Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

గ్రంధాలయమునుగూర్చి ఆసంఘ కార్యదర్శిరును, జెప్పుచు, తాము తమతకు గ్రామములయందు గ్రంథాలయములకొరకై పడిన కష్టములను గుర్చియు సంపాదించిన అనుభవములనుగూర్చియు వివరించిరి. ఈ సంఘముల వృత్తాంతములు పరస్పరము సంప్రదించుకొనుట వలన ప్రతినిధులందరును విశేషానుభవమును సంపాదించిరని జెప్పుట కెంతమాత్రమును సందియములేదు. ఈవృత్తాంతములు జదివిన పిమ్మట ఖర్మంమెట్టు గ్రంథాలయము నుండి వచ్చిన ప్రతినిధులగు హరి భాపయ్యగారు “గ్రంథాలయములు - ఆంధ్రవాఙ్మయము" అను విషయమును గూర్చి ఉపన్యాసమును జదివిరి. అనంతరము ఈతీర్మానములు జరిగినవి:-

(1) తంజావూరు మహారాజుల యొక్క లిఖిత పుస్తక భాండాగారము ఆంధ్ర మహారాష్ట్ర ప్రభువులకాలమున బుట్టి, మన దేశీయులకు మిక్కిలి యుపయోగకారిగ నున్నది. కావున అగ్రంథభాండాగారమును విదేశములకు పోకుండ నకట్టి దానిని చెన్నపణమునందున్న ప్రభుత్వమువారి ప్రాచ్యలిఖిఁత పుస్తకభండాగారమున గాని, ఆంధ్రసాహిత్య పరిష,ద్భాండాగారమునగాని జేర్చుటకు ప్రభుత్వమువారిని ఈసభవారు కోరుచున్నారు.

(2) ఈజిల్లాయిందున్న గ్రంథాలయములన్నియు, గ్రంథాలయోద్యమవ్యాప్తికై ప్రతివత్సరమును తమ తాలూకా సంఘమున కొకరూపాయియు, తమ జిల్లాసంఘమున కొకరూపాయియు, ఆంధ్రదేశగ్రంధభాండాగార సంఘమున కొకరూపాయియు, మొత్తము సంవత్సరమునకు 3 రూపాయిల చందా నియ్యవలెనని ఈసభవారు తిర్మానించుచున్నారు.




కం. ఊరెల్ల మాటువ నలి | ఘోర తపన తాప బాధకు జీవంబుల్ నోరుదెఱచి హెచ్చెపదగ | తీరక పడియుండె నెడలు, దెలియక ధరశిక్షా . గీ. కూడుగుడ్డకు లేక యెక్కు సవయస్సు | గడచి యాలు కలంత బడవలసిన ముసలిబిచ్చగాఁకొంటియైమూల్గుకొనుచు | ప్రాఁత చెప్పులీర్చుచు నిండ్లు వట్టితిరుగు. చ. కలిగిన కోమలాంగి ములు గంపను బోలె బర్వు వస్తులు దులిపి జీలుంగుపయ్యెద మెథముల్ గనుపింపగ బైనగప్పి తలహరిచందనంబలది 4 తల్పముపై మెవాల్చి ముద్దుల జీలుకఁబఠించి క౯ ముకుచుఁ జే విడు పొత్తము Tమ్ము నిల్పగ౯. తో ఉ. ప్రొద్ద`న మావి పై ఁ గొన చివుళ్ళను మేసి గళంబుకిన్నెర తద్దయు పంతమాడుచు విదల్చి కుహూ కుహు కూ స్వనంబుల బెగ్గ ప్రతిధ్వనుల్ గొలిపి వెచ్చనిగాడ్పుల మండుటెండల మొద్ద, గొంతు సాచికొని నోర్వడి కోయిలనిల్చుఁ గొమ్మపై. E గీ. నన్ను బోలిన వింత మొ౦దములు గొన్ని | జాతి మత సంఘవిహిత శాసనము లెల్ల గడన సేయ కగాధలో కంబు తమకు। నెట్టి బింబంబుగొలుపునో యెంచుచ్చుకు. పాటిబండ అప్పారావు.