Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.1 (1937).pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యొక రాష్ట్రపు రాజకీయ విషయములలో ఎంత వరకు జోక్యము పుచ్చుకొనవచ్చును. (౨) ఒక రాష్ట్రము చేశ రాజకీయాపరాధు లుగా ఎంచబడినవారు మరియొక రాష్ట్రమున సురక్షితులగుటకు ఎంతవరకు హక్కుండవలెను. (3) రెండు రాష్ట్రములకు తగాదా వచ్చి నపుడు శాంతముగా పరిష్కారము చేసికొనుటకు పంచాయతీ పరిష్కారము కోరతగును - అను విషయములకు సంబంధించినవి. కడపటి ప్రశ్న యందు రోమక రాజకీయ శాస్త్రవేత్త సల్లీ వ్రాసిన పంచాయతీపద్ధతిని కూడ నమోదు చేసిరట.

★ ★ ★ ★

౧౮౩౫వ సం౹౹ తరువాత రాష్ట్రములు తమలో తాము వివాదపరిష్కారము చేసికొనుటకు పంచాయితీ నిర్ణయములకు కట్టుపడవలెనని అభిప్రాయపడి నానారాష్ట్రశాంతిసమావేశములు జరిగినవి.

౧౮౪౮ వ సం॥ లో బ్రూసెల్సు పట్టణము లోను, ౧౨౪౯ సం॥ లో ప్యారిస్ లోను, ౧౮౪౯ లో మేయిన్ నది మీది ఫ్రాన్క్ ఫర్ట్ పట్టణములోను జరిగిన సమావేశములు ప్రముఖములు. ప్యారిస్ లో సమావేశము జరిగినపుడు విక్టర్ హ్యూగో యను గ్రంథకర్త అద్భుత వాచాలత్వముతో ఐరోపాఖండమంతయు ఏకసంయుక్త రాష్ట్రము గా నేర్పడవలెనని వాదించెను. అంతకు ముందే లండనులోని టెలిగ్రాఫ్ పత్రికయందు ఛార్లెస్ మ్యాకే యను నతడు ఈవిషయమే వ్రాసి యుండినాడు. ౧౮౪౭ లో ఇంగ్లీషు పార్లమెంటు సభలో కాల్డెన్ అను శాంతపర మహాపురుషుడు పంచాయతీ నిర్ణయములనే ఒప్పుకొనదగునని గొప్పయాందోళన కల్పించినది చరిత్రాత్మక ౧౮౫౬లో ప్యారీస్ సంధియని ఒక సంధి జరిగినది. అందులో ముందు ఎప్పుడైనను పోరాటములు కలిగేయెడల పంచాయతీపరి ష్కారములకు అవకాశ ముండవలెనని నిర్ణయ ములు వ్రాసికొనిరి. అలబామాకే సని ౧౯ వ శతాబ్దములో అద్భుతమైన పంచాయతీ పరిష్కార మొకటి జరిగినది. దానిని పరిష్కరించిన పంచాయతీకి "జనీవా టిబునల్" అని గొప్ప పేరు వచ్చినది.

★ ★ ★ ★

౧౯౭౩ లో "ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ లా" అని ఒక సంస్థయు “ఇంటర్ నేషనల్ లా అసోసియేషన్” అని ఒక సంస్థయు ఏర్పడి సర్వరాజ్యములకు సంబంధించిన లాపాయింట్ల వివరణము చేయుచు శాంతిని నిలువబెట్టు టకు మిక్కిలి తోడ్పడినవి. ౧౮౬౮ లో సర్వరాష్ట్రములు పార్లమెంట్లసంఘమొకటి స్థాపిత మైనది. దాని మొదటి సమావేశము ౧౮౬౮లో జరిగి రాష్ట్రమునకు రాష్ట్రమునకు జరిగే వివాదాలు పంచాయితీలద్వారా పరిష్కారము కావలె ననువిషయము గట్టిగా నొక్కబడినది. ప్రపంచ చరిత్రలో ఆ సమావేశపు చరిత్ర సువర్ణాక్షరము లతో వ్రాయదగినది. నాటినుండి సర్వరాజ్య ముల శాంతి సమావేశములు ఆరంభమైనవి. ఆ సంవత్సరమే అమెరికా ఖండమునందలి అన్ని రాజ్యములు శాంతిసమావేశము జరిగి అటు అమెరికా, ఇటు యూరపులకు శాంత్యుద్యమము ప్రాకినది. ఇంగ్లీషువారును అమెరికావారును పంచాయతీ పరిష్కారపుసంధిని జేసికొన్నారు. ఆసంధిని జరుపుటలో నేడు లోక మునందు మహత్తమ దానములకు పేరుగన్న ఆండ్రూ కార్నీజీ పాలుపుచ్చుకున్నాడు. నాటి నుండి నేటివరకు అతని పేరిటనే లోకపు సర్వ