మొదలు పండితోత్తముని వఱకు జనుల నెటుల నాకర్షింపవలయునో, ఆబాలగోపాలమున కెటుల జ్ఞానముఁ బ్రసాదింపవలయునో, చక్కఁగ గుఱుతెఱింగి ప్రస్తుత గ్రంథాలయాధికారులు సంచరించుట యుఁ-బ్రకృతము ముద్రణాది సౌకర్యములవలనఁ బొత్తములు సులభ సాధ్యములగుటయు - లోసగు నుపయోగములవలనఁ బూర్వము కంటె నేఁడె గ్రంథాలయములవలన నెక్కుడు జ్ఞానము సంపాదించు చుచున్నారమని నాయభిప్రాయము. మన పూర్వుల యున్నత జీవితాదర్శములగు చరిత్రలు పూర్వమునుండి మనకులేనందున భరతఖండమున వెండెందు గ్రంథాలయములు కలవో యేనియెటుల వృద్ధిక్షయములఁ గాంచెనో వారికోననవకాశములేకున్నది. గ్రంథభండాగారములుకూడఁ బూర్వము మనభరత ఖండమునఁ గలవని వ్రాయుటకుమాత్ర మొకటి రెండాధారములేని మనకు దొఱుకక పోవు, “నలంద" యను స్థలమున గ్రీ.శ.౭౧ శతాబ్దమున నొక విశ్వవిద్యాలయము గ్రంఢభాండారమునుండెననియు, అమరావతికి సమీపముననున్న ధరణికోటయొద్ద 25 గురు ఉపాధ్యాయులు గల విశ్వవిద్యాలయము గ్రంథాలయముకలదనియు శాసనాద్యాధారము లవలనఁ దెలియుచున్నది. ముఖ్యముగఁ బూర్వగ్రంథాలయములన్నియు దేవళములయందు మఠములయందు స్థాపింపఁబడెను. అప్పుడందలి గ్రంథములు నిమ్న జాతులకు లభింపకపోవుటయుఁ గేవల పండితులకుఁ దక్క సామాన్యుల కాగ్రంథములు లభింపకుండుటయులోనగు నిర్బంధములు పెక్కులు కలవు. క్రమక్రమముగ మన దేశమున మత ద్వేషములు ప్రబలుకొలందిని గ్రంథాలయములు, మఠములు, విశ్వవిద్యాలయములు లోనగు మానవుల పవిత్ర జీవితాదర్శములన్నియు రూపుమాసినవి. నామమాత్ర శేషములైనవి. క్రమశః శ్రీకృష్ణదేవరాయలు, తిరుమల దేవరాయలు, అన వేమారెడ్డి లోనగు విద్వన్నృపుల కాలమున భాషయు గ్రంథాలయములు పునరుద్ధరణము నొందెఁగాని, తురుష్కుల దాడులవలనను అరాజకములవలనను మనపవిత్ర గ్రంథాలయములు పరశురామప్రీతి నొందినవి. అప్పుడె మనకనులమూసి పాశ్చాత్యులు మన పవిత్రగ్రంధముల ఖండాంతరములకుఁ జేర్చిరి. ఇంకను మనదేశమున హృతశేషములగు నుత్తమగ్రంధములుక్వా చిత్కముగ లేకపోలేదు. కాన దేశీయులందరు గ్రంథాన్వేషణమణమునకుఁ గడంగుట యుక్తవిధియని విన్నవించు చున్నాను.
గ్రంథాలయముల కర్తవ్యము.
గ్రంథాలయమన నేదియో, దాని విధాయకకృత్యము లెవ్వియో జనసామాన్యమునకుఁ జక్కఁగ బోధపడనియాడ గ్రంథాలయముల కత౯కావ్యముం గూర్చి ముచ్చటించుట ప్రస్తుతము కాదు. ప్రథమమున గ్రంథాలయాధికారు లెట్టివారుగ నుండవలయును? అని విచారింతుము. ప్రతిభాండాగార ధికారియు పాఠకులయొక్కయెట్టి సందేహముల నేని నివృత్తిఁజేయఁగల శక్తి సామ౯ఢ్యములు కలవాఁడై యుండవలయును. వీరు తమ గ్రంథాలయమందలి యన్ని గ్రంథములను విమర్శనాదృష్టితో నామూలాగ్రము పరిశీలించియుండుట యుత్తమము లేక తమ గ్రంథాలయమునందలి గ్రంధముల గుణాగుణము లైనను బాగుగా నెఱింగి యుండవలయును. గ్రంథాలయాధికారి ప్రతిపాఠకుని తనకు సమానునిగబరిగణించుచు శాంతము, అహంకారశూళ్యము లోనగుసుగుణములలోఁగూడఁ భాఠకులకు మార్గదర్శకుఁడైయుండవలయును. గ్రంథాలయాధికారి తన జీవితము పరమార్థముకొఱకు ధారపోయువాఁడుగను ప్రియవక్తృత్వము కలవాఁడుగను, నీర్భరకార్యదీక్షాపరతంత్రుఁడుగను, పవిత్రప్రవత౯నము కలవాఁడుగ నుండవలయును. గ్రంథాలయాధికారి పాఠకులకు గ్రంథము లొసంగుటయుఁ గ్రమ్మఱ పుచ్చుకొనుటయు మాత్రమె తనవిధ్యక్తమని తలంపక, తగుపాటి విద్యాపరిచయము కలవారయ్యు భాషాప్రపంచము కన్నెత్తి చూడక తమకుఁగల తెలివి తేటల విద్యకై వెచ్చింపని సామాన్యజనులను భాసాభిమానులుగను జ్ఞానవంతులుగను యుక్తాయుక్తవివేకవంతులగను చేయుటకుఁ బాటుపడవలయును. ఇట్లనుటచే గ్రంథాలయాధికారి విద్యావంతులకు బుద్ధిమంతులకు సహాయముజేయ నవసరము లేదా యందురేమో! గ్రంథ పఠనాశక్తి కలవారొకగ్రంథాలయముననేగాక యిచ్చ