తత్తూరు తిరునాళ్లు ఇంతటి విస్తారమగు వ్యాపార కేంద్రీకరణమునకు ఈ యుత్సవము బీజప్రాయముగా తల పెట్టిన ప్రతిభ యెవ్వ రిదో యెట్టిదో తెలిసికొనుటకు ఆధారములు కన్పింపవు. ఆధీమంతుని చరిత్రము దొరకు నేని అది నిజముగా విరి విగా ప్రకటింపదగినదే. అది యితరులు ఆదర్శప్రాయముగా అంగీకరింపదగిన దే. నాటకములు, సత్ప్రములు వీరికి ఏదో జాతరగదా యని ఇచ్చట నన్నియు పరంపరా గతముగా జరిగిపోవుచున్నవి. ఈ మహాజన సందోహము నుండి ద్రవ్యము నాకర్షింపగల నాటకాదులు, సదుపాయములు కల్గించు అన్న సత్రములు కొన్ని సంవ త్సరములుగా అభివృద్ధిపొందునట్లున్నది. ఈ సంవత్సరము గోపాలరాయ మిత్రమండలివారు అవ్వల్ దర్జా నాట్య శేఖరులను జేర్చి నాటకము లాడిరి. స్థానం నరసింహారావుగారు, పంచాంగం రామానుజా చార్యులవారు, వగైరాలను శ్రీకృష్ణతులాభారమును ప్రజలు చూడగల్గిరి. పడమటి గోదావరి నాట్యసంఘము వారు మరియెవ్వరో అచ్చటికి చేరియుండిరి. బృంద మొక్కటి మున్నట్లు తోచలేదు. 3 వచ్చియుండినది. _90 సినిమా మాత్ర పూటకూళ్లు, మిఠాయి అంగడులు, ఇత్యాదులు నూర్లకు నూర్లు. సత్రములు రెండు ఒకరితో నొకరు పోటీలు వేసి కొని నడిపినారు, అందులోను చిత్ర మొకటి కన్పట్టినది. చిత్రమొకటి ఎదుటి సత్రమువారు తమసత్రము విషయమున నల్లరి జరుపుదురని అందులో నొక సత్రమువారు పోలీసు సిబ్బందీని కూడ కోరికొనిరట! ఇట్టి సంతలను ఎప్పుడును మరచిపోని వ్యవసాయశాఖ ప్రదర్శనమువారు ఏలొకో తేరుదినము నాటికిని ప్రదర్శనమును ఏర్పరచలేదు. గ్రామ సౌభాగ్య సంఘమునకు గమనింపు మరిచాల నిద్రబోవువారు నామనస్సుకు కాంగ్రెసు వారని తోచినది. ఇచ్చట ఖద్దరు ప్రదర్శనము మాట ఎట్లున్నను ఒక్క ఖద్దరు అంగడియైనను కన్పించలేదు. స్వదేశివస్తువులకు ప్రజలకు పరిచయము చేయు ప్రయ త్నము గోచరింప లేదు. గ్రామసౌభాగ్య సంఘమువారు ఇట్టి యవకాశములను పోగొట్టుకొనరాదని నావిశ్వా సము. తూర్పు కృష్ణాజిల్లా గ్రంథాలయమహాసభ, మా జేరు. ర్మానములు . ౧. ౬వ జార్జిచక్రవర్తి గారి పట్టాభిషేక సమయమున అభివందనముల నందజేయుచు విజ్ఞాన విషయమున వెనుక బడియున్న భారత దేశమున వారి పరిపాలన కాలములో గ్రంథాలయోద్యమము ద్వారా ప్రజాబాహుళ్యమునందు విద్యావ్యాప్తి జరుగుటకు శ్రీవారు ప్రత్యేక శ్రద్ధవహింప వలెనని ఈమహాసభవారు ప్రార్థించుచున్నారు. ౨. తూర్పు కృష్ణాజిల్లాయందు గ్రంథాలయోద్య మము వ్యాపింపజేయుటకు గాను ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు శాఖగా తూర్పు కృష్ణాజిల్లా సంఘమును స్థాపించుటకు తీర్మానింప నైనది. 3. తూర్పు కృష్ణాజిల్లా యందలి అన్ని జమీందారీ గ్రామములందును గ్రంథాలయములు నెలకొల్పి చల్లపల్లి, వల్లూరు, ఎలమఱు వగైరా జమీందార్లు తమతమ ఎ ట్లలో గ్రంథాలయోద్యమమును ప్రోత్సహించి ప్రజల యెడల తమ విధ్యుక్త ధర్మమును నెరవేర్చకు లెనని మహాసభవారు ప్ర్రార్ధించుచున్నారు. ఈ ౪. తిరుపతి దేవస్థానమువారి అధీనములో నున్న గుడివాడ లోని భవనము సర్వజనగ్రంథాలయ స్థాపనమునకునుగ్రంథా లయ సంఘాపయోగమునకును వినియోగించుటకు తూర్పు కృష్ణాజిల్లా గ్రంథాలయ సంఘము వారికి ఉచితము గా నొసంగి జనసామాన్యముయొక్క విజ్ఞానవ్యాప్తికి తోడ్పడవ లెనని ఈమహాసభ నారు దేవస్థానము వారిని కోరుచున్నారు. 21. సర్కారువారు గత సంవత్సరములో పంచాయితీ గ్రంథాలయములకు పదివేలును, సాధారణ గ్రంథాలయ ములకు పదివేలును మాత్రమే ప్రత్యేకించుట బొత్తిగా చాలుట లేదనియు చెటీ 20 వేలైనను వెనుకటివలె ప్రత్యే కించుట ప్రభుత్వమువారి కనీసధర్మమనియు ఈసభ వారు విన్న వించుచున్నారు. ౬. గ్రంథాలయములను, పఠనమందిరములను నాటు వ సం॥రము ౨౧ వ ఆర్ద్రుక్రింద రిజిస్టరు చేయునపుడు ఎట్టి ఫీజును చెల్లింపనక్కఱ లేకుండ తగుసవరణ చేయింపవలె నని ఈ సభవారు ప్రభుత్వమువారిని కోరుచున్నారు. 2. తూర్పుకృష్ణాజిల్లాలోని ప్రాథమిక పాఠశాలలను సక్రమమార్గముల పై నడపుటకై విశేషశ్రద్ధవహించి, విద్యకై వెచ్చింపబడుచున్న ధనమును సార్థకము చేయ యత్నించ వలసినదిగాను, విద్యాభిరుచిగల కొన్ని ప్రత్యేక కేంద్రములందు నిర్బంధోచిత విద్యావిధానము పరచవలసినదిగాను ఈ సభవారు కృష్ణాజిల్లాబోర్డు అధ్య క్షులను, విద్యాశాఖాధికారులను కోరుచున్నారు. నమలు ౮. రాబోవు తూర్పుకృష్ణాజిల్లాగ్వితీయ మహాసభకొరి మెర్లలో జరుపవలెనను ఆహ్వానమును అంగీకరింపనైనది. •
పుట:Grandhalaya Sarvasvamu - Vol.11, No.1 (1937).pdf/23
స్వరూపం