పట్టుదలతోఁ జేర్చిరి. ఈవర్ణనయుగము నే స్వతంత్రముగముగ భావించితిని. పలువురు లక్ష్మణోల్లంఘనము, గుణ విసర్జనము, రసాభాసము, కావ్యములలో కుప్పలుగాఁగుప్పిరి. రానురాను యక్షగానములు, గుమ్మెటకధలు, వీధి నాటకములఁకూడ నీ కాలముననే యభివృద్ధిలోనికివచ్చెను. ఆంధ్రభాష గ్రాంధికరూపముఁ దాల్చినపిమ్మట, నిటుల పూర్వోక్తక్రమముగ రూపత్రయముఁ దాల్చెను. పిమ్మట ఆంగ్లేయులు పరిచయమువలనను, క్రమప్రాప్తనుగు నాగరకతవలనను మనభాషకుఁ బూర్వారిష్టములు కొంతకఱకుఁ దొలఁగినవి. గర్భకవిత్వములు, చిత్రకవిత్వములు, యమకాదులు, కవితారసభంజకములును గల కావ్యములు నశించెను. నూతన భావన యాంధ్రుల హృదయదర్పణమునఁ బ్రతిఫలించెను. భాషకు విమర్శగ్రంధము లుత్పన్నములయ్యెను. గీర్వాణనాటకములకుఁ దెలింగింపులు బయలు వెడలెను. రానురాను భాషపూర్వావస్థలఁదొలంగి నేఁటికి కొంతవఱకు నూతనవికాసము వహించెను. ఇప్పటికి సర్వాంగ సుందరములగు కావ్యములు, భావబోధకములగు వచనకావ్యములు, పూర్వుల పవిత్రజీవితములఁ దెల్పుచరిత్రములు భాష కావశ్యకములై యున్నవి. ప్రాచీన కవుల సంప్రదాయములు వారల గ్రంధములు నేఁటికవులకుఁ గొన్నికొన్ని తావుల మార్గదర్శకములు కావలసివచ్చెను. ప్రతికవికిఁ దగుపాటి విమర్శనజ్ఞానము చరిత్రజ్ఞానము వతీమానకాలమున నావశ్యకముగ నుండవలసివచ్చుటచే భాషాసేవకులకు గ్రంథాలయములతో నక్కఱకల్గెను. ముద్రిత గ్రంథములన్నియు ప్రతికవియు సేకరించుకొనుటయు వ్యయప్రయాసలు భరించుటయు జనసామాన్యమునకుఁ గష్టముగాఁ దోఁచసాగెను. ఇట్టిపరివలి౯నముగల పందొమ్మిదవశతాబ్దమున నే ఎన్ని శతాబ్దములక్రిందనో యంతరించిన గ్రంథాలయములు పునరుజ్ఞాతమ్ము లయ్యెను. ఈ గ్ర౦థాలయములలోఁ గొన్నిఁటియందు ముఖ్యముగా లిఖిత గ్రంధములు శాసనాద్యాధారములు, దండెకవిలెలు ప్రోగుచేయఁబడెను. మఱికొన్నింటియందు ముద్రితగ్రంధములు మాత్రమే సేకరింపఁబడను. ఇపుడు ప్రతిగ్రంథాల యమువారును విధిగఁ బ్రాచీనకవుల కృతములై మాఱుమూలలఁబడి నామరూపములులేక నశింపనున్న యాదికవుల లిఖితగ్రంథములఁ బ్రచురింపఁదగిన యవసరముకలిగినది. జనసామాన్యమునకు భావయం దభిమాన మభివృద్ధినొందసాగెను. కావుననే ఐక్యక౦ఠ్యముగ మనము గ్రంథాలయముల నభివృద్ధి చేయవలసివచ్చినది. విద్యార్థులకు దేశికునికంటె గ్రంథాలయములెక్కుడు సాహాయ్యము చేయఁ దొడంగెను, భాషకు గ్రంథాలయములే జీవనాధారములు.
గ్రంథాలయముల ప్రాచీనత
మనము గ్రంథాలయోద్యమము పాశ్చాత్యులవలన నేర్చికొంటిని మనవారు భ్రమపడుచున్నారు. కాని ప్రాచీన కాలమునుండియు మనదేశమందు గ్రంథాలయములుకలవు. ఆకాలమున ముద్రణాది సౌకర్యములు లేవు గాన మిగుల ఇరుదుగనుండెడివి. ఇప్పటికిని మనము ప్రాచ్యలిఖిత గ్రంథశోధనకై బయలు వెడల నెన్నెన్ని మోయముద్రితాళపత్రగ్రంధములు లభించుచున్నవి. దానింబట్టి యగృహయజమానుని వంశీయులలోఁ బూర్వమెవరో యొక పండితుఁడొ యొక భాషాభిమానియో నాపుస్తకముల సేకరించెననియు, బ్రపంచము నాపొత్తముల వ్యాపింపఁజే సెననియుఁ దదితరులవలన వినుచున్నారము. మన గ్రంథాలయ నిర్వహణమిందు గర్భితమైయున్నది. ప్రాయశః మనకిట్టి చరిత్రాంశములకు శాసనాద్యాధారములుకూడ లభించుచునేయున్నవి. ఆకాలమున విద్యాభిమానులైన శ్రీమంతులగు ప్రభువులు గ్రంథాలయముల నెలకొల్ప నేర్చుట కష్టకార్యము కాదనుట నిర్వివాదాంశము. నేఁటికినిఁ గొన్ని కొన్ని సంస్థానములలో బండ్లకొలంది యపూర్వతాళపక్త్ర గ్రంధములు కానవచ్చుట యిందులకుఁ బ్రబలాధారము. పూర్వమువలె నిప్పుడును గ్రంథాలయములు మనదేశమునఁ గలవు గాని నాఁటికి నేఁటికిఁ బెక్కు తెఱంగుల భేదముండవచ్చును. రాను రాను దేశమున నవనాగరక దశ దినదినాభ్యుదయముఁ గాంచుచున్నందున గ్రంథాలయముల నిబంధనలధికమై భాండాగారమున కరుదెంచు పాఠకుల కెటుల సంతోషముఁ గూర్పవలయునో, గ్రంథాలయము కర్షకుఁడు