Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పత్రికను మూడు భాషలయందు ప్రచరించునట్లు చేయుచున్నారు. ఆపత్రిక బోధచేయుచున్న విషయములే మనదేశమం దిట్టి యుద్యమస్థాపనకు మార్గదర్శకమయినవి.

బరోడా రాజ్యమున జరుగుచున్న పనినిజూచినవారై అమెరికా సంయుక్త రాష్ట్రముల గ్రంథాలయసంఘము వారు గాయక్వాడీ గారిని గ్రంథాలయశాఖాధ్యక్షులగు కుడ్జోల్కరుగారిని తమ సంఘమందు గౌరవసభ్యులుగా జేర్చుకొనిరి.

ముగింపు.

బరోడాగ్రంథాలయ శాఖాధ్యక్షులగు శ్రీ కుడ్జోల్కరుగారికి ఆంధ్రదేశ గ్రంథాలయోద్యమరుందు గలయభిమానము కడుమెండు. వారు మనయుద్యమమునుగూర్చితరుచు జాబులమూలముగ సంజాయిషీని తెప్పించుకొని దానిని వారపత్రికయందు ముద్రించుచున్నారు. దూరమును౦డి వారిచే జూపబడుచున్న ప్రేమతో తృప్తినొందక స్వయముగా వారిని జూచివచ్చితిని. నేను బరోడా యందున్న కాలమున శ్రీ కుహోల్కరుగారును, లైబ్రరీ మిసలేనీ సహాయ సంపాదకుడగు దాదా ఛాంజీగారును, ప్రదర్శనమునుజూచుటయందేమి, కేంద్ర గ్రంథాలయమును దర్శించుటయందేమి, ఇంకను ఇతరవిషయములయందేమి అమితమగు సహాయమును జేసియుండిరి. ఇంతేగాక కేంద్ర గ్రంథాలయ సంచార గ్రంథ భాండాగార శాఖాధ్యక్షులగు యన్. సి. దివాంజి గారు నా కాతిధ్యమిచ్చి నేనక్కడ ఉన్న దినములు సుఖవంతములును సంతోషదాయకములును అగునటుల జేసిరి. వారికెల్ల కృతజ్ఞుడను. బరోడా నుండి తిరిగి వచ్చునప్పుడు బెజవాడ యందున్న రామమోహన ధర్మపుస్తక భాండాగారమునందు బాలశాఖ నేర్పాటుచేయుటకు కావలసిన పుస్తకములు ఆటలు మొదలగువానినెల్ల బొంబాయినుండి తీసికొనివచ్చితిని; తీసికొని వచ్చుటయేగాక ౧౭-౨-౧౭ తేదీన బాలశాఖను గూడ ఏర్పాటుచేసితిమి.

- అయ్యంకి వేంకట రమణయ్య.


గ్రంథ భాండాగారము.

సీ. తులలేని జ్ఞానవస్తువును జూపింపంగఁ దేజరిల్లెడు మహాదీప మెద్ది
సకల రాష్ట్రపు సమాచారముల్ దెలియంగ నలరెడు కరతలామలక మెద్ది
సర్వదేశముల పూజ్యతఁ గాంచు భారతీదేవికి రంగప్రదేశ మెద్ది
ఇది మంచి దిద్ది చెడ్డది యంచు నాశ్రిత జనులకుఁ దెల్పు నాచార్యుఁ డెద్ది


గీ. అట్టి పుస్తక భాండాలయమ్మువలనఁ । గలుగు లాభముల్ వచియింపఁగాఁ దరం బె
గాన దీన్యభివృద్ధికిఁ బూనవలయుఁ | దప్పకెప్పుడు నాంధ్రసోదరుృలార.


ఉ. జ్ఞానముకన్న మేర్ధనము గానఁగ రాదు ధరాతలంబున౯
దానికి సాధనంబయి గనంబడు విద్దియ గ్రంధమంది రా
ధీనము గాన నాంధ్రులకు దీనియ వస్యత నచ్చఁజేసి వి
జ్ఞానముఁ గూర్చుమంబ ! యనిశంబును దేశ్యభివృద్ధిగాంచ౯.

-జంధ్యాల వేంకటశివకవులు.