దాదాచాంజీ గారిని రయిలుస్టేషనునకు పంపిరి. వారితో గూడ బయలు దేరి నాకొఱకు ఏర్పరుపబడిన బసయందు సామానులను బెట్టి, ప్రదర్శనస్థలమునకు బోతిని. పది ఎకరములు విశాలము కలిగిన గొప్ప మైదానమునందు ఈ ప్రదర్శన మేర్పరుపబడినది. ఈ స్థలమునకు చుట్టును ప్రదర్శనశాలలను గట్టి, మధ్యభాగమునంతను విధములగు జలయంత్రములతోడను, వివిధములగు దీప స్థంభములతోడను, వి౦తలకు గొల్పుచుండు రాతి బొమ్మలతోడను అలంకరించిరి. దీపముల వేళ యగుసరికి ప్రదర్శనాస్థలమంతయు రెండువేల విద్యుచ్ఛక్తి దీపములతో దేవీప్యమానముగ వెలుంగుచు ఎంతయు దర్శనీయమై యొప్పుచుండెను. ప్రదర్శనమంతయు ౧ వ్యవసాయము ౨ అడవి పదార్థములు 3 పరిశ్రమలు ౪ విద్య ౫ పుస్తకాలయము అని ఐదు భాగములుగ విభాగము జేయబడినది.
వ్యవసాయభాగమునందు - బరోడారాజ్యమున పండు వివిధములగు ధాన్యములు, అవి పండించుటకు గల నూతన విధానములు, వాని కుపయోగమగు నూతన పరికరములు మిక్కిలి విపులముగ ప్రదర్శించిరి. పైరులను పాడు చేయునట్టి అనేకరకముల పురుగులను, వానియొక్క వివిధావస్థలయందు ప్రదర్శించిరి. ఇంతేగాక పలువిధములగు పూలచెట్లను, పుష్పములను, పండ్లచెట్లను పండ్లను గూడ ప్రదర్శించిరి. మహారాజాగారి స్వంతతోటనుండి పండ్లచెట్లయొక్కము పుష్పములు చెట్లయొక్కయు గింజలను ఉచితముగా పంచి పెట్టుచుండుటచే ఈ చెట్లను పట్టణమునందంతటను విశేషముగా బెంచుచున్నారు. బరోడారాజ్యమునందు నూటికి ఎనుబదిమంది వ్యవసాయమువలన జీవించుజనులై యున్నారు. అందుచేత మహారాజాగారు వ్యవసాయాభివృద్ధి విషయమై విశేషముగ శ్రద్ధను వహించుచున్నారు. 3౫ సంవత్సరముల క్రిందట మహారాజాగారు సింహాసనము నెక్కినప్పుడు గొప్ప వ్యవసాయ ప్రదర్శన మొకటి చేయబడినది. అప్పటినుండిము వ్యవసాయకుల స్థితిగతులను బాగుచేయుటకై మహారాజాగారు పలువిధముల పాటుపడుచునే యున్నారు. రాజ్యమునంతను క్రొత్తగా సర్వే చేయించి, భూమియొక్క ఫలసాయమునుబట్టి పన్నుల నేర్పరచిరి. వ్యవసాయశాస్త్రము నభ్యసించుటకై అమెరికా, ఐరోపా దేశములకు విద్యార్థుల సంపుటయేగాక, ఈ సంస్థానమునందొక వ్యవసాయపాఠశాల గూడ స్థాపించిరి. విద్యార్థులు స్వయముగా చూచి నేర్చుకొనుటకును, మంచి విత్తనములు పండించి, రైతులకు పంచిపెట్టుటకును పరిశోధక పొలముల నేర్పాటుజేసిరి. ఇంకను పలువిధముల వ్యవసాయమభివృద్ధి చెందుటకై ఈ ప్రదర్శన మేర్పాటు జేయబడినది.
అడవిపదార్థశాఖయంను, ఒరోడారాజ్యమునందున్న అడవులయందు దొరకునట్టి, పలువిధములగు వృక్షజాతులు, ఖనిజములు ప్రదర్శింపబడినవి. ఇంతేగాక ఆ యడవులయందు సంచరించునట్టి పలువిధములగు అడవిమృగముల చర్మములు, శ్రీ బరోడా మహారాజుగారిచే స్వయముగా చంపబడిన అడవి మృగముల స్వరూపములు గూడ జూపబడినవి.
పరిశ్రమల నభివృద్ధిచేయుటకై బరోడాయందు ప్రత్యేక మొక్క శాఖను శ్రీ గాయక్వారు గారు చాలకాలము క్రిందటనే ఏర్పరచిరి. ౧౯౦౬ వ సంవత్సరమున శ్రీవారు అమెరికా దేశమునుండి తిరిగి వచ్చినప్పుడు ఈశాఖాధ్యక్షుతను వహించుటకై ఆ దేశమునుండి ఒక శాస్త్రజ్ఞుని తీసికొని వచ్చిరి.
ఎగుమతి దిగునుతి పన్నులను తీసివేయుటయేగాక తగిన ప్రోత్సాహమును గూడ ఇచ్చుచుండిరి. అందుచేత ఈరాజ్యమునందు పరిశ్రమలు విశేషముగ నాభివృధ్ధి చెందినవని చెప్పుట కొంతమాత్రమును సందియములేదు. ఈగాజ్యమునందే చేయబడి, ప్రదర్శనమునందు జూపబడిన పలువిధములగు సీమెంటుపరులు, బ్రషులు, టోపీలు, బట్టలు, మొదలుగాగల వివిధ పరిశ్రములన్నియు, పరిశ్రమభివృద్ధిని చాటుచునేయున్నవి.
విద్యావిషయమునగూడ ఈ రాజ్యము కొఱతవడియుండలేదు. నిర్బంధ ప్రారంభ ఉచితవిద్య నెలకొల్పబడినది