Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

జేసి భాషను మిక్కిలి వృద్ధిలోనికిందెచ్చిరి. ఆంధ్రభాషకు గీర్వాణసమ్మేళనము తాగినంతవఱకుంచి మధురమగు మార్గముఁ గని పెట్టినవారిలో నాద్యుఁడు నామతమున క్రీ. శ ౧౪వ శతాబ్దమున సుప్రసిద్ధుఁడని పేర౦దిన అనంతామాత్యమహాకవి. ఇతఁడు భోజరాజీయమున నూతనమార్గములు త్రొక్కి నూత్నభావముల కొన్ని భావనాశక్తి కవిత్వమున కెంతవఱ కేయేస్ధానముల నెంతెంతయుండ వలయునో విరళముగాఁ దెలియునటుల సవ్యమగు కధాకల్పనము తన భోజరాజీయమునఁ జూపి యున్నాఁడు. ఒక అనంతామాత్యుఁడే యన నేల! నన్నయ మొదలు శ్రీనాధునివఱకు భాష సలక్షణగ్రంధములతోడను, నూతన వికాసముల తోడను, ఉద్గ్రంధములతోడను వెలుగుచుండెను. ఆ కాలముననే ప్రబంధయుగ సూచన లుత్పన్నమయ్యెను. జక్కనమహాకవి వర్ణనా భూయిష్ఠముగ విక్రమార్కచరిత్రము వ్రాసెను. ప్రబంధ చిహ్నములు తగుమాత్రముగూర్చి పిల్లలమఱి పినవీరభద్రుఁడు శృంగార శాకుంతలము రచించెను. శ్రీనాధకవి స్వతంత్రపద్యరచనతోడను గీర్వాణవాక్యమయంబగు ధారతోడను గ్రోత్తరీతిని వైపధ, భీమఖండ, కాశీఖండాదుల రచించెను. ఈమువ్వురు కవులత్రోవలు తీసికొని పెద్దనాదికవులు ప్రబంధయుగ శక కర్తలైరి. నిజమునకుఁ ప్రబంధయుగకవులకు ధారకు శ్రీనాథమహాకవియు, వర్ణనాంశములకు జక్కనమహాకవియు, కధాకల్పసమునకుఁ బిన వీరభద్రమహాకవియు మార్గదర్శకులు 'బ్రత్యక్షమైరి.

ప్రబంధములు.

ప్రబంధ యుగమున సర్వవిధముల మొదటివాడుఁ పెద్దన. ఈయన పురాణకధలను ప్రబంధములుగ నెటులమార్భవలయునో, ఔచితి యెటుల గాపాడవలయునో, వర్ణనాంశము లెచట పెంచవలయునో, పాత్రపోషణ మెటులచేయవలయునో చక్కఁగ కొనునట్లు మనుచరిత్రము వ్రాసియున్నాఁడు. " అచటఁ బుట్టిన చివురుకొమ్మైనచేవ " అను పెద్దనగారి వాక్యమె యాయన యున్నత కవితా నిపుణతను సూచించును. రసపుష్టికొఱకీ కవిరాజు వరూధినీప్రవరాఖ్యుల సంభాషణమునందు చూపిన స్వభావోక్తు అనితరసాధ్యములు. ఈకాలముననే “శదేభాషలందు తెలుగు లెస్స" యను పవిత్రవాక్యము వెల్లడించి సంపూర్ణభావాకరవగు విష్ణుచిత్తీయము ప్రబంధముగ సంప్రదాయవర్ణనములతో శ్రీకృష్ణరాయలవారు రచించిరి. రాను రాను ప్రబంధయుగమున భాషకనేకమార్పులు కలుగనారంభించెను. భట్టుమూతి౯ శ్లేషలకుఁ శబ్దచిత్రములకు పాటుపడి ప్రబంధయుగమున కష్టపడి నూతనమార్గము తీసెను. ఆవలివారఁదఱు భట్టు మూతి౯ ననుసరించి శబ్దచిత్రములకు యమకాదులకు శ్లేషలకుఁ బాటుపడసాగిరి. పింగళి సూరకవి కాలమున నేననేమి, రామరాజభూషణుని కాలముననైన నేమి రమా రమి క్రీ. శ. ౧౬౫ం ప్రాంతములలో ద్వ్యర్థి కావ్యములు బయలుదేరెను. రానురాను త్య్రర్థికావ్యములు బయలుదేరెను. భాషకు పెక్కు మార్పులు సంభవించేను. మఱికొందఱు “చం॥ అవుననఁ గావ్యపంక్తి పది యర్థముల౯ తో రచియింప నేర్తు" నని ప్రతిజ్ఞలొనర్చిరి. ఆప్పటినుంచియే కవులందఱు ప్రబంధ యుగమున భాసాసౌకర్యము మఱచి గీర్వాణమయముగ బద్యములు వ్రాయుచు శబ్దచిత్రములకు, శ్లేషలకు గర్భకవిత్వములకు, ఓష్ఠ్య, నిరోష్ఠ్యకవిత్వాదులకుఁ జొరఁబడిరి. కాని యీకాలమున పింగళి సూరకవిమాత్రము భాషకు ఇంతయనరాని మేలొనరించి కళాపూర్ణోదయము, రాఘవపాండవీయము, ప్రభావతీ ప్రద్యుమ్నము రచించి భాషాప్రపంచమున శాశ్వత స్థాయిగని కీతి౯శేషుఁడయ్యెను. పింగళి సూరకవివంటి మహాకవులు మఱియొకరిద్దతాంధ్రభాషకు లభించినయెడల మనభాష సాటి భాషలకంటె యొకచేయి మిన్నయయ్యెడిది. పింగళి సూరకవి కీవల కవులందఱు కేవలవర్ణనములతోడను దీర్ఘసమాసకలితములగు పద్యములతొడను ఔచిత్యత్యాగము చేతను గ్రంథములు వ్రాసి భాషాప్రపంచమున పాఱఁజల్లిరి. శ్లేష కావ్యములు, నిరోష్ఠ్య కావ్యములు, గర్భకవిత్వములు, సూరకవి వలనే బయలు దేరెను. ఆధునికులలో సుప్రసిద్ధులగు కూచిమంచి తిమ్మకవి, అడిదము సూరకవి లోనగు మహాకవులు కూడ ఔచితికంటే కావ్యములయందు వర్ణనములు