నిజాము రాజ్యము — ఆంధ్రులు
ఘనతవహించిన నిజాం రాజ్యమునందు ౫౦ లక్ష లాంధ్రులు గలరు. ఆంధ్రభాష వ్యవహరింపబడు జిల్లాలు ౫ గలవు. ౧౯౦౧ సంవత్సర ప్రాంతమున దక్షిణ హయిదరాబాదునందు, గృష్ణ దేవరాయాంధ్రభాషానిలయము, స్థాపింపబడినది. ఆ౦ధ్రుల నందఱిని ఏకఛత్రము క్రిందికి దెచ్చి అంధ్రసంస్కృత విద్యావ్యాపనముజేసి, కీర్తివంతుడైన ప్రతాపరుద్రదేవుని వలన, బౌలింపబడిన ఓరుగల్లు పట్టణమునందు ౧౯౦౪ సం॥ ప్రాంతమున, శ్రీ రాజ రాజనరేంద్రాంధ్రభాషా నిలయము స్టాపింపబడినది. పూర్వము, కుబీకుతుబుషాహ కాలమున, సీతాపతిరాజుచే నేలబడి, యటుపిమ్మట వరాహపురాణ, మత్యపు రాణాది గ్రంధముల రచించిన హరిభట్టుయను కవివర్యున కావాసమై, స్తంభాద్రియను నామాంతరముగల ఖమ్మ మెట్టునందు, శ్రీజ్ఞానవిద్యుత్ప్రవాహినీ యాంధ్ర భాషానిలయము ౧౯౧ం సం"న స్థాపింపబడినది. పూర్వము భద్రాచల రామదాసను నామాంతరముగల గోపన్నగారి జన్మస్థానమువలన పావనమైన నేలకొండ పల్లెయను పురమునందు, శ్రీ విరాట్రాయాంధ్ర భాషానిలయము, ఎర్రుపాలెము అను గ్రామమున శ్రీమహబూబియా ఆంధ్రభాషానిలయము, వడ్డేపల్లియందు శ్రీమన్ మోహన పుస్తకాలయము ఇవిగాక సికింద్రాబాదునందలి కొన్ని ప్రత్యేక భాషాసంఘములు, ఆంధ్రభాషాభివృద్ధికై పాటుపడుచున్నవి. కాని ఈ నిలయములకు సంబంధించినవారందరు అనగా కార్యనిర్వాహకులు సాధారణముగ బ్రిటిషు రాష్ట్రమునకు సంబంధము గలవారైనందునను కొంచెమించుమించుగ, రైలు మార్గములయందే ఇవి యుందట వలనను, భాషావిషయములు చర్చకు వచ్చుచున్నవి. విశేషముగ ఆంధ్రులుగల ప్రదేశములు ఇనుపదారికి కడుదూరముగ నుండుట వలసను, తపాల సౌకర్యములు లేనందువలనను మనధ్వని వారికి వినబడటలేదు. ఆభాగములలోనుండు, ప్రజలకు గృహములయందు పరస్పరము తెనుగు మార్దవమున మాటలాడుటగూడ దెలియదు. వారియందు మౌద్యము మూర్తీభవించి పిశాచమువలె శివములూగుచున్నది. విద్యగూడ మిగులతక్కువ. ఇప్పుడిప్పుడు కొన్నిపాఠశాలలు అక్కడక్కడ స్థాపింపబడు చున్నవి. అయినను ఆంధ్రభాషాభివృద్ధికి ఎక్కువ అవకాశము లేదు. ఈ రాష్ట్రమున భాషావిషయికసమస్య విద్యాశాఖాధి కారులవలన నింకను బరిష్కార మొందజాలకున్నది. ఇటీవల హయిదరాబాదు నగరమందు అధికారమందున్న కొందరు విదాప్రియులు “హయిద్రాబాదు ఎడ్యుకేషనల్ కాన్ఫరన్సు" అని యొక సంఘమును నిర్మించి యున్నారు. దీని సాంవత్సరికోత్సవ మీయేడు ఓరుగల్లు పురమున జరుగనున్నది. దీని యుద్దేశములు ఉర్దుభాషను వృద్ధిచేయుటయైయున్నది. ఇందుకు కారణముగలదు. ఈ దేశమున నుర్దుభాషకు రెండు విధములగు ప్రాముఖ్య తగలదని విద్యాశాఖాధికారులవలన నిరూపింపబడినది. (1) ఉర్దు ఒక విధముగ దేశీయ భాషలలో నొకటియగుట, (2) ఉర్దు ఈ దేశమందలి రాజకీయావసరములు నెగ్గుట కాధారభూతమై యుండుట. ఈ స్థితిగతులలో నుర్దుభాష నిజాంరాజ్యమునందలి యాంధ్రసోదరులకు స్వభాషకాక పోయినను, పైకారణములను బట్టి స్వభాషకంటె ఉర్దుభాషనే యెక్కుడు శ్రమ చేసి సాధించుట యవసరమగుచున్నది. స్వభాషావృద్ధికి యీ స్థితిగతులలో యేమాత్ర మారాజ్యమును నాంధ్రులకు తృప్తికరమైన యవకాశములేదు. లేదనియూరకున్న పక్షమున ఆదేశపుటాంధ్ర సోదరుల చరిత్రము ముందు చిత్రముగా నుండగలదు. వర్తమా నావస్థయందు బొంబాయి, కాశి, రంగూన్, బంగాళము, మున్నగు దేశములకు వలసపోయిన ఆంధ్రకుటుంబములు చారిత్రక విజ్ఞానమువలన తమ సాంప్రదాయములను స్మృతికిదెచ్చుకొని తమ తమ ప్రదేశములందు స్వభాషా ప్రచారక సంఘములను, సమాజముల నేర్పరుచు చుండగా, మా దేశీయులు స్వభాషాభివృద్ధి యెడ బ్రయత్నించిన పక్షమున బుద్ది పూర్వకముగ దగు సాంప్రదాయములను తమ ప్రత్యేక లక్షణములను బోగొట్టుకొనువారగుదురు. ఏది యెట్లున్నను మాసమస్య