Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

కాలత్రయమును బోధించు “వచ్చు౯" అను పదమే క దా ఉపయోగింపవలసినది. అట్టి అధ౯మును నిస్సంశ యముగా బోధించు శబ్దమొకటి పండితులచే వాడఁబడు చున్నప్పుడు, అన్ని ధాతువులకు నట్టి సజాతీయకూపమే యున్నప్పుడు, దానికొక వ్యాకరణము వ్రాయుటకనువై యున్నప్పుడు, అది అపభ్రంశపదమెట్లగును! మఱియు అకారాంతమైన పదములయందలి నకారము లోపించి తత్పూర్వ కాకారమునకు దీఘ౯ము వచ్చుచున్నది. “చేసిన” “వెళ్ళిన౯” “తిట్టిన౯” “కొట్టిన౯” “చే సీనా” “వెళ్ళినా” “తిట్టినా” “కొట్టినా” దీనివలన నకా రాంతములనిగూడ తెలియుటకు గుత౯గుచున్నది. మాఱియు సముచ్చయోకారములకు “నీ" ఆదేశము వచ్చుచున్నది. “చేసిన్ని" "కొట్టిన్ని" "తిట్టిన్ని" మఱి యు నీ నకారద్వయముమీది యచ్చు దాని పూర్వా చ్చు ననుసరించి మారుచున్నది. “వాడున్ను " "వీడు న్ను”. విశేష్యనుగు తదధ క “వాడు" పదములోని వకారమునకు లోపంబును ఆకారంబునకు అనునాసికా కారంబును తత్పూర్వాచ్చునకు లోపంబును వచ్చును. “అనుభవించాడు" "నిరీక్షించాడు" "చూశాడు" "వె ళ్ళాడు” “పడ్డాడు”.” కొన్నిచోట్ల పదమధ్యో కారము నకే కాక పదాంతో కారమునకు కూడ లోపము వచ్చు చున్నది. “వెళ్ళాడ్రా" పడ్డాడ్రా” “వస్తాడ్రా" శత్ర ధకమగు “చుచు” అనుదానికి "చుతు" గాని గాని వచ్చును. “నిరీక్షించుతు” “నిరీక్షిస్తు" "చూచు చు” “చూస్తు” ఈ “చుతు" మాత్రము ఇంచుకుకేగా ని అనించుకు రాదు.

ఈప్రకారముగా సంస్కృతాంధ్రభాషా వేదు లగు పండితులచే మన ప్రాకృతాంధ్రభాషకు చక్కని వ్యాకరణము వ్రాయింపవచ్చును. ఇట్టి భాష బాలురకు పఠనీయము చేసిన మనదేశమున కపారమైన లాభము కలదు. సంస్కృత గీర్వాణ భాషలోనుండి పు ట్టిన ప్రాకృత గీర్వాణభాషకు మనవారు వ్యాకరణము వ్రాయలేదా? దానియందు గ్రంధములు వెలువడ లేదా? ప్రస్తుతమునందు ఆదియు వాడుకలో లేకపోవుట చే సంస్కృతమువలెనే మృతభాషయైనది. అట్లే మన ప్రాకృతాంధ్రభాషకుగూడ వ్యాకరణము వ్రాయింపు డు. దేశ భేదముచే యీభావ కూడ కొంత మార్పుచెంది నను ఆ మార్పుగూడ గునము వ్యాకరణమందు సూచింప వచ్చును. మన గీర్వాణ భాష యందు గూడు దేశభేదముచే రూపభేదము కలుగునని చెప్పు నూత్రము లెన్ని యోగలవు. ఏదైన కానిండు పెక్కు చరిత్రవిషయక గ్రంథములు, ప్రకృతిశాస్త్రవిషయక గ్రంధములు, మన బాలురకు పఠనీయములుగా చేయవలసి యున్నవి. మనవారు ప్రా ధమిక నిర్బంధ విద్య కావలయునని కోరుచున్నారు' స్త్రీలకు విద్య కావలయునని కోరుచున్నారు. ఇట్టి సమ యంబున ప్రతిదినము కణ౯తాడితమగుచున్న భాషలో ని గ్రంథములు చదువుకొని లోకజ్ఞానము సంపాదించు కోవలసి యున్నది. ప్రజాసామాన్యమునకు బోధపడవల సిన గ్రంధములన్నియు మనవారు వాడుకభాషలో నే వ్రాసిరి. శాస్త్రములకు వ్రాసిన వ్యాఖ్యానములును కఠినప్రబంధములకు వ్రాసిన వ్యాఖ్యానములును కధలు ను పెక్కులు వాడుక భాషలోనే యున్నవి. అచ్చుకా కుండ వాడుక భాష లోనున్న వచన ప్రబంధములనేకము లు మనవారు వ్రాసినవున్నవి. ఉభయభాషాకోవిదుడు ను మహాకవియునగు శిష్టు కృష్ణమూతి౯ శాస్త్రి గారు వసుచరిత్రకు వ్యాఖ్యానము ఈ వాడుకభాషలో వ్రా సిరి. ప్రజాసామాన్యమునకు విద్యవచ్చుచున్నదనుకొన్న కొలది భాషాశైలి సులభమగుచు వచ్చినది. నన్నయ్య మొదలు నేటివరకు భాష చూచిన, శైలిలో నైదారుమె ట్లు కలదిగా నున్నది.

——శ్రీ కొచ్చెర్లకోట వేంకటకృష్ణారావు బహద్దరు జమీందారు.