Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.1 (1937).pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మానవహృదయము శాంతిపరము

గాడిచెర్ల హరిసర్వోత్తమరావు గారు, ఎం.ఏ.

లోకము నేడుండే స్థితినిజూచి కొందరు మహా ప్రళయమును ఎదురుచూస్తున్నారు. మాన వులు రాక్షసులైనారని విశ్వసిస్తున్నారు ఇప్పటి యంత్రాల నాగరికము నశిస్తుందనుకుంటు న్నారు. మానవుడు మళ్ళీ గోచి పెట్టుకొని అర ణ్యంలో నివసిస్తా డనుకొంటున్నారు.

★ ★ ★ ★

దీనికి కారణం చాలదూరం వెదుక పనిలేదు. మానవుని హృదయం శాంతిపరం. ఆవిషయం లోకం మరచిపోయింది. అంతట అంతట స్వలాభపర త్వాన్ని యంత్రయుగం ప్రేరేపింది. వ్యక్తులకు వ్యక్తులు, రాష్ట్రాలకు రాష్ట్రాలు భోగలాలసులై తమస్వభావమును తాము విస్మృతి చెందినారు. కాబట్టి మానవులలో ఉండే సత్వం నివురుగప్పిన నిప్పువలె బూడిదలో కలిసిపోయినట్లు తోచడం ఆరంభమయింది.

★ ★ ★ ★

కాని, నిస్పృహ చెందనక్కరలేదు. మాన వుడు తేరుకుంటాడనే ఆశ కనిపిస్తుంది. స్పైనులో జరిగే యుద్ధం విషయంలో ఇంగ్లండు ఫ్యాన్సులు తాటస్థ్యంగా ఇతర రాష్ట్రాల నన్నిటిని ఉంచ డానికి చేసే ప్రయత్నాలు చాలమట్టుకు తమకు ఎగ్గుకలుగకుండా ఉండవలెనని చేసే ప్రయత్నా లుగా ప్రస్తుత పరిస్థితులలో కన్పించినా నిజాని కివి మానవహృదయం శాంతిపరమనే సత్యాన్ని రుజువు చేస్తున్నవి.

★ ★ ★ ★

ఈ సత్యం ఎల్లకాలము రుజువవుతూనే ఉన్నది. యూరోపు చరిత్రలో రోమక సామ్రా జ్యమునాటినుండి యుద్ధంవిషయములో విముఖత్వమును శాంతియుతంగా వివాదాలు పరిష్కారం చేసుకోడం విషయంలో సుముఖత్వమునూ కనబడుచునే యున్నవి. దీనికిని యంత్రయుగానికిని ఎక్కువ సంబంధము పెట్టడం అంత సహే తుకంగా కనుపడదు, యంత్రయుగం మారణ కర్మను సులభం చేసినకొద్దీ సైన్యాలూ మందు గుండ్లూ పెరిగిన శొద్దీ శాంతంగా కార్యాలు నడుపుకోవలెననే యిచ్ఛకూడా పెరిగినట్లుగానే కనుపిస్తుంది. పర్యవసానము తేలలేదని ఈ పరిణా మాన్ని నిరసించి వేయడం న్యాయంగా తోచదు. కొంత ఆధునిక చరిత్ర పరిశీలించి చూతము.

★ ★ ★ ★

౧౮౩౫ వ సం౹౹ లో స్విట్జర్ ల్యాండుకున్నూ ఫ్రాన్సుకున్నూ కొంత తగాదా వచ్చినది. అప్పట్లో ఫ్రాన్సులో కొత్త సార్వభౌమకుటుంబ మేర్పడినది. వారిని తరుమగొట్టవలెనని విప్ల. వముకూడ వెంటనే ఏర్పడినది. విప్లవకారులు పక్క నుఉండే స్వీట్ జర్ ల్యాండులో తలదాచు కున్నారు. అందువలన వివాదా లేర్పడి రెండు దేశాలకు పోరాటం కలిగే సందర్భము తటస్థిం చింది. జినీవాకు చెందిన సెల్లెను ప్రభువును మసాఛు సెట్సుకు చెందిన విలియం ల్యాడ్ను (౧) శాంతి, (౨) పంచాయతీ తీర్మానము అనునీరెండుఉపా యములను ప్రముఖంగా ప్రచారానికి తెచ్చి నారు. సెల్లను ప్రభువు ఎనిమిది ప్రశ్నలను తయారు చేసినాడు. ఫ్రెంచి, ఇంగ్లీషు, జర్మను, ఇటాలి యను, స్పానిష్, లాటిను భాషలలోనికి తర్జుమా చేయించినాడు. ప్రపంచములోని విశ్వకళాపరి షత్తులకు పండితసభలకు వీనిని పంపించినాడు, ఇవి ముఖ్యముగా (౧) ఒక రాష్ట్రము మరి