అమరకంటక యాత్ర
కీ. శే. శ్రీమతి భండారు అచ్చమాంబగారి లేఖ[1]
నర్మదానది యెచ్చట బుట్టు?
సంబలపూర్ 30-0-03
ప్రియసఖి తిలకమా!
తాము మిక్కిలి బలహీనత కలిగియుండియు దానిని లెక్కింపక నాకు వ్రాసిన కార్డు నాకందినది. దానివలన మీ శరీరమున కించుక నెమ్మది కలిగెననియు ముందీవ్యాధియే నిశ్శేషమగునను నమ్మకముగా నున్నదనియు జదివి యప్పుడే తాము సంపూర్ణారోగ్యతను గాంచి నాకన్నుల కగుపడినటుల నత్యంతానందము గలిగెను. చి. లక్ష్మారాయుడు[2], మిక్కిలి నీరసించి యుబ్బసముతో బాధపడుచుండెను గాని వానికి స్నేహితుఁడగు నొక డాక్టరు పట్టుదలతో మదిచ్చి దానిని బోగొట్టినందున నాఱు సంవత్సరముల నుండియు వాఁడు శరీర సౌఖ్యము కలిగియే యున్నాఁడు. వాఁడిప్పుడు చెన్నపురికి వచ్చియే యుండును. ట్టును ?
[3]చి. చంద్రమతి చదువుకుంటున్న వార్త విని సంతోషించితిని. దానికి నా ముద్దులు చెప్పుడు.
ఇంక మిగతసంగతుల నావలఁద్రోసి వెనుకటి యుత్తరములో వ్రాసిన ప్రకారము మా అమరకంటక యాత్రావార్తను వ్రాసెదను.
[4]బిలాస్పూరమునుండి సంబలపురమునకు మమ్ములను మార్చిన వార్త తెలిసిన వెంటనే మాక మరకంటకమునకు వెళ్లవలయుననెడి కోర్కె హెచ్చెను. పూర్వ మాఱుసంవత్సరములు బిలాస్పురమునం దుండి పర్వతప్రదేశమును జూచుట తటస్థించినది కాదు. నర్మదానదికి జన్మస్థానమగు నీస్థలము బిలాస్పురమునకు సనిూపము నందుండుటవలన వెంటనే బయలు దేరు దినము
నిశ్చయముచేసికొని, [5]మ.మీ బావగారచటియాఫీసరును సెలవడిగిరి. అందుకాయధికారి సమ్మతించి
- ↑ *కీ.శే కొమఱ్ఱాజు వెంకటలక్ష్మణరావుగారి సోదరీమణియు, అలా సచ్చరిత్ర రత్నమాలను రచించిన సుప్రసిద్ధ విదుషీమణియునగు భండారు అచ్చమాంబగారు తమ్మునికిని, కొటికలపూడి సీతమ్మగారు పులుగుర్తి లక్ష్మీ నరసమాంబగారు మొదలగు కవయిత్రులకును వ్రాసిన లేఖ లనేకములున్నవి. ఆలేఖ లన్నింటిని ప్రచురింపవలెనను కుతూహలముతో లక్ష్మణరావుగారు సంపాదించియుండిరి. వానిలోఁ గొన్నిఁటి నీమాసపత్రికలో ప్రచురింపఁ దలచితిమి. ఈ లేఖను అచ్చమాంబగారు శ్రీమతి కొటికలపూడి సీతమ్మగారికి 30-8-1903 తేదీన వ్రాసిరి
- ↑ లక్ష్మణరావు గారిని బంధువులు 'లక్ష్మారాయుడు' అని వ్యవహరించెడివారు. అప్పుడు లక్ష్మణరావు గారు శ్రీమునగాల రాజాగారి కొలువున చెన్న పట్టణములో నివసించుచుండిరి.
- ↑ చంద్రమతి కోటికలపూడి సీతమ్మగారి కుమార్తె
- ↑ బిలాస్పురము సెంట్రల్ ప్రావిన్సెస్ లోని నగరము
- ↑ సీతమ్మగారిని అచ్చమాంబగారు చెల్లెలి వరుసును పిలుచుచుండిరి. అందువలన అచ్చమాంబగారు తమ భర్త గారిని గుఱించి వ్రాయునపుడు 'మీ బావగారని వాడినారు. అప్పుడు అచ్చమాంబగారిభర్త మాధవరావుగారు మర్థ్య రాష్ట్రములలో సబుడివిజనలు ఆఫీసరు ఉద్యోగము చేయుచుండిరి.