Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బాలుర భావి బాధ్యతలు

(పల్నాటి వీర వాక్యము)

పడుచువారికి బుద్ధి - బలముండబోదు;
బాలురకును దేహ - బలముండబోదు;
యువజనుల్ సభలను నొగిగూర్పఁదగదు;
బాలురు సభలను - పరికింపరాదు;
కుర్రవాండ్లకు స్వేచ్ఛ - కూడదెప్పటికి
మంచి చెడుల - మదినియోజింపఁ
దగరు మా యువకులు; - తధ్యమింకేల?
బాలురెందులకును - బనికి రారనుచు;
చాటుచుందురు గాని - ఛాందసులిలను.
తధ్యమయ్యది గాదు - దవిలియోజింప,
ఆది యసత్యమువినుఁ - డోయాంధ్రులార!

★★★


పల్నాటిసీమను - భాలించినట్టి
యనుఁగుభూపతి మంత్రి - యైన బ్రహ్మన్న
సూనుఁడౌభాలుండు, - శుభగుణుఁడొకఁడు;
గాధేయుజన్నంబు గాచినరాము;
సౌమిత్రిప్రాణంబు - సాకినహనుము;
ద్రోణునెదుర్కొన్న - జాణ సౌభద్రుఁ,
నురుగుణయుతుల
దురకమూకలబార - దోలుశివాజి,
బుస్సీకిభయమును - బుట్టించిమించి
వెలయు, బాలుండైన - వేంగళరావు,
యవనులనోడించి - యాంధ్రమండలిని
స్థిరతనిల్పిన కృష్ణ - దేవరాయాది;
యోధుల, బ్రాజ్ఞుల, నురుగుణయుతుల
బోలఁగాజాలిన - పూజ్యవత౯నుఁడు;
“బాల చంద్రుండు”ను - పల్నాటివీరుఁ
డే డెళిమిదినూర్ల - యేండ్లకుమున్నె
బాలురకునుగల - భావిభాధ్యతల,
బాలురకునుగల - ప్రస్తుతార్హతల
గూర్చి యిట్టులబల్కె కోవిదులార!

★★★


$"తలిదండ్రులనుబ్రోవఁ - దనయుఁడె కత౯
మానాభిమానముల్ - మగటిమిమించ
బ్రబలింపగలవారు - బాలురెసుమ్ము
బాలురె పెద్దలు - బల్లిదుల్ వారె;
బాలురకేవృద్ధి - పరికించిచూడఁ,
బెద్దలు మతిచెడి - పిరికి వారుదురు;
పాంచభౌతిక దేహ - పటిమ క్షీణించు
మనసుచలించును - మాటిమాటికిని
ధైర్యంబుతగ్గును-త్సాహంబు లుడుఁగు
వయసుమీరిన వేళ - వచ్చునా బలిమి?
కీతికైనను నప - కీతి౯కినైన,
బాలుర పైనుండు - భారమంతయును.”$

★★★


ఆతనివాక్యంబు – లాలించి యింక
నైన పిల్లలఁబెంప - యత్నింతు రేని,
బిడ్డలే జాతికి - పేరుదెచ్చెదరు;
పడుచులే జాతికి - పరువుదెచ్చెదకు;
యువకులే దేశాన - కున్నతిగూర్తు;
రవ్వారెరాజుల - నాదరించెదరు;
సర్వశుభంబులు - సమకూరు దాన
గాన బిడ్డల జాల - కరుణతో గాంచి
యువకులశక్తికి - నూతనొసంగి
సాకఁగ నెంచుడో - సజ్జనులార!
దేశబాంధవులార - ధీయుతులార!
ధర్మరక్షణులార - ధన్యాత్ములార !
కరుణాంబునిధులార - కార్యజ్ఞుులార
అభివృద్ధి నాసించునో - యాంధ్రులార!
విద్యాఢ్యులార శ్రీ - విలసితులార!

-సత్తెనపల్లి హనుమంతరావు.


$ ఈ గుర్తులమధ్య చరణములు మహాకవి శ్రీనాధరచితములు!