- శ్రీయుతులు గా.హరిసర్వోత్తమరావుగారు,
- శ్రీయుతులు భూపతిరాజు తిరుపతిరాజు గారు (కుముదవల్లి, భీమవరంపోస్టు),
- శ్రీయుతులు యర్ర చంద్రరావు గారు (వుప్పులూరు, ఉండి పోస్టు), (ఉండిపోష్టు)
- శ్రీయుతులు కూనపరాజు పెద రామరాజు(ఉండిపోష్టు)
- శ్రీయుతులు వేగేన నూరపరాజుగారు (పొందువ్వ)
- శ్రీయుతులు అడవికొలను సూరయ్య గారు (నిడమర్రు)
- శ్రీయుతులు అయ్యంకి వెంకటరమణయ్య గారు
- శ్రీయుతులు పాతూరు నాగభూషణం గారు (పెదపాలెం)
- శ్రీయుతులు తాడిమేటి కుటుంబశాస్త్రి గారు (నిడదవోలు)
శ్రీకుటుంబశాస్త్రిగారు సమావేశకర్తగా నేర్పరుపకాబడిరి. మొదటి సమావేశము ఈ నెల 30 వ తేదీని "ఉండి" సమీపమున ఉప్పులూరి యందు జరుపుటకు నిశ్చయించబడినది.
V. ధాత సంవత్సరాదినాడు ఆంధ్రదేశములోని అన్ని పల్లెలలోను పట్టణములలోను ఆంధ్ర రాష్ట్ర నిర్మాణావళ్యకతను గూర్చి తగు ప్రచారము గావించి, రాష్ట్ర సంసిద్ధికి కృషి చేయుటకు దీక్షాబద్దులను గావించుటకు, గ్రంథాలయముల వారును ఈయుద్యమాభిమాను లెల్లరును తగుపూనికతో “ఆంధ్రోద్యమదివసము ”ను దిగ్విజయముగా జరిపించవలెనని ఈ సభవారు కోరుచున్నారు.
VI. ఈ సంఘము యొక్క కార్యక్రమమును ఈ క్రింద వివరించిన శాఖాసంఘములచే నిర్వహించుటకు తీర్మానించడమైనది. ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘపు ఆధ్యక్షుడును కార్యదర్శియు అన్ని శాఖలలోను అధికార రీత్యా సభ్యులు గానుండగలరు.
1. గ్రంధభాండాగారికుల తరిబీతుశాఖ
- అధ్యక్షులు శ్రీ ఆర్. జనార్దన౦నాయుడు గారు
- కార్యదర్శి: పాతూరి నాగభూషణం గారు
- సహాయకులు శ్రీ అబ్బూరి రామకృష్ణరావుగారు, శ్రీ పుణ్యమూర్తుల రాజశేఖరంగారు, శ్రీ జటావల్లభుని పురుషోత్తంగారు
ఈ శాఖ చేయవలసినపనులు (1) ప్రణాళిక నేర్పరచుట (2) పాఠ్యపుస్తుకములను ఆంధ్రమున తయారు చేయుట (3) తరిబీతు తరగతులను నిర్వహించుట
2. గ్రంథాలయోద్యమప్రచారక శాఖ
- అధ్యక్షులు: శ్రీ శరణు రామస్వామి చౌదరిగారు
- కార్యదర్శి : శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్యగారు
ఈశాఖ చేయవలసిన పనులు: (1) ప్రచారమునకు అవసరమైన కరపత్రములను తయారు చేయుట, పంచి పెట్టుట. (2) ప్రచారమునకు అనువైనమార్గములను అన్వేషించి ఆచరణలో పెట్టుట, యాత్రలను నిర్వహించుట. (3) గ్రంధనిర్వచనశాఖ (Book Selection)
- అధ్యక్షులు: శ్రీ జటావల్లభుని పురుషోత్తంగారు
- సభ్యులు: శ్రీ శనివారపు సుబ్బారావుగారు (కార్యదర్శి), శ్రీ మంగిపూడి పురుషోత్తమశర్మగారు
ఈశాఖ చేయవలసిన పనులు: (1) గ్రంథాలయములు తెప్పించుకొనతగిన 1000-500-100 గ్రంధముల పట్టికలను తయారు చేయుట, (2) ప్రత్యేక విషయములనుగూర్చిన గ్రంధముల పట్టికలను తయారు చేయుట, (3) అవసరమైన ఇతర పట్టికలను తయారు చేయుట,
4. ఆంధ్రదేశ గ్రంథాలయ చరిత్ర శాఖ:
- అధ్యక్షులు:— శ్రీ గా. హరిసర్వోత్తమరావుగారు
- కార్యదర్శి: శ్రీ జటావల్లభుని పురుషోత్తంగారు
ఈశాఖ చేయవలసిన పని: ఆంధ్రదేశ గ్రంథాలయ చరిత్రలను తయారు చేయుట
5. సారస్వత పరీక్ష శాఖ:
- అధ్యక్షులు: శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు
- కార్యదర్శి: శ్రీ ఉన్నవ లక్ష్మీనారాయణగారు
- స.కార్యదర్శి: శ్రీ మందలపర్తి ఉపేంద్రశర్మగారు
ఈశాఖ చేయవలసిన పని: సారస్వతమునందు పరీక్షలను నిర్వహించుట.
6. సేవాశాఖ
- అధ్యక్షులు: శ్రీ మారేపల్లి రామచంద్రశాస్త్రిగారు
- కార్యదర్శి: శ్రీ మల్లెల శ్రీరామమూర్తిగారు
ఈశాఖ చేయవలసినపని: సేవాసంఘ సభ్యులయొక్క నివేదికలను తెప్పించి ప్రచురించుట.