లుగూడ గ్రాంధికములు కావలెను. దానిచే ఆంధ్రభాషాపదములు పెక్కులు పైకివచ్చును. లేనిచో నిఁ క కొన్ని సంవత్సరముల కాంధ్రభాష నామావశిష్టమైన దగుటకు సందియము లేదు. విభక్తులు కాక ఆంధ్రదేశము న సాధారణముగా ప్రజల వాడుకలోనున్న పదముల న్నియు గ్రాంధికములు కావలెను. అట్టి పదములు కొ న్ని పరిణామములు పొంది ఉచ్చారణ శైథిల్యముచే అప భ్రంశములు గానుండుట తటస్థించినను వానిని మంచిదశలోనికి తీసికొనివచ్చుటకు యత్నించవలెను. గ్రంథ ములలో మనము వాడినచో దాని యధార్థరూపము బయటనే పడును, లేదా అదియే దానికి రూపమగును. దాననేమియు భాషకు లోపము రాదు. పదమనునది పదాఛజామును తెలియజేయు సంజ్ఞ గాని వేరొకటి కాదు. ఏపద మెట్లున్నను దానివలన పదార్థము తెలియవలెను. ఏపదమువల్ల నిస్సంశయముగా పదార్ధము తెలియునో ఆదియే సాధువగును. ఇక వ్యాకరణము దానిని సర్వదే శము లోకవిధముగానే వాడుట కుపయోగించును. అట్లుకానిచో ఎవరిష్ట మువచ్చినట్లు వారు మాట్లాడుటయు దానివలన పదార్థము తెలియకపోవుటయు తటస్థిం చును. ఏ పదమును ఒక్కరీతి పెక్కుమంది వాడుదురో అది సాధువైన పదమే. దానిని సాధించు వ్యాకరణము లేకపోయినను యున్న ట్లే. కనుకనే శబ్దసిద్ధి లోకంబు వలన తెలియనని చెప్పఁబడియున్నది. నన్నయభట్టార కుఁడు సంస్కృతవ్యాకరణము ననుసరింపకలసిన వాడై నేను “ద్రుపదపురంబున కరుగునది” “పయనంబు పోవు వారు” “వానికిట్లనియె” “బృహస్పతికిచ్చె” “నీ విఘ్న వచనంబులకు వెఱచుటెట్లు” “అని యరచుచున్న దానికి యనముండు కరుణించి” “వానికనియె” “నీ పరాక్రమం బునకు మెచ్చితి” “మానవులకు విశిష్టులమై” “హయం బులు సాధనఁబు” “ఒరులచేఁ గొనఁగ నొల్ల” “వేద వే దాంగ పారంగుండైన భారద్వాజశిష్యుండ” ఇది మొద లయిన పదములయందు లోకముననుసరించియే ఒక కారకమున కిఁకొక కారకము ప్రయోగించెను. దీనికి లోక మట్లు వాడుచుండుటయే కారణముగాని వేఱు కాదు. తరువాత ఆప్రయోగముల ననుసరించి వాడుకలో నిట్లు న్నదని గ్రహించి చిన్నయసూర్యాదులు తగిన వ్యాకరణ ములు వ్రాసిరి. అట్లే ప్రస్తుతము వాడుకలోనున్న ఆం ధ్రభాషకుఁగూడ వ్యాకరణము వ్రాయుటకు వలనుపడ కపోలేదు. చూడుడు భావార్ధమునందున్న “చేయుట” అను పదమునకు నూరుగా "చేయడము” అనురూపము వాడుకలో నున్నది. ఈరూపము అన్ని ధాతువులకు నిట్లే మారియున్నది. దానికి డప్రత్యయము అంత్యమును కకారాదేశము విధించుకొందుము. భాష పుట్టిన తరువా త వ్యాకరణము పుట్టునుగాని వ్యాకరణము భాషను పుట్టింపదు. ఒకరీతిగా కొన్ని పదములు నుండుటఁజేసి బుద్ధిమంతులు దానికి తగిన సూత్రములు కల్పించినచో మన మెఱిఁగిన కొన్ని పదములు మాత్రమే సాధించును వాడుకనగా అనేకమంది పదసౌష్ట మ మైఱిఁగిన విద్వాంసులు వాడుట గాని వ్రాయుటగాని ఎవరో ఒకరిద్దరు వాడుట వాడుక కాదు. “వచ్చేసా డు” “ఆనేవాడు” “ వెళ్లేవాడు” “ఉండేవాడు” ఈ పదములు తద్ధర్మార్ధక విశేషణో కారమునకు ఏకారము వచ్చును అని సూత్రమున్నట్లు మనము గ్రహించగలిగితి మేని సాధువులని గ్రహింపవచ్చును. దీనికి అజాది పదంబు లు పరంబగునపుడు టుగాగమము వచ్చును, అని గ్ర హించిన “వచ్చేటప్పుడు” “ఆనేటప్పుడు” “వెళ్లేటప్పు డు” “ఉండేటప్పుడు” అను రూపములు సిద్ధించును. ఉకారాంతములైన “చేయు” “నేయు” “పోయు” "కోయ ” మొదలయిన ధాతువులకు క్త్వార్థకమునందు సకారము వచ్చినట్లే' తద్ధర్మాధ౯క విశేషణమునకు గూ డ సకారము వచ్చుటచేత “చేసేవాడు” “నేసేవాడు” “పోసేవాడు” “కోసేవాడు" ఇత్యాది రూపములు సిద్ధిం చును. దీనివలన ఒక రూపమునకు రెండురూపములుఁడు ట తటస్థించును గాని భాష కేమి లోపముకలదు! ఇంతకు మున్ను మనము సాధుపదములనుకొనుచున్న పదముల లో “చేయుచున్నాము” “చేయుచునున్నాము” అని. రెండు రూపములుండుటలేదా ! మఱియు నీ ప్రాకృతాంధ్ర భాషలో పూర్వాంధ్ర భాషచే యధ౯ముగూడ వచ్చుచున్నది. “వస్తాడు" దీనికి తప్ప క వచ్చునని భవిష్యదగ్ధము బోధ్యమగుచున్నది. దీనికి
పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/12
స్వరూపం