బరోడాయాత్ర
ఈ వత్సరమున నాల్గవ గ్రంథాలయప్రతినిధుల మహాసభ గంజాం జిల్లా "బారువ" గ్రామమునందు జరుగునని *[1]ఎల్లరకును తెలిసిన విషయమే.
"బారువ” యందు ఈ వత్సరము జరుగు గ్రంథాలయ ప్రతినిధుల సభతో పాటు గ్రంథాలయ ప్రదర్శనమును గూడ ఏర్పాటు చేయవలెనని ఆలోచించితిమి. గ్రంథాలయ సర్వస్వము మొదటి సంపుటము యొక్క రెండవ సంచికయందు “మహేళన" గ్రంథాలయ ప్రదర్శనమును గూర్చి తెలిసికొనిన చదువరులకు గ్రంథాలయ ప్రదర్శనమన నేమియో తెలియదని తలంపను.
ఈ ప్రదర్శనము యొక్క ఆవశ్యకతను గూర్చి పలుపురతో ఆలోచింపగా, అందరును ఉత్సాహముతో గూడిన ప్రోత్సాహము నే జూపిరి. అందుచేత కార్యమమునకు గడంగుటకై ఆలోచించి, ఈ ప్రదర్శనమును నిర్వహించుటకై కొన్ని ప్రదర్శనార్హములగు వస్తువుల నంపి సహాయము చేయవలసినదని కోరుచు, మన సంఘమునకు ఉపాధ్యక్షులగు సూరి వేంకటనరసింహశాస్త్రి గారు, బరోడా గ్రంథాలయ శాఖాధ్యక్షులగు శ్రీ జే.యస్.కుడల్ కార్ గారికి ఉత్తరమును వ్రాసిరి . అందుమీద వారు ౧౯౧౭ సం. జనవరి ౨ వ తారీఖు మొదలు ౯ వ తేదీవఱకు బరోడాపట్టణమందు వ్యవసాయక పారిశ్రామిక ప్రదర్శన మొకటి జరుగనున్నదనియు, అందు గ్రంథాలయ ప్రదర్శన శాఖ డ ఏర్పరుపబడుననియు, ఆప్రదర్శనమునకు ఎవరినైన ప్రతినిధి నంపినయెడల, వీలయిన ప్రదర్శనములను దీసికొని పోవచ్చుననియు ప్రత్యుత్తరమిచ్చిరి. ఈ లేఖ వచ్చునప్పటికి నేను గ్రామమునందు లేను. కొంచెము పనిగలగి అమలాపురము తాలూకాకు బోయి యుంటిని. పని తీరిన పిమ్మట అమలాపురం, రాజోలు తాలూకాలయందున్న కొన్ని గ్రంథాలయములను దర్శింపుచు కొంత కాలహరణమును వేసితిని.
బరోడాయందు జరుగు ఈ గ్రంథాలయ ప్రదర్శనమునకు బోవుటకై శ్రీ సూరివేంకటనరసింహముగారు తెలంచిరి . కాని వారి న్యాయవాదివృత్తి యందుండునట్టి జవాబుదారీనిబట్టియు, పనితొందరమునుబట్టియు అట్లు చేయజాలకపోయిరి. శ్రీ గోపరాజు బ్రహ్మానందమురును పోవలయునని తలంచిరి; కాని గృహకృత్యసంబంధములైన ఇబ్బందులచే పోజాలక పోయిరి. అందుచేత బరోడా నుండి వచ్చిన ఉత్తరమును నాకు చేరుటకై అమలాపురమునకు బంపిరి. కాని నేను అక్కడక్కడ తిరుగుచుందుటచే ఆ ఉత్తరము నాకందలేదు ఇంతలో డిశంబరు నెల 3౦ వ తారీఖు వచ్చినది. నేను నా ప్రయాణమును ముగించుకొని ఇంటికి వచ్చితిని. వచ్చునప్పటికి విశేషముగ పడిశభారముగా నున్నది. కొంచెము దగ్గుకూడ వచ్చుచున్నది. కాలిమీద ఒక పెద్ద కురుపు లేచి యున్నది పాదము యొక్క ఒక వ్రేలికి ఎదురుదెబ్బ తగిలి విశేషము బాధపెట్టుచున్నది. ఇట్టి స్థితియందు బరోడాప్రయాణమును గూర్చి చెప్పిరి. ఇంతే గాక అచటికి వెళ్ళుటకు ఖర్చులకుగాను నలువది రూప్యములనుగూడ శ్రీ నూరి వేంకటనరసింహము గారు తెచ్చియిచ్చిరి. అట్టి స్థితియందు వెళ్ళకుండనుండుటకు నాకు తోచకపోయినది అందుచేత దైవము మీద భారమువైచి జనవరి ౨ వ తేదీ రాత్రి బయలుదేరి ౪ వ తేది ఉదయమునకు బొంబాయి చేరితిని. బొంబాయి నుండి ఆరాత్రియే బయలు దేరి ౪ వ తారీఖు ఉదయమునకు బరోడా రయిలుస్టేషనునకు చేరితిని. నన్ను తీసికొనిపోవుటకై “లైబ్రరి మిసలేనీ" పత్రికయొక్క సహాయ సంపాదకులును, బరోడా కేంద్రగ్రంథాలయమునందు
గ్రంధభాండాగారులలో నొకరును ఆగు బి.యమ్.
- ↑ ఈ సభ జరు గుటకు పూర్వమే ఈ వ్యాసము వ్రాయబడినది.