Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.2, No.2 (1918).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

లోఁ జేర్పవలయునని నాయభిప్రాయము కాదు. ఏపదా ర్ధమును వచించు పదములు లేవో పెక్కు పదముల చేఁ జెప్పఁబడు నభిప్రాయములు యేయొక్క పదముచే చెప్పఁ బడునో ఏ పదములు శాస్త్ర సంకేతికములో - అవియెల్లను నిళ్ళంకముగా జేర్చుకోవలయునని నాయభిప్రాయము. నీచజాతులవారు మాటలాడు నింద్య గ్రామ్యమునకుగూడ వ్యాకరణము లేకపోలేదు. వాండ్రును ఏకవచనమునకు బహువచనము, కత౯కు కర్మ, కర్మకు క్రియ, షష్టికి తృతీయ, తృతీయకు పంచమి మాటలాడరు. కాని పదములు వర్ణాగమవర్ణలో పవర్ణ వ్యత్యయాదులచే వికృ తములై నవగుటచే ప్రయోగానర్హములయినవియు, నుత్తమ జాతి నాగరక భాషలోఁ గలుపఁదగినవియు కాకపోవు టచే నింద్య గ్రామ్యములుగా మన పూర్వులే నిషేధించి నారు. కాని యుత్తమజాతి నాగరక పండితులు స్వేచ్ఛ గామాటలాడు భాష నుగూడ దానివలె ప్రయోగార్హ ము కాదనుటకంటె తప్పుపని యింకొకటిలేదు. భిన్న భిన్న సీమలయందుండు నుత్తమజాతి నాగరిక పండితులు మాటలాడు భాషయు భిన్న భిన్నముగా నుండుటంజేసి యది గ్రాంధికము చేసినచో నొకసికలోని వాడుక భాష యింకొక సీమలోనివారి కర్ధముకాదు. కనుక వాడుక భాస గ్రాంధిక తావస్థకు తగదను కారణమే ఆభాష గ్రాంధికావస్థకు తేదగినదని చెప్పుటకు కారణము. ఏమ న అట్లు గ్రాంధికావస్థకు తెచ్చుటచేతనే యది యెల్ల సీమలవారికిఁ దెలియును గాని తేకున్నంత కాలము యేసీ మలోని దాసీమలో నేయుండును. ప్రస్తుతము గ్రాంధి కావస్థఁ జెందిన యితర దేశ్యపదములు మనకుఁ దెలియుట కు కారణము గ్రంధములేకదా! అట్లు తెలిసికోదగిన యితర దేశ్యపదములు మన గ్రంథములయం దెన్నెన్నో కలవు. ఒక్కొక్క సీమయందలి వ్యావహారిక భాష యొ క్కొక్కతీరుగానుండును. అందును ఒక్కొక్క తెగ వారి సంభాషణ మెక్కొక్కతీరుగా నుండును. అయి నను నుత్తమజాతి నాగరక పండిత సంభాషణము మాత్ర మతిస్వల్ప భేదములతో నొక్క తీరుగ చేయున్నది. అట్టిసీ మలయందలి నాగరక సంభాషణ భాష యంతయు గ్రాంధిక భాషయైనచో క్రమముగా సర్వసీమల సంభాషణభాషకును నైక్యము రాగలదు. అట్టి భాషయందు వ్రాయం బడిన గ్రంధములు చదివిన కొలది నీచజాతిసంభాషణభా షయు నుత్తమజాతి సంభాషణ భాషాదశను పొందును. సర్వసీమలలోని వాడుకభాషలు సర్వసీమలవారు గ్రంధములయందు వ్రాయగలిగిరేని అప్పుడు దీనికిఁ గూడ మంచివ్యాకరణముపుట్టును. అప్పుడు ప్రాచీన నవీన భాషలు రెండింటికి నైక్యము సంభవించును. దానిచే మన యాంధ్రభాష కితోధికోన్న తావస్ధ ఘటించును. లేనిచో సంస్కృతభాష వలె. నాంధ్రభాషయు మృతావస్థలోని కివచ్చుటకు సందియములేదు. ఇతర భాషా సంపర్కము తోనభివృద్ధి చెందుచున్నంతమట్టు కేభాషకును సంపూర్ణ వ్యాకరణముపుట్టదు. ఏభాషయందు గాని వ్యాకరణము భాషను నిర్బంధపరచినచో అది మృతభాష యగు నే కాని యమృతభాష కానేరదు. భావయభివృద్ధియైనకొ లది వ్యాకరణముకూడ నేభావ కభివృద్ధమగునో నది యే అమృతభాష. ప్రస్తుతము తెలుగు భాషకున్న యల్ప వ్యాకరణముచే సంభాషణ భాషాపదము లనేకము లప భ్రంశములని తోచకమానవు. పదములే కావు శైలియంత యు నపభ్రంశ ప్రాయమే. ఆదియంతయు సుష్ఠమై ప్రక్రియా భాగము మాత్రము దుస్థమనుట యేమి న్యాయము! కావున నభివృద్ధియగు భాష కెన్నడును నిర్ణీత వ్యాకరణము పనికిరాదు. అభివృద్ధియగుచున్న శరీరమునకు చిన్నతనము నాటి చొక్కాయములు పనికిరావు. క్రొత్తక్రొత్త చొక్కాయములు శరీర పరిమాణము ననుసరించి కుట్టింపవలసినదే. అందరును విద్యావంతులు కావలయు నని కోరు నిక్కాలఁబున నిర్బంధ ప్రాధమిక విద్య యవ సరమని పోరు నీ సమయంబున సులభ శైలిగల వ్యావ హారిక భాషా గ్రంథములు కాక యేగ్రంధములు పనికి వచ్చును ! చిన్న తనమునుండియు కర్ణతాడితమగుచున్న భాష కాక యింకే భాష సులభముగా తెలియును! పం డిత సంభాషణభాషలో గ్రంధములు వ్రాయుట కారం, భించినచోనవి తక్కువజాతిలో అక్షరములు నేర్చినవారు చదువుకొని పండితవ్యావహారిక భాష నేర్చుకో గలుగు దురు. అదియు వచ్చినతరువాత ప్రౌఢ భాష నేర్చుకొం దురు. ఇట్లు క్రమక్రమముగా భాషాపర్వతము నెక్కుట