నం దొక పరమరహస్యమున్నది. ఇతఁడు మితజీవి. సంవత్సరముల తరబడిని చూచినను సూర్య నారాయణరావుగారి రూపము ఒక్కరీతినే కండ్లకు గోచరించును. ఆటోపి ఆకోటు ఆకట్టుగుడ్డ ఆతని మితవ్యయమునకు నిదానము. ఇట్టి జీవులలో గణనగన్న వారు ఇతరులు లేకపోలేదు. కందు కూరి వీరేశలింగం పంతులు, వావిలికొలను సుబ్బా రావు-వీరిద్దరిని పేర్కొనందగు కాని, వారు బియ్యే, బియల్ లుకారు. వకీలువృత్తినుండలేదు. సూర్య నారాయణరావుకంటే కొద్దిగా పూర్వులు. విశ్వ కళాపరిషత్తుపట్టములంది నూతన నాగరికపు చవిని గాంచినవారిలో సూర్యనారాయణ రావు గారు మితవ్యయము చేయుటచే లోకమున కెంత ఉపకారము చేయవచ్చునో తమజీవిత మూలక ముగా చాటి ధన్యులైరి. కొవ్వూరు గీర్వాణ విద్యాలయము ప్రాచీన వాఙ్మయ పరిశోధన తత్ఫలితములుగా ప్రకటితములైన గ్రంథములు పరిశోధక జటావల్లభుల పురుషోత్తమ ఎమ్.ఎ. గారు ఇన్నిటను శ్రీసూర్యనారాయణరావుగారు చిరంజీవులై ప్రతిఫలించుచున్నారు. గృహస్థా శ్రమ నిర్వహణమున ఇంత చక్కనిదారి వైచి కొనిన మహాపురుషుడు చిరస్మరణీయుడు.
ఆంధ్రవాఙ్మయ సేవాసమితి
బూర్గుంపాడు
4
ఈశ్వర సం॥ర చైత్ర శు ౧ రోజున పైసమితి ప్రాం
తీయసారస్వతాభిలాషులగు కొందరిచే నిట స్థాపింపబడి
తత్ప్ర్పగంధసమా వేశము జయప్రదముగ జరించబడినది.
సమితివ్యవస్థాపకులు సమితీయు దేశములను కార్యవిధాన
మును గురించి ప్రసంగించిరి. సమితి సభ్యులు శ్రీవిశ్వనాధ
రాయశర్మగారు శ్రీ నారాయణరావుగారు శ్రీ వెంకట
మణమూర్తిగారు శ్రీ మృత్యుంజయ సోమయాజులు గారు
ఉగాదిని గురించియు వాఙ్మయసేవను గురించియు సమితి
స్థాపనోద్దేశములను గుఱించియు తాము రచించిన పద్య
ములను కథలను వినిపించి శ్రోతల నానందింపజేసిరి. ఫలా
హారములతోను కృతజ్ఞతాభివందనములతోను పంచాంగ
శ్రవణముతోను సమావేశము జయప్రదముగ ముగింప
బడెను.
ພ
ఆంధ్రవాఙ్మయసేవాభిలాషు లెల్లరు సమితియందు జేరి
సాహిత్య సంబంధములగు పత్రికలను గ్రంధములను సంపా
దించుచు పద్యగ ద్యాత్మకమగు రచనలు పద్యరూ పక ము గా
గాని వ్యాసరూపకముగా గాని సమితికి సమర్పించుచు
సమితిపక్షమున వెలువరించుచు విమర్శించుచు వాఙ్మయాభి
వృద్ధికి కవితావి కొసమునకును పాటుబడుచుండుటయే
యీ సమితిముఖ్యో దేశములు. వీనిని నెర వేర్చుటకై సమితి
వా రొక సమాలోచన సంఘమును నియమించిరి. సార
స్వతాభిమాను లీ సమితియందు సభ్యులుగ జేరియు కవులు
పండితులు గ్రంథకర్తలు పత్రికాధిపతులు తమ రచనలను
పత్రికలను విమర్శనార్థము సమితికి జంపియు ఆంధ్రమహా
జనులుభాషాపోషకులు తమవితరణాభిమానములజూ పియు
మాసమితి భావ్యభివృద్ధికి చేయూతనొసంగి తోడ్పడ
కోరుచున్నాము.
నైజాము పోస్టు: లేక బ్రిటీష్ పోస్టు భద్రాచలం
డోర్నకల్ మీదు గా
బూర్గుంపాడు,
నైజాము రైల్వే.
ఇటు
3
సమితి వ్యవస్థాపకుడు
ఇంద్రకంటి
వెంకటరమణమూర్తి.
ప్రథమాంధ్ర ప్రకృతి శాస్త్ర విజ్ఞాన
మహాసభ - మా జేరు
పై మహాసభ శ్రీయుత టేకుమళ్ల రాజగోపాల రావు
బి. ఎ. ఎల్, టి. గారి యధ్యక్షతక్రింద ఏప్రిలు ౧౭-౧౮
తేదీలను జయప్రదముగా జరిగినది. ఆహ్వాన సంఘాధ్యక్షు
లగు కావూరి కోదండరామయ్య చౌదరిగారు అని
వార్యములైన కారణాంతరముల చే
3
రానందున
ఆహ్వాన సంఘాధ్యక్షోపన్యాసము మాజేటి వెంక టేశ్వర
రావు గారిచే చదువబడినది. అధ్యక్షులు సభయొక్క
యుద్దేశ్యములను తెలుపుచు జనసామాన్యమున కందు
బాటులో ను౦డునట్లు శాస్త్రములన్నియు ప్రచురించుట
అత్యంతావశ్యకమని తెలిపిరి. విషయ నిర్ధారక సభ
౧౭ వ తేదీ మధ్యాహ్నమునను, ౧౯ వ తేదీ యుదయ
మునను సమావేశమయ్యె. తీర్మానములు చర్చింపబడినవి.
స్టాండింగు కమిటీ యేర్పఱుపబడినది. మాజేటి రామచంద్ర
రావుగారి యభివందనములతో సభ ముగిసినది.