22
.22 గ్రంథవిమర్శనము ఆత్మకథ (పద్యకావ్యము) - తొలిపాలు ఇది ఉభయభాషాప్రవీణ తుమ్మల సీతా రామమూర్తి చౌదరిగారు వ్రాసినది. వా దీనికి 'ప్రధానాధారము' బ్రహ్మశ్రీ శతావ ధాని వేలూరి శివరామశాస్త్రిగారి 'గద్యాను వాదము', ఇందలి ‘తొలిపలుకు' మారేపల్లి రామ చంద్రశాస్త్రిగారు వ్రాసిరి. ఇది పద్యరూప మున వ్రాయుటకు కతములు, “పద్య మన్న సంధిల్లును వేడ్క పెక్కురకు" అనియు, “పద్యంబు సర్వకవితల కాద్యంబై గానబద్ధమై శ్రుతిహితమై హృద్యంబై నియతం బన వద్యంబై లెస్స తోడుపడు ధారణకు "అనియు, చౌదరిగారే తెలిపిరి. ఇంతకు ఎవరికీ నచ్చినది వారు వాయుదురు. పెఱ వారు చూడవలసినవి అందలి మెఱఁగులే. “సరసులెల్ల మెచ్చ మెఱయింతుఁ గవితలోఁ గమ్మఁదనము మత్కులమ్మున వలె.” అని చెప్పుకొనఁగలిగి, కమ్మఁదనమును శ్లే పించి, కమ్మఁదనము కడుకమ్మగా మెఱయించి, నేర్పు చూప నోపిన నెఱవాదులు చౌదరిగారు ! కైకొనినకథ తన పేరు నేలనాలుగు చెఱఁగులను మాఱుమోఁగించుచున్న గాంధీమహాత్మునిది!! ఇఁక, చెప్పవలసిన దేమి? ఆయన అది కమ్మద నము ముమ్మరముగా చిమ్మునట్లు చేయఁగలిగిరి, తెనుఁగువా గమికి విలువ హెచ్చించిరి. 'ఆత్మకథ' నిజమునకు 'సత్యప్రయోగము' దానికి తోడు, "బ్రహ్మచర్యాదులు బల్కఁ బడేది నిందు. బ్రహ్మచర్య మాదిగా కలవి: తల్లిదండ్రుల కొలువు, ఏకపత్నీ వ్రతము, మంచి నడత, వాఁత, సంస్కృతము, భారత దేశభాషలు, తన్ను తానెఱింగెడి యెఱుక, రామ నామము, మతసహనము, కీడునకు మేలు, వెచ్చపు లెక్క, బిడియము, స్తుత్యుపాసనాస్త్రార్థనములు, భారత దేశ చరిత్ర మొదలగునవి. వీనినిగూర్చి మహాత్ముఁడేమి తెలుపునో మేలుకోరు వారంద ఱును తెలిసికొన నగు. " తెలుఁగునకు స్వస్తి సెప్పిన తెలుఁగుకవిత్వంబు వల్కఁ దియ్యము నాకు గలుగద మాతిక్కనయ జ్వలు తొక్కినతొవ కేను సమ్మతివడెద౯." అని తెనుఁగుకవిత్వమును గూర్చి కట్టుపాటు చేసికొని, తెనుఁగుతల్లిమీఁదను, తిక్కన సోమ చౌదరిగారు చూపినమన్నన యాజిమీఁదను మన్నింపఁదగినది. ఈ క్రిందినాటినుడులును, - వాడి, -తెనుఁగుమఱుఁగులును సామెతలును తెనుఁగుతనము వెల్లడించి, తమపొ త్తమునకు వారు మంచివన్నె తెచ్చుకొన్నారు : "తొలిపాలు, అయితిగామి, నల్లేరుపై బండి నడకంబోనివి, కన్నులఁ గట్టినట్లు, తలకెక్క వయ్యె, చిన్నమం తేని, మాటపడు, కన్ను పడియె, కడుపు చుమ్మలువాఱఁగ, మఱుఁగు సేఁత, నాకా పుగడ కగ్గంబై నాటినాయీడు గల్గి వెల్గొందు కుఱ్ఱలంజూచుతఱి, తలఁపునం బాఱి, తలలూపిన ముదిమిదిమియందు, తూర్పు పడమరల్ గుర్తింపనేరని కుఱ్ఱజింట, ఒక యయ్య చెంత, దొర యెఱుంగని గరువంపుదొరతనంబు, తెరచాటు నడవడి, ఆసులోని దారంబువోలె, అందొక్క '22