Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.6 (1937).pdf/27

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రణయందు పరిపాలన పంచాయతి కెక్కువజోక్య ముండలేదు. పరిపాలన పంచాయతీలో గ్రామ పెద్దలుందురు. కావున వారి మంచి పలుకబడిచేత సర్దుబాటయిపోయే, చిల్లర వ్యవహారములు సర్దుబాటయిపోవును. దానికి శాసనమవశ్యము కాదు. ప్రజలలో ఇప్పటికిని నిలవయున్న సహజ సమర సబుద్ధి నశింపని యంతకాలము ఈ విధ తీర్మానములు జరుగుచుండును. అ బుద్ధి క్రమక్రమముగా అభివృద్ధి గలదనుట చారిత్రక్రమమున నేడెదురు చూడదగి యున్నది. కాని గట్టి వ్యవహారమే యేర్పడి విచారణయే యవసరమగు నప్పుడు వాది ప్రతివాదులు తాము స్వేచ్ఛగా నేర్పరచుకొను పెద్దమనుష్యుల తీర్మానమును అధికార తీర్మానముగా నిర్ణయించుట యత్యవసరము. దీనినే ఆంగ్లమున కంపల్సరీ అర్బిస్ట్రేషన్ అందురు. గ్రామపు కోర్టుల మొదటి చట్టములీమార్గముననే యేర్పడి యుండుట ఇప్పటికిని చూడవచ్చును. స్వేచ్ఛగా నేర్పరచుకొనిన ఈ పంచాయతిమీదను నొకప్పుడొక పార్టీకి అవిశ్వాసము కలుగుట కవకౌశమున్నది. అట్టి సందర్భములలో అదే రీతిని రెండవపంచాయతిని నిర్మించుకొనుట కవకాశమిచ్చి దానితీర్మానము తుది తీర్మానము గావించుట మన దేశపు పూర్వాచార మైనట్లు చరిత్రలు తెలుపుచున్నవి. ఇట్టి న్యాయవిచారణపద్ధతి ఏర్పరచితే చాల ఎక్కువ అధికారములీ సంస్థల వశము చేయవచ్చును. ఇప్పటి కోర్టు లనేకములు రద్దు చేయవచ్చును. వానివలన ప్రజలుపడు గొప్పవిపత్తును పరిహరింపవచ్చును .

పరిపాలన పంచాయతీ, న్యాయవిచారణ సంస్థ - ఇవి రెండును గాక గ్రామమున నుండదగిన సంస్థ కో ఆపరేటివు సొసైటీ. ఇది ఇప్పటివలె సాహుకారు పద్దతిని గాక ప్రజోపయోగ పద్ధతి నడుచుటకు రుణబాధను పెంచుట మాని పోగొట్టుటకు సాధనమగుటకు తగిన సంస్కారము పొందదగును. అప్పుడు ఆర్థిక కార్యములకిది గ్రామమునకు పరిపూర్ణముగా తోడ్పడు సంస్థగా నుపయోగించుకొన వచ్చును. జరుగదగిన సంస్కారము గ్రామోపయోగమునకిది నిర్వహింప వలసిన ధర్మములు వర్ణింప సాగిననది యొక గంధమగును. ఈ పస్తుతో పన్యాసమునకు నప్రస్తుతము. పంచాయతీ రాజ్యములో కో ఆపరేటివు సొసైటీ యొక యంగము. గ్రామ ప్రజలలోని ప్రతి మేజరును – స్త్రీని గాని పురుషుని గాని — కో ఆపరేటివు సొసైటీలలో చేర్చగలిగితే చేర్చవచ్చునని నాయాశయము - దీనిని గ్రామ పంచాయతీలో లీనముచేసి వేయవచ్చును. దోషము కాదు, న్యాయము కూడ.

ఇక పరిపాలన పంచాయతికి ద్రవ్యసాధన మార్గమేమియనుట తరువాతప్రశ్న. అదియొకటే లోకలు పరిపాలనాంగమైనప్పుడు, జిల్లాబోర్డు రద్దయినపుడు, ఇప్పుడు జిల్లామీదట జిల్లాబోర్డుకు సంక్రమించే సర్వాదాయము, పూర్తిసెస్సు మొత్తముతో, గ్రామమునకు సంబంధించినంత వరకు పంచాయతికి చెందిపోగలదు. ఇప్పుడు ప్రభుత్వమునకు చెందిన ఆట వీ పరిపాలన, పంటనీటి సరఫరా వగైరా అధికారములు పంచాయతికి చెందగలవు. కావున ఆయాదాయములు పంచాయతులకే సంక్రమింపగలవు. గవర్నమెంటు కార్యము ఎక్కువభాగము పంచాయతులు నిర్వహించును గాన ప్రభుత్వపు సమిష్టి ఆదాయము నుండి ఇంక కొంతమట్టుకు పంచాయతులకు ఇచ్చివేయవచ్చును. ఇంటి పన్నులు వగెరాలు విధించడము లైసెన్సు ఫీజులు వసూలు పరచడము మొదలైనవి ఒకవేళ చట్టములో నున్నను పంచాయతులు అమలులో పెట్టి ప్రజలను వేధింపరాదు. తాను సృష్టించిన జీవాధార వస్తువును నేటి పరిస్థితులలో నాణ్యముల రూపమునకు మార్చుటలో రైతు మహత్తమమగు దుర్దశలలో పడిపోవుచున్నాడు. సర్వనాశనమగు చున్నాడు. కాబట్టి గ్రామపు ఉమ్మడిపనికి అతని సేవ కాయకష్టము రూపముగా కోరడము ఇప్పటి కష్టదశనుండి అతనిని తప్పించడానికి మార్గము. గ్రామ సౌభాగ్యానికి ప్రాచీన లేర్పరచుకొనిన సదాచారమున కవలంబనము, 'సోమదారద కెలసె' అని వారమున కరదినము పని చొప్పన గృహస్థులకు విధించిన పనిపన్ను మైనూరు పంచాయతులు దివ్యసుందగ స్వరూపము దాల్చుటకు సాధన మైనది. దానిని మనసీమలోను శాసనబద్దము చేసి పంచాయతీ నిర్మాణ కార్యక్రమానికీ సాధనమును వినియోగించుట మొదట చేయదగినది. గ్రామస్థులు తాము పని చేయలేనప్పుడు ధాన్యము కూలి యిచ్చి 'కూలివారిని పంపుట కిది యవకాశ మిచ్చును.

మొత్తముమీద పంచాయతీ పరిపాలన ప్రజలకు ఆర్ధికమగు బరువు తగ్గించునది, పరస్పర విశ్వాసమున మెలగుటకు అవకాశ మిచ్చుచునది, న్యాయపరత్వమును పురి కొల్పునది, బయటివారిమీద నాధారపడవలసిన దైన్యమును తుడిచివేయునది, సాధ్యమైనంత పూర్ణాధికారమును సంక్రమింప చేయునది యగుటకు పైన సూచించిన విధానము తోడ్పడగలదు.

గ్రామపంచాయతుల అధ్యక్షులగువారు గ్రామసౌభాగ్యోద్యోగమున పనిచేయునట్టి వారు ప్రాతిపదికముగా చేయదగిన పని యొకటికలదు. గ్రామములో నెవ్వరును అక్షరము రానివారు లేరనునంతవరకు పట్టుబట్టి ప్రజలను ఆక్షరజ్ఞలను చేయుటకు పాటుపడవలెను. నేడు మన