Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యినుటచే మల్లారెడ్డి యప్పటికిఁ గౌమారదశయందున్నటు లూహించుట పొగపాటు, కుమారపదము పూర్వపదముతో నన్వయింపఁదగినది. ఎట్లయిననేమి పంతులు వారు చేసిన కాలనిణ౯యము సరియైనదికాదు. ఇంక శాఖానిణ౯యము, జన్మస్థాన నిణ౯యమును చర్చింతము. “ఇతఁడు (మల్లారెడ్డి) రాజమహేంద్రవరము పాలించిన వీరభద్రారెడ్డి బంధుఁడని తోచుచున్నది” అని పంతులువారు వ్రాసియున్నారు. వీరభద్రారెడ్డిఁ, మల్లారెడ్డిఁ నొక రెడ్డి పదిమునఁ దక్క సంబంధము లేదని మేము వ్రాయుచున్నారము. వీరభద్రారెడ్డి పంటరెడ్డి కులమువాఁడు. అనితల్లికలువచేఱు శాసనములో

శ్లో.⁠

 తేషాం వేమన రేశ్వరోక్షతిభుజాం
ధర్మార్థనామగ్రణీ.......
ప్రమత్పంటకులోద్భవ౯......అని యున్నది.

⁠

ఎఱ్ఱాప్రగడ హరివంశములో

సీ.⁠

 పంటకులస్వామి ప్రఖ్యాతుఁడౌర వే
మయ పితాన వ. హుఁడనుమాన్యతయును”

⁠

అని యున్నది. వీరభద్రారెడ్డి వేమారెడ్డి బంధువులలోని వాఁడెకదా! దీని బట్టి యద్దంకి రాజధానిగఁ బాలించిన వేమభూసాలుని వంశము వీరభద్రారెడ్డి వంశము పంటరెడ్డి వంశమని తెలియుచున్నది. మల్లారెడ్డి వ౦శము పాకనాఁటిరెడ్డి వంశమని శివధర్మోత్తర ఖండమున

ఆ.వె.⁠

అట్టిపాక శాటి యన్వయంబ నెడి క్షి రాబ్ధి” అనియు

⁠

భద్రాయురభ్యుదయమున (ఈ గ్రంధరత్ని మీ వంశీయులకే యంకితము గావింపఁబడినది)

క.⁠

 ఆపాక నాటివంశో ౹
ద్దేపకుఁడై కామినేఁడు”అనియు,

⁠

ఉమాపత్యభ్యుదయమున

సీ.⁠

 సమదవేదండ దేహము డుస్సిపోనీ టె
నాటువా రిల పాకనాటివారు. . . . . .

⁠
క.⁠

 ఆపావన వంశంబున
దిపింపఁగఁ బోడమె కామినేడు”. . . . .

⁠

అనియు నీ వంశము చెప్పఁబడుట నేతద్వంశీయులు పాకనాటి రెడ్డివారని తేలినది. ఉభయులకు బాంధ వ్యాధికములు వీరేశలింగము పంతులువారున్నటు లూహించిరికాని యది సరికాదని స్పష్టపడుచున్నది. ఇఁకఁబంతులు వారు మల్లారెడ్డి జన్మస్థానవిషయమున "ఈ మల్లారెడ్డి...గోదావరి మండలములోని బిక్కనవోలు సంస్థాన ప్రభువు" అని నిర్ధారణ చేసియున్నారు. దీనికాధారము పట్చక్రవతి౯ చరిత్రములోని గద్య “ఇది శ్రీ బిక్కనవోలు పట్టణ ప్రసిద్ధ సరస్తటావలంబ సిద్ధరామేశ్వర” అని బిక్కనవోలు పేర్కొనబడి యుండుటచేతను, ఆగ్రామము గోదావరి మండలమునఁ గానవచ్చుటచేతను, ఆప్రాంతముల రెడ్డివారు పాలించియుండుటచేతను మల్లారెడ్డి గోదావరిమండలవాసియని శ్రీ పంతులవారూహించిరి. ఇది ప్రమాదము. పట్టమట్ట సరస్వతి సోమయాజిగారి నూతసంహితను బరిశోధించిన నీ సంశయము తీరునది. మల్లారెడ్డి నివాసస్థానమగు బిక్కనోలు నిజాము రాష్ట్రములో హైదరాబాదునుండి ఇందూరుకుఁబోవు రైలుమార్గమున నున్నది. తద్వందీయులు సమీపస్థమగు దోమకొండలో సంస్థానము స్థాపించి నిజామువారికి సామంతులై నేఁటికి రాజ్యము పాలించు చున్నారు. ఇందులకు శివధర్మోత్తరఖండమునఁ బెక్కు లాధారములు కలవు.

మ.⁠

 ఘనుఁడాకాచనృపాలశేఖరుఁడు ము౯
గర్ణాట దేశంబునం
దున దుర్గాధిపతిత్వవైభవము తో
డ్తోఁ గాంచి సుల్తాను పి
ల్పునఁ గృష్ణానది దాఁటి యామెదుకుబల్
దుర్గంబుక్రింద౯ జిరం
తనమౌ బిక్కనవోలనుండె నది యా
త్రస్థాన రాజమ్ముగ౯

⁠