తమయన్న గారి కావంతయు దీసిపోరు. ప్రతి నిత్యమును జపమును దేవతార్చనను, సక్రమముగాచేయుచు, సీతాకళ్యాణాది ఉత్సవములును, రామాయణ పారాయణమును సంతర్పణలును చేయుచుండెడివారు. వీరిచే దేవతార్చన జేయబడిన దేవుని పీఠము మాయింటియందు ఇప్పటికని గలదు.
రొయ్యూరు వల్లూరు జమీలో చేరియున్నందున గోపరాజుగారు ఈ సంస్థానములో లౌకికవ్యవహారపరుండై ఉద్యోగమును చేయుచు వ్యవహారములను సైతము చూచుకొనుచు తన అన్నగారి ఉదేశ సాఫల్యమున కేకీభవించెను. పలుకుబడిగలవారగుటచే, తమస్వశక్తివలనను ధార్మికుల సహాయ సంపదలవలనను చాలినధనము నిరంతరశ్రమచే నిరువురును గణించి శ్రీ వేణుగోపాల స్వామివారికిని శ్రీపార్వతీసమేత శ్రీసకలేశ్వరస్వామివారికిని చక్కని ఆలయముల నిర్మించిరి. అందు తామిరువురును విగ్రహముల ప్రతిష్ఠించి తాముపూనిన కార్యము నిర్విఘ్నముగా ఈశ్వర సంకల్పముచే నెరర్చుకొనగలవారైరి. ఈ ఆలయములకిప్పటికిమ్మతు ననుసరించి యాబది వేలరూప్యము లైననుచాలవనితోచును. వీరిచే నిర్మితములయిన శేషతల్ప విమానముగల విష్ణాలయమును తదితర శివాలయములును దృఢతరములై పూర్వపు శిల్పకళానిపుణత్వమును వెల్లడించున్నవి. ఈ ఆలయముల స్థిరత్వములకు తమస్వంత ఈ నామములనుండి రెండుకత్తుల భూవసతికూడ నొసగిరి. ఈ సుందర విమానములపై చూడ్కినిడువారెల్లరికిని వారిప్రతిష్ఠ స్ఫురణకురాని దినమేలేదు.
వీరు జీవాత్మకును పరమాత్మకును విభేదములేదని నిరూపించు శంకరుని మతమగు అద్వైతమతస్తులు. జాతి మత భేదములు లేక నెల్లరు భక్తియుక్తులగుటచే మోక్షము సంప్రాప్తమగుననియు భక్తియే ప్రధానమనియు బోధించు రామానుజాచారి మతమగు విశిష్టాద్వైతమతావలంబకులగు వైష్ణవోత్తములు, ఆ మతప్రచారమునకై అద్వైతులకు గూడ ఊర్థ్వపుండ్రములను బెట్టించి చక్రాంకితములజేసి వైష్ణవధర్మముల నుపదేశీంచుచు వీలువెంట నయభయముల తమకు శిష్యులనుగా జేసికొనుచుండిరి. వీరికి గురువులు వైష్ణవులు. జోగిరాజు గారికి గురుభక్తి మెండు. గురువుపై కృతి నిచ్చియు, ప్రశంసించియు నెన్నోగ్రంధములను వ్రాసిరి. గురువులపై తమకుగల భక్తిని వెల్లడించిరనుటకు వీరు వ్రాసిన యీ క్రింది, వేణుగోపాలశతకములోని మూడవపద్యము నిదర్శనముగా గన్పట్టుచున్నది.
| సీ. | శ్రీరామ తారకసేవాభిరతుఁడ నై | |
.
| గీ. | రాఘవాచార్యకృపను విరాజితముగ | |
ఇంతియెగాక ౧౦ యకరముల ఈనాంభూములసయితము నోసగి తమగురుభక్తిని వెల్లడించిరి. గురువులుగానుండి శిష్యులకు వైష్ణవధర్మములు ఉపదేసించుచున్నంత కాలము అందుల ఫలసాయముల ననుభవించుచుండవలసినదే గాని విక్రయాది హక్కులు లేకుండా యిచ్చియుండిన పక్షమున వారి వారసు లిటీవల ఆ యీనాంభూమిని ఇతరులకు విక్రయించుట సంభవింపకుండెడిది.
జోగిరాజుకవిచే తాటియాకు పొత్తములపై వ్రాయబడిన పారుజాతాపహరణము మొదలగు గ్రంధములు కొన్ని తమపై కృతి నివ్వబడియుండిన కృతమున వానినన్నిటిని అచ్చు వేయించి ప్రకటించెదమని వచించి మా వైష్ణవ గురువులుగొంపోయి యిప్పటికైనను వానిని ప్రచురించి యుండలేదు.
మిగిలిన గ్రంధములలో వంశక్రమాను గతముగ పువర్ణిఖిముతలై కొంపల్లి కాగితములపై వ్రాయబడిన గోపాల శతకము, హనుమంతశతకము, వేణుగోపాల శతకము, వామన విజయము, కీర్తనలు, పాటలు మున్నగనవి కొన్ని మాత్రమిప్పటికి మాచే క్కినవి. వానిని క్రమముగా లిఖితలోపముల సవరించి ప్రకటించి లోకమునకందజేసెదము.
౼ రొయ్యూడి రామచంద్రప్రసాదరావు