చిత్రముగానేయున్నది. ౫౦ లక్షుల ఆంధ్రులకు పట్టుమని పది బహిరంగ భాషా సంఘములు లేనపుడు పూర్వోక్తనిలయ సంఖ్య సముద్రములో కాకిరెట్ట యనవలెనుగద. ఈ స్థాపింపబడిన సంఘములలో నొకటి రెండుదక్క తక్కినవన్నియు దినగండము, నూఱే౦డ్లాయష్యమువలెనున్నవి. దీనికి కారణము ద్రవ్యోపపత్తిలోపమని పలుమారులు వినబడుచున్నది. అట్లయినను పనిచేయు వారేరి? పెక్కు గ్రంధాలయములు అవిచారమును స్థాపింపబడి యవిచారముననే కూలిపోవుచున్నవి. ఏయుద్యమ మందైనను జయము సిద్ధింపవలెనన్న మనమొనర్చు కార్యములయందు పట్టుదలయుండవలెను. కార్యముయొక్క విలువను ప్రజలలో బ్రకటించుటకు దగినయోగ్యత సమకూర్పబడవలెను. ద్రవ్యాది పరికరములు తమంతట తామే వచ్చును.
౼ హరి బాపయ్య
గ్రామచరిత్ర : రొయ్యూరు
రొయ్యూరు జోగిరాజుకవి
భరత ఖండమునకు గుంజు కాగితములుసు లోహపు ముద్రణా యంత్రములును రాక పూర్వము, మహానీయులచే పెక్కు గ్రంధములు తాటియాకు పత్రిములపై ఇనుపగంటములచే లిఖింపంబడి దేశమెల్లెడ వ్యాపింపబడక, కాలముగడచినకొలది, యెచ్చటి వచ్చటనే నసించి, దేశభాషాభివృద్ధికిని జ్ఞానాభివృద్ధికిని మిక్కిలి యాటంకము నాపాదించినవి. అప్పటి ఉత్కృష్ట గ్రంథములు మాత్ర మెట్టెటులనో కొన్ని నిలచియున్నవి. ఇటీవల మూలమూలల నడగియున్న తాటియాకు గ్రంథములు సాధ్యమయినంతవరకు సమకూర్పబడుచున్నవి. అందుమత సంబంధ మైనట్టియు, భక్తి సంబంధమైనట్టియు, శాస్త్ర సంబంధమైనట్టియు, గ్రంథములెన్నో బయల్పడు చున్నవి.
కృష్ణామండలమునందున్న రొయ్యూరు గ్రామమున సుమారొక శతాబ్దమునకు పూర్వము రొయ్యూరు జోగిరాజు, గోపరాజుగార్లను సోదరు లిరువురుండిరి. వీరు ఆరువేల నియ్యోగిబ్రాహ్మణులు, భారద్వాజసగోత్రోద్భవులు, వీరితండ్రి అచ్యుత రామయ్య. తాతి రామరాజు వీరీ గ్రామమునకు ఆదివాసులు.
ఇందు జోగిరాజు భగవద్భక్తుండు, నిష్ఠాగరిష్ఠుండు, కవివరేణ్యుండు. ఆమహానుభావుడు కాళ్ళకు గజ్జెలుగట్టి చిందులుద్రొక్కుచు, ఒక చేత తంబురమీటుచు, వేరొకచేత తాళమువేయుచు, పరవశుండై, నృత్యగీతములు సల్పునపుడు రెండవరామదాసా, కబీర్, త్యాగరాజోయనువారును కాదు నారదుడో, తుంబురుడొ అవతరించెనను వారును గలరని యిప్పటికిని చెప్పుకొనుచుందురు. భక్తుడు కవియగును, కవి భక్తుడగునని చెప్పుటకు ఈయనయే ఉదాహరణము.
ఈభగవద్భక్తుండు తానురచించిన కీత౯నలనే బాదుచు తన్మయావస్థలో మునిగి తేలుచుండెడివాడు. భక్తి అపారమై బీదవాడనని శంకింపకయును తాను ఆశక్తుడనని పరిగణింపకయును, దేవాలయముల నిర్మింపవలెనని సంకల్పించెను. భక్తికుదురవలెగాని ఎంతి మహత్కార్యమైనను ప్రయత్నమాత్రమున సిద్ధించగలదుగదా! దేశభక్తులును, రాజభక్తులును భగవద్భక్తులును తమ శక్తియుక్తులను, సర్వస్వమును, తాము తలపెట్టిన కార్యములకై వినియోగించుటయెగాక మీదుమిక్కిలి తమ తమ ప్రాణములనైనను నరకుగొనక, అవసరమైన నేర్పించుటకు సంసిద్ధులయ్యెదరు. దీనికంతటికిని నిష్కలంకమయిన భక్తియే ప్రధానము. చిత్తశుద్ధితో తల పెట్టిన ప్రతి కార్యమును నెరవేరకపోదు. జోగిరాజుగారీ రీతిని ధృఢసంకల్పచిత్తుండగుటతోడనే తన సోదరుండగు గోపరాజు గారు కూడ అందులకై పూనుకొనినవాడాయెను. వీరును భక్తియందేమి శిష్టాచార సంపత్తియందేమి