Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలుగుగంటలైన తెరచియుంచవలెను. శలవుదినములు యందు రెండు గంటలకంటే ఎక్కువ కాలమే తెరచి యుంచవలెను. పట్టణగ్రంథాలయమును జిల్లా గ్రంధాలయమును ప్రతిదినము ౬ గంటలకు లెక్కువగాకుండ తెరచియు౦చవలెను.

గ్రామ గ్రంథాలయము పట్టణ గ్రంథాలయమునకు మూడుమాసముల కొకసారి, దానిపనిని తెలియజే యునట్టి రిపోర్టునంపవలెను. పట్టణగ్రంథాలయము దానిపనిని, గ్రామ గ్రంథాలయముల పనిని తెలియజేయున రిపోర్టును మూడుమాసముల కొకసారి జిల్లా గ్రంథాలయమునకంపవలెను. జిల్లా గ్రంథాలయము దానిపనిని, దాని క్రిందఉండిన గ్రామ, పట్టణగ్రంథాలయముల పనిని తెలిజేయునట్టి రిపోర్టును మూడు మాసముల కొకసారి కేంద్ర గ్రంథాలయమున కంపవలెను. ఒక జిల్లాయందు పట్టణగ్రంథాలయములు లేనప్పుడు, గ్రామ గ్రంథాలయములు జిల్లా గ్రంథాలయముతోనే ఉత్తర ప్రత్యుత్తరములను జరుపుకొనవచ్చును. ఒక జిల్లా యందు జిల్లా గ్రంథాలయముకూడ లేకుండిన, ఆజిల్లాయందున్న గ్రామ గ్రంథాలయములు కేంద్ర గ్రంథాలముతోనే ఉత్తరప్రత్యుత్తరములను జరుపుకొనవచ్చును.

ప్రభుత్వమువారి సహాయమును పొందుచుండు గ్రంథాలయములన్నియు వాని ఆదాయమును ఈ క్రింది విధముగ వ్యయపరుపవలయును:-

గ్రంధములు కొనుటకు ........నూటికి ౨౫ వంతులు.
పత్రికలుకొఱకు ....... ..... నూటికి 3౦ వంతులు.
అద్దెలు, సామానులు ........ నూటికి ౨౦ వంతులు
ఇతర ఖర్చులు ............ నుటికి ౨౫ వంతులు.

అనగా ఒక గ్రంథాలయమునకు సంవత్సరమునకు రు ౧౦౦ లు ఆదాయము వచ్చుచుండినయెడల, పైన వివరింపబడిన వంతుల ప్రకారము ఖర్చుపెట్టుకొనవలెను.

గ్రామ గ్రంథాలయములు పల్లెయందుండు ఉపాధ్యాయుని స్వాధీనమునందుగాని ఇతర పెద్దమనుష్యుని స్వాధీనమందుగాని ఉండును. పట్టణ గ్రంథాలయము ఒక భాండాగారిని ఇతర నౌకరులను ఏర్పరచుకొనును. గ్రంథాలయమంతయు భాండాగారియొక్క స్వాధీన మందేయుండు; దాని పరిపాలనకంతకును అతడే బాధ్యుడైయుండును. జిల్లా గ్రంథాలయమునకు ఇతర నౌకరులే గాక, కొందరు గుమాస్తాలు గూడ నుందురు. అవసరమునుబట్టి ఒకరుగాని అంతకంటే ఎక్కువమందిగాని భాండాగారులు ఉందురు. ప్రధాన భాండాగారి గ్రంథాలయశాస్త్రము నభ్యసించి, జిల్లాయందున్న గంథాలయముల పరిపాలనకు జవాబుదారిగ నుండును. జిల్లా, పట్టణ, గ్రామ గ్రంథాలయములన్నిటినిగూడ, ముగ్గురుకంటె తక్కువయు తొమ్మండుగురుకంటె నెక్కువయం కాని గ్రామస్తులు కార్యనిర్వాహక సంఘ ముగ నేర్పడి పరిపాలించెదరు. ఆయా గ్రంథాలయముల యొక్క చందాదారులు ఆయా గ్రంథాలయములకు ప్రతిసంవత్సరమును కార్యనిర్వాహక సంఘము నెన్నుకొనెదరు. క్రొత్త సంఘమును ఎన్నుకొనువరకును పొత సంఘమే పనిజేయుచుండును. సంవత్సర మధ్యమున కార్యనిర్వాహక సంఘమునందు వచ్చిన ఖాళీలన్నియు, ఆ సంఘమువారే పూర్తిపరచుకొనెదరు. ప్రతిగ్రంథా లయమును దానిపరిపాలనకు కావలసిన నిబంధనలన్నిటిని అదియే నిర్మించుకొనవచ్చును. అట్లు నిర్మించుకొన్న నిబంధనలకు నకలును గ్రంథాలయశాఖాధ్యక్షునకు బంపవలయును.

ప్రభుత్వమువారి సహాయమును పొందుచున్న గ్రంథాలయములన్నిటిని జాతి, మత, విచక్షణ లేకుండ సర్వజనులు ఉపయోగించుకొనవచ్చును. ఒక పట్టణమునందు గాని పల్లెయందుగాని ఒక గ్రంథాలయమునకు మాత్రమే ప్రభుత్వమువారు సహాయము చేసెదరు. ఏ గ్రంథాలయమైన సరిగ పనిజేయుట లేదని తోచినప్పుడు, అట్టి గ్రంథాలయమునకు చేయుసహాయమును తీసివేసెదమని ప్రభుత్వమువారు ఒక సంవత్సరమునకు ముందుగా ఆ గ్రంథాలయమునకు తెలియ బరచెదరు. ఈ సంవత్సరమునందు ఆగ్రంథాలయము తిరిగి మంచిస్థితికి వచ్చిన