Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వలసిన గ్రంధములు, ఉపాధ్యాయులకు గావలసిన గ్రంధములు - స్త్రీలకు గావలసిన గ్రంథములు — ఇట్లు ఏతరగతి జనులకు కావలసిన గ్రంధముల నాయాతరగతుల క్రింద, ప్రత్యేకముగా చిన్నచిన్న పెట్టెలయందు పెట్టె ఒక్కంటికి ౨౫ గ్రంధములు చొప్పున పెట్టి, జనులు చదువుకొనుటకై గ్రంధాలయములు లేని గ్రామములకెట్లు పంపుచున్నారో వేరొకచోటజూపిరి. బరోడాయందున్న నాలుగు జిల్లాల యొక్క పెద్దపటములను వేటొకచోట వ్రేలాడగట్టిరి; ఆ మాజిల్లాలయందున్న వివిధతరగతుల గ్రంధాలయములుగల గ్రామములను వివిధరంగుల సూదులచే జూపిరి. బరోడా రాజ్యమునందు గ్రంధాలయోద్యమమును ప్రారంభించిన పిమ్మట గ్రంధాలయములు అభివృద్ధి ఎట్లున్నదో, అంతకు పూర్వమెట్లున్నదో చూపు పెద్దపటము నొకదానిని అందరకును బాగుగ గనపడునట్టి స్థలమునందు పెట్టిరి. దీనికి ప్రక్కనే పిల్లలచే తయారుచేయబడిన చిన్నవనము నొకదానిని ప్రదర్శించిరి.

వేరొక స్థలమునందు అమెరికా దేశమునందును, ఐరోపొదేశమునందును, ఇటలీ దేశమునందును, జపానుదేశమునందును గల వివిధములగు జాతీయ గ్రంథాలయముల యొక్కయు, సార్వజనిక గ్రంథాలయముల యొక్కయు పెద్ద పెద్ద పటములను వ్రేలాడ గట్టినారు. అమెరికా, ఐరోపా దేశములయందలి గొప్ప గ్రంథాలయముల భవనముల యొక్క ప్లానులనుగూడ తయారుచేసి వ్రేలాడ గట్టినారు. మిక్కిలి ప్రాచీనమైనట్టి గ్రంథాలయముల యొక్క పటములనుగూడ సంపాదించి చూపినారు. గ్రంథాలయముల యొక్క పటములన్నియు మొత్తము ౩౨౪ గలవు.

మఱియు బరోడాయందున్న కేంద్ర గ్రంథాలయమునకు కట్టబోవు నూతన భవనము యొక్క ఆకారమును జూపు పటములు కొన్ని ప్రదర్శింపబడినవి. బరోడా గాయక్వారుగారిచే సహాయముచేయబడుచున్న గ్రంథాలయముల భవనముల యొక్క పదునాలుగు పటములను, పట్టణ గ్రంథాలయముల కుండవలసిన భవనముల యాకారములను జూపు అయిదు పటములను గూడ జూపిరి. పాశ్చాత్య దేశములయందెల్ల ప్రసిద్ధికెక్కిన వాషింగుటను, న్యూయార్కు, బర్కు లీ౯, బోస్టను, సెంటులూయిసు, మాంచెస్టర్, లివర్పూలు గ్రంథాలయములయొక్క పటములు మిక్కిలి సుందరముగ నున్నవి.

మఱియొక స్థలమునుదు గ్రంథాలయమున కుండవలసిన బల్లలు, కుర్చీలు, బీరువాలు, పత్రికలుపెట్టి ప్రదర్శించుట కనుకూలముగనుండు అలమరలు, క్రొత్తరకపు గ్రంథముల పట్టికలు, పుస్తకములను - పెద్ద గ్రంథా గారములయందు ఒక స్థలమునుండి మరియొకచోటికి దీసికొనిపోవుటకు చిన్నచిన్న బండ్లు, మొదలగువాని నెన్నిటినో ప్రదర్శించినారు. ఇంతే గాక ఉక్కు బీరువాలలో పలు విధములగు వానిని ప్రదర్శించి వానియొక్క ఆధిక్యతను గూర్చి బోధించిరి. పిల్లలు కూర్చుండుటకు అనుకూలముగనుండునటుల ఎత్తుతక్కువగనున్న కుర్చీలు, కుర్చీమీద కూర్చుని, చదువుకొనుచు వ్రాసికొనుటకు అనుకూలముగ నుండులాగున ప్రత్యేకముగ తయారుచేయబడిన కుర్చీలు - మొదలగువానిని కూడ ప్రదర్శించిరి. సిన సామానులను జూపినారు.

గొప్ప గ్రంథాలయములయందలి నిత్య వ్యవహారము జరుగుట కగత్యములకు అనేక సాధనములను విపులము గా వేరొకచోట జూపిరి. ఇంతేగాక సిరాబుడ్లు, అద్దుడుకాగితములదిమ్మలు, గుండుసూదులు గుచ్చుకొని బల్లమీద పెట్టుకొను దిమ్మలు, కలములు, పలువిధములగు సిరాలు, రబ్బరుస్టాంపులు, తారీఖులు వేసికొను స్టాంపులు మొదలగు ఉపయోగకరములగు వస్తువులను విశేషముగ జూపినారు. ఇంతేగాక, ఆనేకవిధముల పుస్తకముల బ్రెండింగులను- పదునారు, పదు నేడు శతాబ్దములయందు చేసినబైండింగుల నమోనాలను, ఈ కాలమున చేయుచున్న జైండింగుల నమోనాలను చూపివారు. మఱియు తోలు, క్యాలికో, వివిధములగు కాగితములు, జిగురు, మొదలగు బైఁడింగు సామానులను గూడ విశేషముగ జూపిరి. మిక్కిలి ప్రాచీనములును అపూర్వములును అగు తాళపత్ర గ్రంథములనేకములనుగూడ ప్రదర్శించిరి. భూర్ణ