థాలయములు పుస్తక దుకాణములుగా మాత్రముండక బాలశాఖ మొదలగువాటిని ప్రారంభించి జనులకు లెక్కలేనన్ని విధముల తోడ్పడవలసియున్నదనియు, ఇ౦క గ్రంథముల నపరిమితముగా కొనవలసియున్నదనియు,ఈ పనులన్నియు నిర్వహించుటకుగాను చందాలవలన వసూలగుద్రవ్య మెంతమాత్రమును చాలదనియు, కావున లోకల్ బోర్డులనుండి గ్రాంటుల నిప్పింపవలసినదనియు ఆంధ్రదేశమున ౨౫౦ గ్రంథాలయములు గలవనియు, ఇవి స్థిరముగ నుండుటకు గాను ౧౮౬౦ సంవత్సరము యొక్క ౨౧ నెం. ఆక్టుప్రకారము రిజిస్టర్ చేయించుకొనుట అగత్యమై యున్నదనియు, ఆయాక్టును బట్టి రిజిస్టరు చేయించుటకు రు ౫౦ ల ఫీజును చెల్లింపవలసి యున్నదనియు, గ్రంథాలయము లిట్టి మొత్తమును భరించు స్థితిలో లేవనియు, కావున వీనినిగూడ “సహకారి పరపతిసంఘము”ల వలెనే ఉచితముగా రిజిస్టర్ చేయునటుల ఏర్పాటుచేయింపవలసినదనియు విజ్ఞాపనపత్రికను శ్రీ శివస్వామి అయ్యరు గారికి సమర్పించితిమి. దానికి శ్రీవారిట్లు ప్రత్యుత్తరమిచ్చిరి. "నేను అనేక పాఠశాలాభవనములకును నీటిగొట్టముల మరలకును శంఖుస్థాపనను జేసియుంటిని. అవియన్నియు పూతి౯కానప్పటికిని, మూడు సంవత్సరముల క్రిందటనే నేను శంఖుస్థాపనజేసిన ఈ గ్రంథాలయము యొక్క స్వంతభవనమును స్వయముగచూచుటకు నా కెంతయో యానందమగుచున్నది. ఈ కాలమున గ్ర౦థాలయోద్యమము దేశాభివృద్ధికి ముఖ్యసాధనములలో నొకటిగ ప్రసిద్ధిగాంచుచున్నది. నిమ్మ జాతులకొరకేర్పరుపబడిన పాఠశాలయు, స్త్రీలు చదుపుకొనుటకై వారిండ్లకు గ్రంధముల నుచితముగ పంపుటకు చేసిన ఏర్పాటును మీసంఘమును విశేషముగ జనోపయోగకర- మగునటుల చేయుచున్నవి. మునిసిపాలిటీలయొక్కయు,లోకలు బోర్డులయొక్కయు ద్రవ్యముల నుండి గ్ర౦థాలయములకు సహాయముచేయుట నాయభీవ్యమై యున్నది. గ్రంథాలయములు దొరతనమువారి యొక్క ౧౮౬౦ సంవత్సరము ౨౧ నెం. చట్టము ననుసరించి రిజష్టరు చేయించుకొనుటకు ప్రస్తుత స్థితినిబట్టి, యివ్వవలసిన రు ౫౦ ల రుసుమును రద్దు పరిపించమని మీరుచేసిన రెండవప్రార్ధనయు నాకంగీకారమే. ఆయంశమును సరియైన మార్గమున నాయొద్దకు పంపినయెడల అందునుగూర్చి తగినట్లు ఆలోచనలోనికి దెచ్చెదను.
ఈ గ్రంథాలయమునకు ప్రత్యేకము గ్రంథములను కొనుటకై కొంతమంది రు ౮౦౦ లకు పైగనే విరాళవుల నొసంగియుండిరి. కాని ఈద్రవ్యములో చాలభాగమును భవననిర్మాణము కొరకే వినియోగించియుంటిమి. ఈ సంవత్సరము మాత్రము రు ౨౯౯-౮-౯ ల గ్రంధములను కొనగలిగితిమని దెలుపుట కెంతయు సంతసించు చున్నారము. ముందు సంవత్సరము ఎక్కువ గ్రంధములను కొనుటకై ప్రయత్నింతుము. పుస్తకములు కొనుటకంటె వానికి అట్టలు కట్టించుటకై ఎక్కువ సొమ్మును వ్యయపరుపవలసి వచ్చుచున్నది.
మాచే నిర్వహింపబడుచున్న పంచముల పాఠశాల యధాప్రకారముగనే నడుపబడుచున్నది. శ్రీ అయ్యదేవర కాళేశ్వరరావుగారు, యల్లంరాజు శాస్త్రులుగారు వారి వాగ్దానముల ప్రకారము, చందాలనిచ్చి పోషించుచున్నారు. ప్రభుత్వమువారును, దీపావళి సంఘమువారును విరాళముల నిచ్చి ప్రోత్సాహపరచుచున్నారు. పంచమభాలురకు కేవలము చదువుట వ్రాయుట నేర్పినంతమాత్రము చాలదు. పిల్లకాయలకు పొట్టకుతిండి, కట్టుటకు గుడ్డలనుగూడ ఇచ్చి, జీవనమునందు వారికి సహాయపడు పరిశ్రమలను నేర్పుట అత్యవసరమని మా అనుభవమునుబట్టి తెలియుచున్నది. ఆ గుడిసెలో దరిద్రమువలన పీడింపబడుచుండి అన్నములేక మలమల మాడిపోవుచుండగ వానిని శుభ్రముగ నుండుమని మనము చేసినబోధ వానిమనసునకెక్కునా!
ఈ సంవత్సరము మాసంఘమునకు గుండా సుబ్బారాయుడు గారు “ బైసికిల్" ఇచ్చుటచే మా పనులు త్వరలో చేసికొనుటకు చాల వీలుకలుగుచున్నది.
కృష్ణానది వరదల వలనను, కొల్లేటి ములక వలనను మనసోదరులు భాధపడుచున్నారని వినినవెంటనే మే