Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.1 (1937).pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

26

26. యాత్ర లు తాడేపల్లిగూడెము తాలూకా ద్వితీయ గ్రంథాలయయాత్ర చతుర్ధ గ్రంథాలయమహాసభ – గ్రంథాలయ వార్షికోత్సవములు 11 5-8-32 2002 ox-8-32 2050. [తాడేపల్లిగూడెము తాలూకా విస్తీర్ణము 383 చ||మై; జన సంఖ్య ౧. ౬3,౭౨౧; గ్రామములు ౧౧౫; గ్రంథా లయము లున్న గ్రామములు 18; గ్రంథాలయములు ౬౨; పంచాయతీబోర్డు గ్రంథాలయములు 32; సంఘ గ్రంథాలయములు ౨౨; జిల్లా బోర్డు గ్రంథాలయములు.3] తా డేపల్లిగూడెము తాలూకా గ్రంథాలయ సంఘము వారి కేర్పాటు చేసిన, ద్వితీయ గ్రంథాలయ యాత్ర శ్రీయుత గాడి చెర్ల హరిసర్వోత్తమరావు, మారే పల్లి రామచందశాస్త్రి, అయ్యంకి వెంకట రమణయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, కొత్తపల్లి లక్ష్మయ్య, తల్లా ప్ర్రగడ నారాయణమూర్తి, నిడదవోలు వెంకట్రావు, ఎద్దనపూడి వెంకటరత్నము, తమ్మి శెట్టి వీరన్న గార్లు, తాలూకా గ్రంథాలయ సంఘసభ్యులు, గ్రంథాలయ ప్రతినిధులు మున్నగు సుమారు మందితో, తాడేపల్లి గూడెయినుండి ఉదయము గంటలకు ప్రారంభమయ్యె. యాత్రికులు డీసిలు కారులో జయ ధ్వనులతో బయలుదేఱి, F-30 గంటలకు, మొదటి మజిలీ అయిన, మారంపల్లి గ్రామము చేరిరి, జయ మారం ప లి m స్టేషనువద్ద నే మారంపల్లి గ్రామస్థులు యాత్రా దళము వారికి స్వాగత మొసంగి, భజన మేళములతో పురవీధుల నగర సంకీర్తనము గావించి, శ్రీరామలింగేశ్వరస్వామి వారి ఆలయము నందలి పందిరిలోనికి కొనిపోయిరి. శ్రీయుత అయ్యంకి వెంకటరమణయ్య పంతులు గారు తాలూకా ద్వితీయ గ్రంథాలయ యాత్రకు ప్రారంభో త్సవము చేయుటకును, మారంపల్లి గ్రామమందలి శ్రీరామలింగేశ్వర గ్రంథాలయ ప్రథమ వార్షికోత్సవ మును జరుపుటకును, సభ కధ్యక్షతవహించిరి. తమ్మి సెట్టి వీరన్న గారు ప్ర్రార్ధన చేసిరి. తాలూకా గ్రంథా అయసంఘ కార్యదర్శి డాక్టరు తేతలి సత్యనా రాయణ మూర్తిగారు యాత్రాదళమువారికి స్వాగత మొసఁగుచు, తాలూకాయందలి గ్రంథాలయ యాత్ర జయప్రదముగా కరుగ గలందులకు ప్ర్రార్థించిరి. శ్రీ రామలింగేశ్వర గ్రంథాలయ అధ్యక్షులు శ్రీ సరిపల్లి వీరభద్రరాజుగారు, తమ గ్రంథాలయ పక్షమున స్వాగతమిచ్చుచు ఆతిధ్య లోపముల మన్నించి, సభ జయప్రదము గా జరుపకోరిరి. కార్యదర్శి, శ్రీ సరిపల్లి నరసరాజు గారు, గ్రంథాలయము ౧౯-౨-౩౬వ తేదీని, సంఘగ్రంథాలయముగా ప్రారంభ మయ్యెననియు, సొంతభవనము లేదనియు, ౧౨౨ గ్రంథ ములు కలవనియు, కృష్ణాపత్రిక మాత్రమే వచ్చుచున్న దనియు, నివేదికను సమర్పించిరి. ఆధ్యక్షులు, అరగంట గ్రంథాలయోద్యమమును గురిం చియు, గ్రంథాలయములు, మానవాభ్యుదయమునకును, దేశాభ్యుదయమునకును ఎట్లు తోడ్పడునదియు, వివరముగా ఉపన్యసించిరి. శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు, ఆంధ్రరాష్ట్ర గ్రంథాలయ సంఘమును గుఱించియు, తాలూకా, గ్రంథాలయ సంఘమును గుఱించియు తెలు పుచు, గ్రంథాలయము ముందు సం॥ ము అభివృద్ధి తెచ్చుటకు ప్రయత్నములు గలుపవలెనని గ్రామస్థులను హెచ్చరించిరి. శ్రీ గాడిచెర్ల హరిసర్వోత్తమరావుగారు క్షత్రియధర్మమును గురించి ఉత్తేజకరమగు ఉపన్యాస మొసల గిరి. శ్రీ గొల్లపూడి సీతారామశాస్త్రి గారు గ్రామపరిశ్ర మ సంఘమును గూర్చియు ఖద్దరు ఉద్యమమును గుఱించియు మాటలాడిరి. శ్రీ కొత్త పల్లి లక్ష్మయ్యగారు ఆంధ్ర నాట్య కళాపరిషత్తుతరఫున నాట్యకళకు గ్రంథాలయోద్యమ మునకు గల సంబంధమును తెల్పుచు, నాటక ములుమున్న గు ప్రదర్శనములవలన, విద్యరానివారలకు జ్ఞానము పెంపొం దఁగలదని సెలవిచ్చిరి. శ్రీ కలిదిండి నరసింహరాజు గారు పంచాయితీబోర్డులను గురించియు శ్రీ ఎద్దనపూడి వేంకట రత్నముగారు భాషా సేవను గుఱించియు మాటలాడిన పిమ్మట కృతజ్ఞతావందనములతో, సభ ౧౨ గంటలకు ముగిసెను, భోజనానంతరము, యాత్రా దళమువారు, మారం పలినుండి కాలినడక ను బయలుదేఱి, ఒక మైలు దూరములో నున్న నందమూరు గ్రామము గంటకు చేరిరి. నందమూ రు గ్రామము చేరిన వెంటనే, గ్రామస్థులు యాత్రాద ళ మువారిని, మేళతాళములతో సన్మానించి, పురవీధుల