Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాద్వలము


చ.⁠

 నవనవలాడు లేగసవు ♦ నారులలోపల మంచు చిన్కు ల
న్నువచెలువంబులీనఁగ వి ♦ నోదముగాఁ దృణజీవికీటముల్
రవము లొనర్పఁగాఁ గలువ ♦ రాయఁడు వెన్నెలఁ గాయుచుండ నీ
నవకము నేత్రపర్వము నొ ♦ నర్పదొడంగును శాద్వలస్థలీ

⁠

.

చ౦.⁠

 విచ్చినగడ్డిపూవులొక ♦ వింతఘటింపఁగ మొల్కలెత్తు లే
బచ్చిక లీడురాని చెలు ♦ వంబును సారెకుఁ గుమ్మరింపఁ గా
ర్చిచ్చానరించినట్టి విపరీ ♦ తమునుండి విముక్తమైన నీ
యచ్చపుఁ జెల్వమెన్న వశ ♦ మా విధికేనియు శాద్వలస్థలీ

⁠

.

ఉ.⁠

 జంపుగసాగు లేగసవు ♦ జాడులలో మొగముంచి చూపుల౯
సొంపులుమీఱ నల్లఁ జను ♦ చు౯ మెడలెత్తుచు లేడిపాళెముల్
గుంపులుకూడి నద్దెసలఁ ♦ గ్రుమ్మరు వేళల నీదుచెల్వ మూ
హింప వచింప శక్యనుగు ♦ నే! కవికేనియు శాద్వలస్థలీ

⁠

.

చ.⁠

 పరువపు గడ్డిపూవు లోక ♦ ప్రక్క విచిత్రరుచిప్రచారముల్
గఱప, ప్రఫుల్ల పుష్ప తృణ ♦ కాండము తావుల ప్రోవులీన లే
గఱికి పొలమ్ము లబ్బురముఁ ♦ గల్పనఁ జేయ శరత్తునందు సుం
దరముగ జవ్వనంబునఁ ద ♦ నర్తువు నీవిల శాద్వలస్థలీ

⁠

.

చ.⁠

 అనినఁగందు లే జివురు ♦ టాకులలోఁ దుహినాంబు బిందువుల్
ఫోనలు దేఱి సామ్యుదిత ♦ సూర్యకరప్రకరమ్ముచేతఁ జీ
ల్వైన విచిత్ర వర్ణముల ♦ యారజము౯ వెలిబుచ్చువేళ యె
వ్వానికి నీవు సమ్మదము ♦ పైకొనఁ జేయవు శాద్వలస్థలీ

⁠

.

చ.⁠

 ఇరుదెసలంటి పాఱు సెల ♦ యేళులలో జనియి౦చు ఱెల్లు వూ
సరములు సాటిరాని రుచి ♦ సంపదఁ 'గూర్ప'దటద్యయ౦బున౯
బెరిగెడి తుంగమోసు లొక ♦ వింత ఘటీంపుచు నుండ ధారుఱీ
తరుణికిఁ జిత్రవస్త్రము వి ♦ తంబున నుందువు శాద్వలస్థలీ

⁠

.

ఉ.⁠

 తావులుగల్గు పూవులును ♦ దాఁకినఁ గందు చివుళ్ళు, కిందొగ౯
గావినిగేరు లే గఱికి ♦ కాడలు గల్గి పొసంగు చక్కనౌ
తీవెలు, నల్ గెలంకులను ♦ దీఱిచి నట్టులఁ గానవచ్చుట౯
ద్రోవరులెల్ల నిన్నుఁ గని ♦ తోషముఁ గాంతురు శాద్వలస్థలీ

⁠

.