్పిన ప్రధమ సంవత్సరము నందది అనుదినమును తెరువబడియున్నను, సరియైన గ్రంథములు లేనందువలనను, ప్రజల నాకర్షించుటకు తగిన సాధనములు సంస్థాపకులకు దెలియనందువలనను, ఉపయోగకరముగ నుండలేదు. అంతట పురపారిశుద్ధ్య సంఘమువారు, దీనికి మూడువేల రూపాయలను విరాళముగా నొసంగిరి. మరుచటి సంవత్సరము గ్రంథాలయ మిసుమంతయైన పనిచేయనందువలన, కాలము దుర్భిక్షముగానున్నందువలన పారిశుద్ధ్య సంఘమువారేమియు విరాళమునీయలేదు. మూడవ సంవత్సరము గ్రంథాలయము ప్రజల నాకర్షించుట క్రెమియు చేయజాలకపోయినను రు ౩౬౦౦ లను సంఘమువారిచ్చిరి. నాలుగవ సంవత్సరమున (అనగా ౧౯౧౫ సం॥న) మునిసిపలు సంఘము వారు పురములోని యితర శాఖలకు గాను ఖర్చు పెట్టగా మిగిలిన రు ౪,౫౦౦ లను గ్రంథనియమునకు పారితోషికముగా నిచ్చిరి. ౧౯౧౫ సంవత్సరమునందా గ్రంథాలయమునందుండి, ౨౩,౦౦౦ గ్రంధములు గృహములకు చదువుకొనుటకుగాను పంపబడినవి. కార్యాలయములలో నింతకన్న నెక్కువ సంఖ్యగల గ్రంథములను విద్యార్థులు, కార్మికులు, వర్తకులు మొదలగువారు చదువగలిగిరి.

గత సంవతరమున (అనగా ౧౯౧౬ సం॥) గ్రంథాలయాధికారులు తస గ్రంధనిలయమునకు ప్రజల నాకర్ష