Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

విద్యాభోగకరీ యశస్సుఖకరీ
విద్యాగురూణాం గురుః
విద్యాబంధుజనో విదేశగరు నే
విద్యాపరాదేవతా
విద్యారాజసుపూజ్యతే నహీధనం
విద్యావిహీనః పశుః "భర్తృహరి”


తే.గీ. విద్యయొసఁగును వినయంబు వినయమునను
బడయుఁబాత్రత పాత్రతవలన ధనము
ధనమువలనను ధర్మంబు దానివలన
నైహికాముష్మిక ఫలంబులందు నరుఁడు.

అని పూర్వులు విద్యాధనము ప్రశస్తమయినదనియు విద్యపరార్ధ సాధకమనియుఁ వాకొని యున్నారు. విద్యవలనఁగలుగు లాభములు వేఱుగాఁ జెప్ప నవసరములేదు. విద్యాజ్ఞానశూన్యుఁడు ద్విపాదపశువరునను విషయము మన మెఱింగినదే. ఎక్కార్యమున కేని ఎట్టివానికేని విద్య తోడ్పడితీఱును. వ్యవసాయమున కేమి వత౯కమునకేమి వ్యవహారమునకేమి విద్యవలెంఁ దోడ్పడునది మఱియొకటిలేదు. ఏ కార్యముననేమి ఏరూపముననేమి ఘనత సంపాదించుటకు విద్యయే భిక్షము. విద్యావంతుండేందున్నను పూజనీయుఁడె. విద్యలేనిదేశ మధోగతిపాలు కాఁగలదు. అజ్ఞానాంధకారమునఁబడి తెన్ను గానక గిలగిలలాడు మనదేశము జ్ఞానసూర్యకిరణప్రచారమున నచిరకాలమున నున్న తదశంగాంచుగాఁత. బరోడారాష్ట్రమువలె మనదేశముగూడ విద్యాభివృద్ధి కావలయువనిన గ్రంథాలయముల నెక్కువగస్ధాపించి విద్యావృద్ధులు దేశాభిమానులు తమజీవిత సర్వస్వము నిందులకు ధారపోయవలయును. అట్లు వారొనరించినగాని భాండాగారముల యుపయోగములు లోకమునకుఁ దెలియఁజాలవు. తెలిసినఁగాని సర్వజనుల నాకషి౯౦పఁగలశక్తి భాండాగారమునకున్నగాని సాటిదేశీయులతోఁ బాటు మన దేశీయులు విధ్యుక్తధర్మముల నెఱుంగఁజాలరు. విధ్యుక్తధర్మమెఱింగినగాని స్వదేశ సేవఁజేయనివాఁడు జీవచ్ఛవంబని యెఱుంగలేకు. భారతీయులు స్వదేశాభిమానులైననేగాని మనహూణప్రభువులు మనము స్వపరిపాలనార్హులకుని తలంపఁజాలరు; అట్లు వారెఱిఁగిననేగాని భారతీయులునిష్ప్రయోజకులను పేరు సాటిదేశములయందంతరింపదు. కావున మదీయసోదరులారా! నరజన్మ మెత్తినతరువాత దేశాభిమానము భాషాభిమానము లేకున్న మనజన్మము పశుజన్మమగునని గుఱుతెఱింగి స్వదేశమందు విద్యాభివృద్ధినొనర్చి దేశసేవఁజేసి భారతీయులపేరు ప్రతిష్ఠల నిలుపుదరని ని ప్రార్ధించుచున్నాను. భారతమాత మనకెల్లవిధముల తోడ్పడుఁగాఁత. శ్రీమత్పరదేవత మనకు సర్వశక్తుల ప్రసాదించును గాత.

కార్యక్రమము

అగ్రాసనాధిపతిగారి యుపన్యాసమయిన పిమ్మట కృష్ణాజిల్లా గ్రంథాలయ సంఘ కార్యదర్శి దుర్గిరాల వేంకట సుబ్బయ్యగారు తాము ఈ సంవత్సరమున జేసిన పనినిగూర్చియు జరిగిన అభివృద్ధిని గూర్చియు విపులముగ జెప్పిరి. అంతట దంటు సుబ్బావధానులుగారు గ్రంథాలయములను గూర్చి జెప్పిన పిమ్మట, జగ్గయ్యపేటయందు ధర్మగ్రంథాలయము నొకదానిని స్థాపించుటకు తీర్మాన ముపపాదింపబడినది. ఆతీర్మానమునకు ఫలితముగ అగ్రాసనాధిపతి గారు రు ౧౧౬ లను, గ్రామస్థులు రు 3౨ం లను చందాలనిచ్చెదమని వాగ్దానము జేసిరి. అనంతరము గ్రంథాలయముల ఉపయోగమునుగూర్చి పురాణం సూరి శాస్త్రులుగారును, ఆంధ్రదేశగ్రంథాలయోద్యమమును గూర్చి అయ్యంకి వేంకటరమణయ్య గారును, ఉపన్యాసములనిచ్చిరి. పిమ్మట అంగలూరు గ్రంథభాండాగార చరిత్రను దుగ్గిరాల వెంకటసుబ్బయ్యగారును, కొణకంచి గ్రంథాలయమును గూర్చి కొణకంచి చక్రధరరావుగారును, చెరుకుమిల్లి గ్రంథాలయమును గూర్చి దాట్ల వేంకటపతి రాజుగారును, బెజవాడ తాలూకా సంఘమును గూర్చి రొయ్యూరి రామచంద్ర ప్రసాదరావుగారును, ఆకువీడు గ్రంథాలయమునుగూర్చి నండూరి రామదాసుగారును, ఆకిరిపల్లి గ్రంథాలయమునుగూర్చి గ.అప్పయ్యశాస్త్రిగారును, చింతలపాడు