Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సచిత్ర మాసపత్రికను గాని యుద్ధభటులకొరకై తపాలా కచ్చేరియందుండు అధికారికిచ్చినయెడల దాని నాతడు ఖర్చులేమియు లేకుండగ ఉచితముగనే యుద్ధభటులకంపు ప్రధాన కార్యాలయమునకు తపాలాద్వారా పంపును. ఈప్రకారము ఎన్ని గ్రంధములను తపలఆఫీసు లందిచ్చినను అవియన్నియు యుద్ధభటులకు పోయిచేరును. ఈసహాయమువలన జనులు ఇంకను ఎక్కువగ్రంధములంపుట సులభమయ్యెను. ఈమహత్కార్యమును నిర్వహించుకు పుస్తకములేగాక ధనమును ఆవశ్యకమయ్యెను. ఔదార్యవంతులు విరాళముల నొసంగి ధనలోపమును గూడ లేకుండ జేసిరి.

యుద్ధ గ్రంథాలయము.

ఇంతే గాక “పర్రేహౌసు” నందు యుద్ధ గ్రంథాలయము నొకదానిని గూడ స్థాపించిరి. ఈ యుద్ధగ్రంథాలయము నుండి గాయములు తగిలిన యుద్ధభటులుగల ఆసుపత్రులకు ఆసుపత్రి యోదులకు కావలసిన గ్రంథముల నెల్ల పంపుచుందురు. ఆంగ్లేయ దేశమునందే గాక ఫ్రాన్సుదేశము నందున్న ఆసుపత్రులకు గూడ గ్రంధములనంపెదరు. ఇంతే గాక “మాల్టా” “అలెగ్జాండ్రియా" మున్నగు ప్రదేశములకు కూడ అమితముగ గ్రంధములనంపిరి. యుద్ధము చేయుచున్న ఓడలమీద ఉన్నట్టి వారికిగూడ వలయుగ్రంధముల నంపుచుండిరి. ఈ యుద్ధ గ్రంథాలయమునకు గూడ జనులు అసంఖ్యాకములగు గ్రంథముల సంపుచుండిరి. అపాలాద్వారా వచ్చిన "పార్సిల్సు” గాక ౫౦౦ పెట్టెల గ్రంధములు ఒకేదినమున వచ్చినవి. కొందరు పనికిరాని గ్రంథములనుగూడ పంపుచువచ్చిరి. కాని అట్టివి బహుస్వల్పము, యుద్ధభటులకు ముఖ్యముగా నవలలును, సచిత్ర మాసపత్రికలును ఆవశ్యకములైయున్నవి. ఇతర విధము లగు గ్రంధములను కొందరు చదివెదరు. కాని అట్లు చదువువారు కొద్దిమంది. ఈగ్రంథాలయమునకు వచ్చు పచిత్ర మాసపత్రికల యొక్క చినిగిపోయిన కాగితములను బాగుచేయుటకును బరువు తగ్గునటుల ప్రకటన పత్రికలుగల కాగితములను మాసపత్రికలనుండి తీసివేయుటకును ముగ్గురు స్త్రీలు ఎల్లప్పుడును పనిచేయుచుందురు. ఆయాస్థలములనుండి యుద్ధభటులకై పంపబడిన గ్రంధముల యందప్పుడప్పుడు అపూర్వ గ్రంథములుగూడ కన్పట్టుచుండును. అట్టి అపూర్వ గ్రంధములను అమ్మి యుద్ధభటులకు కావలసిన ఇతర గ్రంథములను కొనెదరు. ఈయుద్ధ గ్రంథాలయము యొక్క పనులను నిర్వర్తించుటకై కావలసిన సొమ్మును అంతకు ఇద్దరు మహానీ ములిచ్చుచుండిరి. ఇట్లు ఆంగ్లేయులు, యుద్ధభటుల మనస్సులెప్పుడును ఉత్సాహమయములు, ఆనందమయములు గా నుండుటకు అనేకవిధముల పాటుపడుచున్నారు.


అమెరికాదేశము - గ్రంథాలయ ప్రదర్శనము.

౧౯౧౫ సం॥న "సాన్ ఫ్రాన్సిస్కో" నగరమునమున జరిగిన "పెనామా పసిఫిక్ ఎక్క్సు పొజిష౯” నందు ఆమెరికాదేశ గ్రంథాలయ సంఘమువారు గ్రంథాలను ప్రదర్శనమును జూపిరి. "క్యాలిఫోర్నియా” రాష్ట్రమున గల గ్రంథాలయముల పద్ధతినిజూపు గొప్పపటము నొక దానిని తయారు జూసిరి; ఇది నలుబది అడుగులు ఎత్తునుగలిగి గోడయంతయు నాక్రమించి యున్నది; ఆ రాష్ట్రము ఒక్కదానియందును జరుగుచున్న గ్రామ గ్రంథాలయములపని యంతయు అందు జూడనగును. ఈ ప్రదర్శనమునందు జూపబడినభాలశాఖ మిక్కిలి హృదయాకర్షకముగ నున్నది. చిన్నపిల్లలకు హృదయాకర్షకముగ నుండిన బొమ్మల పుస్తకములను ముందు భాగమునందుంచురి. వానికి తరువాత వరుసగానున్న ఏడుమంచెలయందు పిల్లలలో చిన్నవారికిని, పెద్దవారికిని ఉపయుక్తములగు గ్రంథములనుంచిరి. వారికి ప్రత్యేకము అనువుగనుండునట్టి కుర్చీలు బెంచీలు మొదలగునవికూడ ఏర్పాటుచేయబడినవి. ప్రతిదినమును పిల్లల యొక్క తల్లిదండ్రులు, సోదరులు, సోదరీమణులు, అత్తలు, మామలు మొదలగు వారందరును విచ్చేసి -