బడినది. గ్రంథాలయములు పైనజెప్పబడిన ప్రకారము బరోడా రాజ్యమంతటను వ్యాపించి, వానివలన ప్రజలు నిజముగా నభివృద్ధిని బొందవలెనన్న, ప్రజలకు ముందు వానియందు అభిమానముగలుగవలెను. ఉచితముగా వచ్చినవస్తువునందు ప్రజలకంత యాదరణయుండదు. సొమ్మంతయు ప్రజలే ఖర్చుపెట్టి గ్రంథాలయములను స్థాపించుకొనవలయునని రాజు శాసించిన, ప్రజలయందు ఉత్సాహము లేక పోవుట చేతను దారిద్యముచేతను అట్టిపని సమకూడదు కావున ప్రజలయందు ఈ యుద్యముముపట్ల ఉత్సాహమును ఆదరణమును కలుగ చేయుటకును, గ్రంథాలయములు స్థాపించినవారికి పుష్కలముగ సొమ్ములభించుటకును శ్రీ శాయాజీ మహారాజుగారు కొన్నినియమముల నేర్పరచిరి.
ఏ గ్రామవాసులైన ఏబదిరూపాయిలకు గాని, అంతకంటె తక్కువమొత్తమును గాని తమ గ్రామమునందు నూతన గ్రంథాలయమును స్థాపించుటకుగాను వసూలు జేసి, కేంద్ర గ్రంథాలయమువారికి దెలియపరచినయెడల పంచాయితినుండి ఏబదిరూప్యములు నిప్పించి, తా మేబదిరూపాయిలనిచ్చెదరు. అనగా నూతన గ్రంథాలయమును స్థాపించుకొనుటకై ఏగ్రామవాసులైని ఏబదిరూపాయిల విరాళమును వసూలు జేసుకొనినమాత్రాన నూరు రూపాయిల విరాళమువచ్చును. ఇంతేకాక, ఇరువదియైదు రూపాయిల నిచ్చిన నూరు రూపాయిలు వెలువగల దేశభాషా గ్రంధములను కేంద్ర గ్రంథాలయము వారాగ్రంథాలయమునకు బహుమతిగా నిచ్చెదరు. బరోడారాజుగారి దివాను గారిచే నేమింపబడిన ముగ్గురుపెద్దలు గలిగిన సంఘమువారీ బహుమతి గ్రంథములను నిర్ణయించెదరు. ఆగ్రంధములను జనులెల్ల చదువుకొనుటకు హక్కును గలియుందురు. ఇతర నిబంధనలను ఆ యాగ్రంథాలయముల వారేర్పరచుకొనవచ్చును. కేంద్ర గ్రంథాలమునుండి పంపబడు సంచారపుస్తకముల పెట్టెలనుగూడ, ఈ గ్రామ గ్రంథాలములు తెప్పించు కొనవచ్చును. ఇట్టి గ్రంథాలయమునకు గ్రామ గ్రంథాలయమని పేరు. దేశభాషాగ్రంథములు గలిగిన పెట్టెలను మాత్రము ఈ గ్రామ గ్రంథాలయముల కంపెదరు.
నాలుగు వేలకంటే ఎక్కువ జనాభాగలిగిన గ్రామస్థులు రూ ౩౦౦ లను 3౦౦ లను గాని అంతకంటే తక్కువ సొమ్మును గాని సంవత్సరమునకు వసూలు చేసికొనిన పంచాయితీ నుండిగాని మునిసిపాలిటీ నుండి గాని సంవత్సరమునకు రు 300 లను, కేంద్ర గ్రంథాలయశాఖవారు సంవత్సరమునకు రు 3౦౦ లను ఒసుగెదరు. ఇట్టి గ్రంథాలయములకు పట్టణగ్రంథాలయములని పేరు. ఆంగ్లేయభాషా గ్రంథములు గలిగిన సంచారపుస్తకముల పెట్టెలను గూడ ఈ పట్టణగ్రంథాలయముల కంపెదరు. ఇట్టి పట్టణ గ్రంథాలయము, దానికి దగ్గరనున్న గ్రామ గ్రంథాలయములకు సంబంధించిన వ్యవహారములను జూచుచు ఆయా గ్రామములకు సంచార పుస్తకముల సెట్టెల నందుబాటు చేయుచుండవలెను. ఒక గ్రామమునందుగాని పట్టణపందుగాని ఒకటికంటె నెక్కువ గ్రంథాలయములను స్థాపింపవలసిన యావశ్యకతను గూర్చి కేంద్ర గ్రంథాలయమువారే యోచించెదరు.
ఏ జిల్లావారైన ఆజిల్లా ముఖ్యపట్టణమునందు జిల్లా కేంద్ర గ్రంథాలయమును స్థాపింపదలచి, సంవత్సరమునకు రు ౭౦౦ లను వసూలు చేయగలిగినయెడల, పంచాయితీ నుండి గాని మునిసిపాలిటీనుండిగాని సంవత్సరమునకు రు ౭౦౦ లను, కేంద్ర గ్రంథాలయశాఖవారు రు ౭౦౦ లను విరాళముగ నిచ్చెదరు. జిల్లా గ్రంథాలయము ఆజిల్లాయందున్న గ్రంథాలయములన్నిటిమీదను అధికారమును గలిగియుండును. ప్రభుత్వమువారి సహాయమును పొందుచుండు గ్రంథాలయములన్నియు కేంద్ర గ్రంథాలయ పరిపాలనకు లోబడియుండును. ఏ గ్రంథాలయమైన స్వంతభవనమును నిర్మింపదలచుకొని అందుకు కావలసిన సొమ్ములో మూడవ వంతును వసూలు జేసికొనినయెడల, మిగిలిన రెండువంతులలో ఒక వంతు సొమ్మును పంచాయితీయును మరియొక వంతు సొమ్మును కేంద్ర గ్రంథాలయమువారును ఇచ్చెదరు. ఆభవనముల యొక్క ప్లానులను మాత్రము కేంద్ర గ్రంథాలయమువారంగీకరింపవలెను.
గ్రామ గ్రంథాలయములు వారమునకధనము పదు