Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

వచ్చినచోట గ్రంథములు సంపాదించి పఠించి ఫలమనుభవింపఁగలరు. కాన నట్టివారికి మనము చేయునది సహాయమా? అట్టివారు గ్రంథాలయములకుఁ బ్రతినిధులుగ నుండి సమానబుద్ధితో జనసామాన్యమునకు నూతన వికాసముల గూర్చు విద్యాజ్ఞానముల బోధింపుట యుక్తము. మన దేశమునందలి గ్రంథాలయాధిపతు లిట్టివిధులాచరణలోనికిందెచ్చిన విజ్ఞానము ప్రజల నాకషి౯౦పక పోదు. గ్రంథపఠనమునం దాసక్తిఁగల విద్యావంతులకుఁ బుస్తకము లందింపఁగలము. విద్యకలిగి పఠనాశక్తి లేనివారి నెటులో యత్న మొనరించి చదువుకొనునట్లు లోసరింపఁగలము. ఇంతటితో మనము కృతార్థులము కాజాలము. పామరులకుఁగూడ విద్యయందలి శ్రేయోలాభము లెఱింగింపవలయును. గ్రంథాలయములు ముఖ్యముగా విద్యాగంధశూన్యులకొఱ కెన్నియో శ్రమలపడి వాండ్రకు విజ్ఞానము ప్రసాదింప వలయును. అప్పటికిఁ గాని గ్రంథాలయ గర్భితనుగు సంకల్పము ఫలవంతము కాదు. విద్యాగంధశూన్యులను బైస్కోపు, మ్యాజిక్ ల్యాండ్రి౯, సీనోమోటోగ్రాఫ్ లోనగు యంత్రములవలనను, హరికథానాటక పురాణో (ఉ) పన్యాసాది కాలక్షేపముల వలనను, సులభగ్రాహ్యములగు నుపన్యాసములవలనను జ్ఞానాభివృద్ధిఁ గలవారిగ గ్రంథాలయములొనరింప దీక్ష వహింపవలెను. భారతీయులలో వివిధైశ్వర్యములలో విద్యయే మిక్కిలి తక్కువగనున్నది. అందు స్త్రీ విద్య లేని దానిలోననే చేరినది. స్త్రీలలో నూటికిఁ గోటికొక్కర్తె యెట్టి గ్రంథము నైనఁ జదివి యర్థము గైకొనఁగలదేమో. చదువువచ్చిన స్త్రీలలోఁ గూడ నున్నత విద్య చాల తక్కువ. అట్టివారికి మనము శక్తివంచనలేకుండ దోడ్పడవలయును. మన మిప్పుడు గ్రంథాలయముల లోనికి హైందవ స్త్రీలు వచ్చునటు లేర్పాటు చేయలేక పోయినప్పటికి స్త్రీలయొద్దకైనను వారికర్థమగు సద్గ్రంథముల బంపుచు విద్యాభివృద్ధి చేసి స్త్రీ విద్య నున్నతి లోనికిఁ దేవలయును. ఇప్పుడు మన యాంధ్రదేశమున నున్న గ్రంథభాండాగారము లెవ్వియు స్త్రీ విద్యాభివృద్ధికి దృప్తికరముగఁ బనిచేయుట లేదు. మనము శ్రీవి ద్యావశ్యకతఁ దెలిసికొని తదభివృద్ధికై ప్రయత్నింతుము గాక.

జ్ఞానశూన్యులగు పంచషడ్వత్సరులగు బాలురను గూడ గ్రంథాలయము లాకర్షింపవలయును. భారతీయులకు గ్రంథాలయములపై ననురాగ షజ్ఞానదశలోననే కలిగినగాని దేశమభివృద్ధిలోనికి రాఁజాలదు. బాలకులే హైందవౌన్నత్య ప్రతిష్ఠానిర్వహణయోగ్యులు కావున వారిని మన మెల్ల విధములఁ గనెట్టవలయును. బాలురను పాఠశాలాధికారుల సాహాయ్యముచే భాండాగారములకు రప్పించి వాండ్రకుఁ దీఱికయైనపుడెల్ల భాండాగారములకు వచ్చునంతటి యభిరుచి కలిగింపవలయును. ఇందులకుఁగాను బాలురకు పయుక్తములగు నాట లేర్పఱుపవలయును. వీరుచూచి యానందించుటకు సద్భావబోధకములై చిత్రములైన చిత్తరువులుగల గ్రంథములను గ్రంథాలయములు సమకూర్పవలయును. వీరికిఁ దెలియునంపటి సులభ శైలిలో గొన్ని గ్రంథములు వ్రాయించి చదువుకొనఁగలవారి కొసంగి, చదువుకొనలేనివారి కందలి యంశములు బోధించి, జ్ఞానము కలిగింప గ్రంథాలయములు ముఖ్యముగాఁ బనిచేయవలయును. ఇట్టి గ్రంథములు ఆంధ్రభాషలో నరుదుగ నున్నవి. గ్రంథాలయములలో మహాపురుషుల చిత్తరువులు సమకూర్చి వాని వృత్తాంతములు బాలురకు బోధించుచుఁ బరీక్షలలోను నుతీర్ణులగు బాలురకు బహూకృతు లొసంగుచు బాలుర విద్యాభివృద్ధి ముఖ్యముగఁ జేయవలయును.

గ్రంథాలయములలో బ్రాహ్మణుఁడని వైశ్యుఁడని శూద్రుఁడని నిమ్న జాతీయుఁడని భేదము పెట్టుకొనరాదని నాయభిప్రాయము. జాతి భేదములు గ్రంథాలయములం దీపణ్మాత్రమేని గణింపరాదని సహేతుకముగ శాసింపవచ్చును. సాధ్యమైనంతవఱకు భాండాగారములకు స్వంతభవన మావశ్యకము. ఇవియన్ని యటులుండ సంచార గ్రంథాలయములు నెలకొల్పుట మిగుల నావశ్యకము. సంచార గ్రంథాలయముల వలనఁ బల్లెటూళ్ళ పౌరుల కుపయోగ మెక్కుడు కలదు. ముఖ్యముగా పట్టణవాస్తవ్యులకంటే పల్లెటూళ్ళ