యెడల, ప్రభుత్వమువారి సహాయమును తీసివేయరు. ఇట్లు సహాయమును పొందు గ్రంథాలయములన్నియు ప్రభుత్వమువారి అధికారమునకు లోబడియేయుండును. ఏ జిల్లా పంచాయితీయైన గ్రంథాలయములకు సంబంధించినపనులకుని నియోగించుటకు గాను ప్రజలమీద పన్నులనువిధింప దలచినయెడల, ప్రభుత్వమువారు అచటి స్థితిగతుల నాలోచించి అనుజ్ఞ నొసంగెదరు. అట్టి పన్నును చదువను వ్రాయను సమర్ధతగలిగిన మనుజులందరి మీదను, ఒక్కొక్కనికి ఒక అణా లేక రెండు అణాలు చొప్పున విధించెదరు.
ఈ పద్ధతుల నను గురించి ఇప్పటివరకును బరోడాలోని కేంద్ర గ్రంథాలయముగాక ౪౦౦ గ్రామగ్రంథాలయములును, 38 పట్టణ గ్రంథాలయములును 3 జిల్లా గ్రంథాలయములును స్థాపింపబడియున్నవి. ఆరాజ్యమునందు ౪,౦౦౦ కన్న నెక్కువ జనసంఖ్యగల పట్టణములు 3౯ మాత్రము గలవు. ౧,౦౦౦ కన్న నెక్కువ జనసంఖ్యగల గ్రామములు ౪౨౬. బరోడా రాజ్యము యొక్క జనసంఖ్య ౨౦ లక్షలు మాత్రమే.
గ్రంథాలయములు లేని గ్రామములందలి ప్రజలును, చిన్న గ్రంథాలయములవారును, పుస్తకములు కావలెనను వాంఛను తెలియజేసినయెడల సంచార గ్రంథములనుంచిన పెట్టెలను ఆయాగ్రామములకంపెదరు. ఒక్కొక్క పెట్టయందు ౧౫ మొదలు 30 వరకు గ్రంధములనుంచెదరు. ఉపాధ్యాయులు, వ్యవసాయదారులు, పిల్లలు, శ్రీలు మొదలుగాగలవారికి వారిరుచుల కనుగుణ్యములగు గ్రంథములను జాగ్రత్తగ నాలోచించి ప్రత్యేకముగ పెట్టెలయందుంచి, కట్టుదిట్టముగ గట్టి ఆయాగ్రామముల కంపెదరు. ఆపుస్తకములు మూడుమాసములవరకు ఒక గ్రామమునందుఁడవచ్చును. అటుపిమ్మట తమగ్రామమునందున్న కాలమున ఎన్నిగ్రంథములు గ్రామస్థులకోసంగబడినవో, ఏవిధములగు గ్రంధములను జదివిరో, ఎంతమంది చదివిరో ఈవిషయములను తెలియజేయు ని వేదికతో, కేంద్రగ్రంధాలయాధికారికి ఆగ్రంధముల పెట్టె నంపి వేయవలెను ; ఉపయోగింపబడిన గ్రంధముల ననుసరించి తిరిగి గ్రామస్థులకు వారిరుచుల కనుగుణ్యము లైనగ్రంధముల పెట్టెలను ఆగ్రామములకు పంపుచుండెదరు.
గ్రంథాలయములు చక్షురసంయోగమువలననేగాక నిరక్షరకుక్షులకుకూడ జ్ఞానదాయకములుగా నుండవలెను, జ్ఞానమును ఆహ్లాదముతో ప్రజలు సంపాదించుకొనుటకు దగిన సదుపాయము లుండవలయును. ఇందులకు గాను సిని మెట్రో గ్రాఫులను, స్టీరియోస్కోఫులనుకొని ఆరాజుగారు కేంద్రగ్రంథాలయశాఖ కోసంగిరి. ఈశాఖీయోద్యోగులు ఈయంత్రములను తీసికొని రాష్ట్రమందలి గ్రామములకెల్లబోయి, ఈమూలమున దేశమందు జ్ఞానమును వెదజల్లుచున్నారు. గ్రంథాలయములను పరిపాలన చేయుటకు తగిన జ్ఞానము ప్రత్యేక అభ్యాసమువలన గాని యలవడదు. పాశ్చాత్యదేశములం దిదియొక ప్రత్యేకశాస్త్రమై విరాజిల్లుచున్నది. అనుభవమువలన ఈశాస్త్రమునందు నేర్పవలసిన సంగతులనంతముగలవు. అందుచేత బరోడా కేంద్ర గ్రంధాలయ సంస్థాపన కనుబంధముగ గ్రంథాలయ సంఘము నొకదానిని ౧౯౧౩ సంవత్సరము ఏప్రియలు నెలయందు స్థాపించిరి. ఇందు భాండాగారికులు తఱుచుగా చేరి తమతమ యనుభవములను పరస్పరము దెలుపు కొనెదరు. గ్రంథపరిశోధనాంశములనుగూడ చర్చింతురు. గ్రంథాలయ నిర్వహణము ప్రత్యేకశాస్త్రము. దాని నభ్యసింపజేయుటకు విద్యార్ధి వేతనములనిచ్చి ప్రత్యేకముగా ఒకపాఠశాలను ఏర్పరచి కొంతమంది నాశాస్త్ర మునం దారితేరినవారుగ జేసిరి. ఇట్లు బరోడా రాష్ట్రమందలి ప్రతిపట్టణమందును పల్లెయందును ప్రతిమనుజునకును జ్ఞానము దేవదత్తమగు వాయువువలెను నీటి వలెను సమృద్ధిగను వెలలేకను లభించుటకై గ్రంథాలయమును వానికంగములుగ వివిధశాఖలను, ఆమహారాజు స్థాపన జేసెనుగదా! అంతటితో తృప్తినొందక తమ యనుభవములను తాము స్ధాపించిన ప్రతిష్టాపనలయొక్క కార్యక్రమమును ఇతర రాష్ట్రముల వార్తలు కూడ నేర్చుకొని లాభముపొందుటకై తకుబొక్కసమునుండి విశేషధనవ్యయమునుజేసి సర్వాంగసుందరనుగు త్రైమాసిక,