నివసించువారు జ్ఞానశూన్యులుగానుంటచే నీ కార్యము పల్లెటూళ్ళవారి కెక్కుడు పయోగకరము. మన దేశము నిర్బంధ విద్యకు నోఁచుకొనలేదు. కావున గ్రంథాలయములవారు రాత్రి పాఠశాలల నిల్పి, పగలు చదువుకొనఁ జాలని వారలకు తమ వ్యయముతో విద్య నేర్పి, ధర్మ విద్యావాన మొనర్చి జనసామాన్యమునకు జ్ఞానము ప్రసాదింపవలయును. మఱియు ముద్రిత గ్రంథములఁ గొన్నిఁటీని సేకరించి యొకచోఁ గూర్చినంతనే దానికి గ్రంథాలయనును పేరొప్పదు. ప్రతి గ్రంథాలయమువారును అముద్రితగ్రంధములను, దాళపత్రగ్రంథములకు సంపాదించి గ్రంథాలయముల నలంకరింపవలయును. ముద్రిత్తగ్రంధములను మన నవీనుల క విధముల మార్చి మూల కవుల యభిప్రాయముల చెఱచియున్నారు. అట్టి సందేహ నివృత్తికై యచ్చుపడిన వేనియు లిఖిత గ్రంథముల సం పాదించవలయును మన పెద్దలు పఠించు గ్రంథస్థములు కాని చాఁటుపద్యములను, ఆఁడువాండ్రు, కాపులు, పాడు పాటలను సామాన్యులు చెప్పికొను చారిత్రోగ్బోధకములగు కధలను గ్రంథాలయములు ముఖ్యముగా సమకూర్పవలయును. “ఇంటదాల్చి రచ్చ గెలువవలె” నను సామెతజ్ఞాపకమందుచుకొని మన చెయిజారికంటికగపడక ఖండాంతరములకు దేశాంతములకుఁ బోవనున్న లిఖిత పుస్తకములకై తొలుతయత్నించి పిమ్మట ముద్రిత గ్రంధములకొఱకు యత్నించుట యుక్తము. మనముపేక్షయొనరించుకొలంది, అటుకుల పైబడి దుమ్ముకొట్టికొని రానురాను వినాశనమునొందనున్న నష్టశేషములగు మహాకవికృత మహాగ్రంధములు నశించును. కాన నిది శీఘ్రముగ్గఁజేయఁదగినది. ముద్రిత గ్రంథముల సంపాదించుటలో నించుక యాలస్యము కలిగినను మునిగిపోవునది లేదు గాని వ్రాతప్రతులార్జించుటలో వాలసించిన గ్రంథములు నామరూపములు లేకుండఁ బోవును. ఇందులకై యొకగ్రంథాలయమువారేగాక ప్రత్యాంధ్రుఁడు యత్నింపవలయును, ఆంధ్రసాహిత్యపరిషత్తువారు కొలఁదికాలములో నైదు వేల తాళపత్తగ్రంధములను ఆంధ్రపరిశో- ధకసభవారు ౧౬౦౦ లిఖితగ్రంథములను నిన్న మొన్న నార్జించిరి. కర్ణాటకదేశమునను నిజాము రాష్ట్రమునను ద్రావిడదేశమునను నేఁటికి లిఖిత పుస్తకములు కలవు. ఇందు మాటికి పదియేని కడకొకటేని యముద్రితగ్రంథము లభింపకపోదు. సకాలములో లిఖితగ్రంధముల నార్జించి మన మెల్లరము గ్రంథాలయ ప్రదర్శనములకు యత్నింపవలసియున్నది. దైవానుగ్రహమువలనను సరస్వతీ వరప్రసాదమువలనను మనమీ ప్రదర్శనముఁ గూడ కొలఁదికాలములో నేర్పఱచుకొన శక్తులనుమగుదుము గాక.
ఆంధ్రదేశ కేంద్ర గ్రంథాలయము.
ఆంధ్రదేశమునఁ బ్రస్తుతమున్న గ్రంథాలయములలో భాషాగ్రంధములన్నింటిని సమకూర్చుట దుర్ఘటకార్యము. కాన నింతవఱకుఁ బ్రచురింపఁబడిన ముద్రణగ్రంథములతోడను దేశమున జీర్ణించుచున్న తాళపత్ర గ్రంధములతోడను ఆంధ్రదేశమధ్యమున కేంద్రగ్రంథాలయ మొకటి ముఖ్యముగా స్థాపింపవలయును. కేంద్రగ్రంథాలయములేనిది భాష వృద్ధిలోనికి రాజాలదు. దీనికి దొరతనమువారి సహాయము ఆంధ్రమహాజనుల సాహాయ్యము ముఖ్యముగాఁ గావలయును. ఇదినూతనాంశము కాదు.
గ్రంథాలయములభివృద్ధిగనున్న ప్రతిదేశమందు నిట్టి కేంద్రగ్రంథాలయములు కలవు. కేంద్ర గ్రంథాలయముల యందు దేశమున వాడుకలోనున్న ప్రతిభాష యందలి గ్రంధములు జాగరూకతతో సమకూర్పవలయును. ఇతర గ్రంథాలయములయందున్న యముద్రిత గ్రంధప్రతులు సంపాదించవలయును. కేంద్రగ్రంథాలయము స్థాపించు వఱకు శిశుగ్రంధాలయము లభివృద్ధిలోనికి రాజాలవు. ఇది యాంధ్రులంద అకముఖమునఁ జేయఁదగిన కార్యము.
గ్రంథాలయములవలని లాభములు.
గ్రంథాలయములవలన మనకు ముఖ్యముగా విద్యా లాధముకలుగును, విద్యయమునది మానవులకు పరంపరాగతరుగు జ్ఞాననేత్రము. అది లేని మానవుఁడు చతుష్పాద జంతువులఁ జేరును. దానిఁ బూర్వకవులిట్లు వర్ణించిరి.
శ్లో౹౹ విద్యానామ నరస్యరూపమధికం
ప్రచ్ఛన్న గుప్తం ధనం