ర్వమే వీరు అక్కడక్కడ గ్రంథాలయములను స్థాపించి పనిజేసియున్నారు; వీరికి జీతము నెలకి ౧౫౦ లు. ఇంతేగాక ఉన్నతగ్రంధభాండాగారి యొకడు గలడు. వీరికి జీతము నెల ౧ కి రు 3౫౦ లు; సహాయ గ్రంధభాండాగారులు ఆరుగురుకలరు. వీరికి నెల ౧ కి జీతము ౩౫ లు. ఇద్దరు గ్రంథ భాండాగారిణులు గలరు. వీరికి నెల ౧ కి రు ౫౦ లు నిచ్చెదరు. ఒక సహాయ గ్రంథ భాండాగారిణిగలదు. ఆమెకు నెలకు ౨౦ రూపాయిల నిచ్చెదరు. గ్రంథాలయోద్యమమునకు సంబంధించిన పనులను నిర్వతి౯చుటకై పదునైదుమంది గుమాస్తాలు గూడ గలరు; వీరికి నలుబది రూపాయిలు మొదలు పదునేను రూపాయిల వరకును జీతమిచ్చెదరు. బంట్రోతులును చిల్లర పనులు చేయువారును కలసి ముప్పదిమందిగలరు. వీరికి ఆరు మొదలు పదిరూపాయిల వరకు జీతమిచ్చెదరు. ఈ కేంద్రగ్రంథాలయమును ఇప్పుడు నాలుగు అంతస్థులు గల గొప్ప మేడయందుంచినారు. ఈ మేడ శ్రీ ప్రభువుగారిదేయైయున్నది. స్వంతభవననిర్మాణమునకై ప్రయత్నములు జరుగుచున్నవి. అచిర కాలమున నే ఆరులక్షల రూప్యములు విలువ గలిగినట్టి సుందర మందిరములను నిర్మించి, అందీ కేంద్రగ్రంథాలయమునుంచెదరు. ఈ గ్రంథాలయశాఖకు నెల ౧ కి రు ౨,౫౦౦ లు ఖర్చుఅగును. పదు నైదు వేలరూప్యముల విలువగల నూతన గ్రంథములను ప్రతివత్సరమును గ్రంథాగారమునకు చేర్చుచుండెదరు. ఈ గ్రంథాగారమునందు ప్రతినిత్యముకు ౫౦౦ మంది చదువకులువచ్చి గ్రంధములను పత్రికలను చదువుచుండెదరు. ప్రతినిత్యమును ౨౦౦ మంది గ్రంధముల నిండ్లకు దీసికొనిపోవుచుండెదరు. ఈగ్రంథా గారమునందు పిల్లలకు ప్రత్యేక శాఖ గలదు. ఈ శాఖయందు పిల్లలు చదువు కొనుటకును చూచుటకును బొమ్మల పుస్తకములు విధివిరావములేకుండనున్నవి. గోడలనన్నిటిని బొమ్మలతో అలంకరించియున్నారు. ఇంతేగాక పిల్లలు ఆడుకొనుటకు పలువిధములగు చక్కని ఆటలుగలవు. పిల్లలకు కధలు చెప్పుట, వివిధ గ్రంధములందలి బొమ్మలను చూపించి బోధించుట, మంచిసగంతులు చదివి చెప్పుట ముదలగు పనులన్నియు స్త్రీగ్రంథ భాండాగారిణులులే నెరవేర్చెదరు. ఇంతేగాక బరోడాపట్టణమునగల సమాజములకు కూడ గ్రంథములనంపెదరు. ఈగ్రంధాలయమునుండి గ్రంథములను తీసికొనిపోగోరువారెవ్వరును ద్రవ్యమెంతమాత్రమియ్యనక్కరలేదు. ముప్పదిరూప్యముల జీతమునకు మించినట్టి ఉద్యోగస్థుడు గాని, వృత్తిపన్ను నిచ్చువారుగాని, భూమిపన్ను నిచ్చువారుగాని, లేక న్యాయవాది వృత్తి నవలంబించినవారు గాని జవాబుదారిగానున్న యెడల అట్టివారికెల్ల గ్రంధముల పేరుచెచ్చెదరు. గ్రంథములకు పదునైదు దినములుంచు కొనవచ్చును.
ఉచిత గ్రంథాలయముయొక్క లాభములను ఒక్క బరోడాపట్టణమునకే గాక, రాజ్యమునంతకును గూడ కలుగజేయవలెనని శ్రీ గాయక్వారుగారు ఈ యుద్యమమును ప్రారంభించినారు. రాష్ట్రమందున్న నగరముల యొక్కయు పట్టణములయొక్కయు పెద్దపల్లెలయొక్కయు చిన్న పల్లెల యొక్కయు సంఖ్యను, వానియందున్న జనసంఖ్యను చదువకులసంఖ్యను ప్రధమమును దెలిసికొనిరి. ఒరోడానగరముతో గలుపుకొని నాలుగు నగరములును 3౯ పట్టణములును ౪౨౬ పెద్దపల్లెలును ౨౪౨౮ చిన్నపల్లెలును ఆరాజ్యమునందు ఉన్నట్లు లెక్క తేలినది. బరోడానగరమునందు కేంద్ర గ్రంధాలయమును స్థాపించినారు. ముందు బరోడా రాష్ట్రమందున్న నగరముల యొక్కయు పట్టణముల యొక్కయు పెద్దపల్లెలయొక్కయు చిన్నపల్లెలయొక్కయు సంఖ్యను, వానియందున్న జనసంఖ్యను, చదువరుల సంఖ్యను, ప్రధముముగా దెలిసికొనిరి. బరోడానగరముతో గలుపుకొని నాలుగు నగరము ౩౯ పట్టణములును ౪౨౬ పెద్దపల్లెలలును ౨౪౨౮ చిన్నపల్లెలును ఆరాజ్యమునందు ఉన్నట్లు లెక్క తేలినది. బరోడానగరమునందు కేంద్ర గ్రంధాలయమును స్థాపించారు గనుక మిగిలిన మూడు నగరములందును, ఆనగరములు పట్టణములుగాగల జిల్లాలందలి గ్రంథాలయములన్నిటికిని అందుబాటులో నుండునట్లుగా ౨౦,౦౦౦ పుస్తకములుగల గ్రంథాలయములుండునట్లును ౩౯ పట్టణములలోను ఒక్కొక్కచోట ౫,౦౦౦ పుస్తకములుగల గ్రంథాలయములను స్థాపించుటకును - ౪౨౬ పెద్దపల్లెలలో ఒక్కొక్కచోట ౫,౦౦౦ గ్రంధములుగల గ్రంథాలయముల నేర్పరచుటకును, మిగిలిన చిన్నపల్లెలయం దొక్కొక్కచోట ౨౧౦ గ్రంథములుగల గ్రంథాలయముల నేర్పరచుకొనుటకును తీర్మానించి పనిజేయ నారంభించిరి.
అంతట కేంద్ర గ్రంథాలయముయొక్క అధికారము క్రింద ఈ గ్రంథాలయోద్యమమును బరోడా ప్రభుత్వమువారి పరిపాలనయందొక శాఖగనేర్పాటుజేయ