లిఖిత పుస్తక కేంద్రాలయము *[1]
౧. రమ్యాంధ్రరాష్ట్ర హర్మ్య బందు రాజిల్లు లేని నిధానమౌ దీపకాంతి
భాషాబ్ధి పైఁ దేలి వ్యాపించు సద్గ్రంథ నౌకావితతి రక్షణ స్థలంబు
వరపండిత కవీళ భాషాభిమానులన్ కీరాదులకు సహకారవనము
భువి శాశ్వతంబగు పూర్వవిజ్ఞాన సద్విత్తంబు దాచెడు పెట్టెయనఁగ
నలరు పూర్వ సద్గ్రంథకేంద్రాలయంబు - నాంధ్రభోజుండు శ్రీపీఠికావనీశుఁ
డాదరింపగ నిరుపమఖ్యాతితోడ - జగతి వర్ధిల్లగలదు నిస్సంశయముగ.
౨. పురువు నోళులఁ బడి పొలిసిపోయినవెన్ని యగ్ని కీలల దగ్ధమైన వెన్ని
వరద పాలైపోయి వార్థిఁ జేరిన వెన్ని శిధిలంబులై రూపుమా సెడిన వెన్ని
చిన్నపిల్లలు వేడ్కఁ జింపివేసినవెన్ని మాత్రంపుకోతల సురిగె నెన్ని
పరుల చేతులఁ బడి పాడైనవియెన్ని యితరవిధంబుల నెగిరె నెన్ని
పోయినవి పోవ మిగిలిన పుస్తకముల - నైనఁ జేర్చి కాపాడ మేలంచుఁ దలంచి
ఘన యశఃకాములౌ చెలికానివారు - పూనుకొన్నవారాంధ్రుల పుణ్యమునను.
౩. గ్రంథముల్ గలవారు ప్రచురింపనొల్లరు ప్రచురించువారికి వదలఁబోరు
ప్రతివ్రాసి దానిఁ గాపాడ గాఁజూడరు ప్రతి వ్రాయ నెరవీయఁ జాలుపడరు
తాము చదివియైనఁ దన్మహత్తును జెప్ప దొరులకుఁ జూపింప నొల్లకుంద్రు
సొమ్ము గైకొనియైనఁ జూపింపఁ దలఁ బో రున్నను లేదనుచుందు రకట
గోవు నదలించు పచ్చికఁ గుక్క తినదు - వెఱిపద్ధతి యిఁకనైన విడిచిపెట్టి
పుస్తకంబులఁ జేర్చుచు బ్రోవరయ్య - శాశ్వతంబగు పూర్వవిజ్ఞాన మహిమ.
౪. సర్వజనాహ్లాద సంధాయ సుగుణగణములు సువర్ణ పర్ణములు గాఁగ
ఔదార్య పరిమళం బనయంబు ప్రకటించు సరసోక్తతీతి పుష్పచయము గాఁగ
శ్రితజనాధారమై చెలఁ గెడి కరుణారసంబె స్వాదు మకరందంబు గాఁగ
కరుణతోఁ బరులకుఁగావించు సత్కార్యకాండముల్ సత్ఫల గణముగాఁగ
విబుధసన్నుత శ్రీకల్పవృక్షమువలెఁ - తెలఁగు సూర్యరాయ ప్రభు జ్యేష్ఠసుతుని
యక్షరాభ్యాస శుభసమయమున నిలిపె - వృద్ధిఁబొందును యువరాజ విద్యతోడ.
౫. నివరింప సూక్ష్మమౌ విత్తనంబునఁ బుట్టి పెనుమఱ్ఱి విరబాకి పెరుఁగునట్లు
ఆదిలో నొకయంగతో దాటఁ గు నేఱు తుద కామడవెడల్పు తొడరునట్లు
తొలుత లొడి తెడు నెమిలిపింఛము పించము తుది బారెడై వన్నెల వఱలునట్లు
మొట్టమొదట చిన్న మెట్టమె చివరకు పెద్ద పర్వతముగాఁ బెరుఁగునట్లు
మీగుచేయు సత్కార్యంబు మేదిని పయి - దినదినాభివృద్ధినిఁచెంది తేజరిల్లు
ధర్మగుణకాయ చెలికాని ధర్మరాయ - ఆర్యవినుత లచ్చారాయ సూర్యరాయ.
- ↑ వీరి కాపురమునందు ఆంధ్రవరిశోధక మహామండలి వారినే స్థాపితమైన లిఖితపుస్తక కేంద్రాంధ్ర గ్రంథాలయ ప్రారంభోత్సవ సమయమున శ్రీ ఆచంట సూర్యనారాయణరాజుగారిచే జదువబడినవి.