రపత్రములమీద వ్రాయబడిన మహా గాయత్రీభాష్యము యొక్కయు, దేవీ సూక్త భాష్యముయొక్కయు వ్రాత ప్రతులు చూపబడినవి. మఱియు అర అంగుళముపొడవు పాతిక అంగుళము వెడల్పుగలిగిన చిన్న గ్రంధములుగ ముద్రింపబడిన భగవద్గీత, కొరాను, షేక్స్పియరు నాట మొదలగు గ్రంధముల సేకములు ప్రదర్శింప బడినవి.
వ్యవసాయము, పరిశ్రమలు, కళలు మొదలగు శాస్త్ర విషయములను గూర్చిన ౬౦౦ గ్రంధములు ప్రదర్శింప బడినవి. మరియు, ఈవిషయములను గూర్చి వివిధ దేశము లయందు ప్రకటింపబడు పలువిధములగు పత్రికలను గూడ ప్రదర్శించిరి, "కోడ్" అను బొమ్మలను జూపు సినిమాయంత్రమును, ఒక మ్యాజిక్కు లాంతరును, మామూలు పటములనన్నిటిని తెరమీద చూపించునట్టి " రేడియో ఆప్టికన్ " అను యంత్రమును, పెద్ద స్టెరియోస్కోపును, స్టెరియో గ్రాఫులను ఇరువదింటిని ప్రదర్శించిరి. పిమ్మట గ్రంథాలయములయందు అచ్చుపనులు అతిసులభముగా చేసికొనుటకు అనుకూలముగనుండు నట్టి " రెంప్రింటర్ ” అను యంత్రమునుగూడ ప్రదర్శించిరి. ఈయంత్రము వలన అతిస్వల్పకాలములో వేలకొలది ప్రతులను దీసికొ నవచ్చును. ఇన్ని విధముల గ్రంథాలయ ప్రదర్శనభాగము ప్రదర్శనమునకంతకును రాజమై యొప్పినదని చెప్ప వచ్చును. ఈ ప్రదర్శనమునందు ప్రతిదినమునందును రాత్రి 7 గం టలు మొదలు 9 గంటలవరకను సినెమెటాగ్రాఫు ప్రద ర్శనముగూడ ఉచితముగా జూపబడినది. దీని ఖరీదు పది వేలరూపాయిలు. ఎల్లప్పుడును బరోడా రాజ్యమునందు సంచరించుచు జనులను జ్ఞానవంతులుగ జేయుచుండును. ఇందు జూపబడు బొమ్మలతో బాటుగ వానికి సంబం ధించిన విషయములను గూర్చి ఉపన్యాసములను గూడ ఇచ్చి, జనులనుద్బోధించుచుందురు. ఈ సినిమోటాగ్రాఫు ప్రదర్శనమును జూచుటకై ప్రతినిత్యమును అనేక వేల మంది పురుషులును స్త్రీలును గూడ విచ్చేసి యానందమునందోలలాడుచుండిరి.
గ్రంథాలయోద్యము_బరోడా.
బరోడా “సంస్థానాధీశులగు శ్రీ శాయాజీ గాయ క్వాడీ గారు ఆధునిక కాలమున భరతఖండమందు గ్రం థాలయోద్యనుమును స్థాపించుటయందు మార్గదర్శకులై యున్నారు. ౧౯౧౦వ సంవత్సరమునందీయుద్యను మా దేశమునందు ప్రారంభమైనది. అమెరికా దేశమునందు విశేషయనుభవమును గలిగి యున్నట్టి బోర్డను దొర గారిని శ్రీవారు ఆవత్సరమునందు పిలిపించి కేంద్రగ్రంథాలయ మును బరోడాపట్టణమునందు స్థాపించిరి. గ్రంథాల యోద్యమము సరియైన మార్గముల నడచునట్లు చేయుట కును, అందుబాటులోనున్న గ్రంథాలయములన్నియ అన్యోన్యాశ్రయములుగా నుండునటుల చేయుటకును, కేంద్రగ్రంథాలయ ప్రతిష్టాపన స్థాపింపబడినది. శ్రీవారు స్వయముగా చదువుకొనుటకై వివిధ విషయములను గూర్చిన అమూల్య గ్రంధములను ౨0,000 లను సేక రించి తమస్వంత గ్రంథ భాండాగారముగ ఉపయోగిం చుచుండిరి. ఈ గ్రంధములనన్నిటిని కేంద్ర గ్రంథాలయ మున కిచ్చి వేసిరి; ఇప్పుడా గ్రంథాలయమున ఆంగ్లేయ ము, గుజరాతి, మహారాష్ట్ర గ్రంథములు ౭0,000 లు గలవు. ఈ గ్రంథములందు అపూర్వములును అమూల్య ములును అగు గ్రంధములనేకములు గలవు. గ్రంథము లన్నియు నవీన శాస్త్ర పద్ధతుల ప్రకారము వర్గీకరణము శాస్త్రపద్ధతుల చేసి మంచిస్థితియందుంచినారు. ఈ గ్రంథ భాండాగార మునకు ఉన్నతాధికారిగా జె.యస్. కుడల్కారుగా రున్నారు. వీరు అమెరికా ఐరోపా జపాను మొదలగు పాశ్చాత్య దేశములకు బోయి పదునారుమాసముల కాల మునుగడపి, ప్రపంచమునందున్న గొప్పగ్రంథా గారము లన్నిటిని జూచివచ్చిరి. ఈ యుద్యమమునందు ఆయా దేశ ములందెల్లజనులు ఎట్లు అభివృద్ధిమార్గములను ద్రొక్కు చున్నారో వారు స్వయముగ జూచివచ్చి, ఆయాపద్ధతు లవన్నిటిని ఇచట ఆచరణయందు బెట్టుటకై ప్రయత్నిం చుచున్నారు. వీరికి జీతము నెల ౧కి రు.౨౫౦ లు. వీరికి సహాయము జేయుటకై సహాయఉన్నతాధికారి గలడు. వీరి పేరు యం.ఎన్.అమీన్. బరోడాయందు రాజు గారు గ్రంథాల యోధ్యనుమును ప్రారంభించుటకు పూ