Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.1 (1936).pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

10

1.4 గొడగూచికథ శ్రీ ఉభయభాషాప్రవీణ, కా. వీరభద్రేశ్వర రావుగారు, బి.ఏ., యల్.టి. శివ దేవుఁడను శివభక్తుఁడు పొన్నూరి కేగుచు కడగొట్టుపాప నింట గాపుంచి, “అమ్మా! గొడ గూచీ, ఇంట బదిలముగనుండుము. నిత్యము గుడి కేగి దేవ దేవునకుఁ గుంచెడుపాలు ఆరఁగింపఁ బెట్టుము. ఈవ తమును నీవు తప్పక జరి పెదవని నమ్మి పోవుచున్నాము. చిన్న తల్లీ! నీ కొక మంచి బొమ్మయు నిన్ని బొమ్మపొత్తికలును తెచ్చి యిచ్చెదము" అని అప్పగించి వెళ్ళెను. గొడగూచియు కాళ్ళు మొగము గడిగికొని, గంగియావుపాలు కమగా కాచి కుంచెడు కోరతో గొలిచిపోసి, కోరను పొత్తిన కొంగున గప్పి శివాలయమునకు వెళ్ళినది. శివునిముందర నామే కోరఁబెట్టి మ్రొక్కి పాలారగింపవలసినదని విన్న వించి, కనుమర గయ్యెను. తాను చాటున కేగినను కోరలోనున్న పాలు కొంచెమైన గదలనందున భయముఁ జెందినదై యిట్లని బహుపకారముల సన్ను తించెను. “పాలేల యారగింపవు లింగమూర్తి: కాచుట చాలదో! కమ్మ వల్వమినొ? పాచియొక విరిగెనో పడుచ నే ననియె పొద్దెక్కెనో యొండె పొగవట్టి చెడెనో? బుద్ధిపుట్టదొ? నెయ్యి వోయకుండిననో? కడు వేడియో! నీరు గలసినవనియొ యెడ వాద్యములులేక యేనె తెచ్చితినొ చాలవో! యివి యాలపాలుగా వనియొ

  • ఇది పాల్కురికి సోమనాధ సుకవి ప్రణీతమైన

పాలపైఁ జిత్తమే బరపితి ననియొక కోర బెడంగానో కుంచెడు లేవా? యారగింపగ బెట్ట నేరకుండితినో? విూదుపోయినవనో మీఁగడలేదొ? యేదెచ్చునెడ నెవ్వరే జూచి రనియొè యూర కేమిటికి పాలొల్లవు తావ? కారణంబే దేని కల దేని చెపుము. నిక్కవు టాకలి నీకు లే దేని గుక్కెడైనను గొని చిక్కించు నాకు . గుడుపున కియ్యెడ గుద గుద లేల, కుడు కెడు దెత్తునా గుజ్జునోగిరము. మూలపన్నారుల, యాలోవిలోన, పో లెలున్నవి, పంపు, పోయి తెచ్చెదను. యుటిపై బానలో నున్నది. నెయ్యి ఇట్టున్న దెచ్చెద నిష్టమే నీకు. కుండెడున్నది పోయి కొనివత్తు పుల్ల ఖండంబు వలెనేని గ్రక్కున జెపుమ. అచ్చన యెల్లి మాయయగారి నగర జెచ్చెర బిల్వవచ్చెద నారగింపు. మా శివసోదరి మఠమునగలదు. పాశంబుదెచ్చెద పాలు ముద్దావు. షోడశపండువు చూడ బోదండు పోడిగా నీపాలు పురహర గొనుము. వీ రేశుజాతర వేళ ని న్చండి యేరొప్ప బనిచెద నీపాలు దావు. బసవపురాణమునందలి చిన్ని కథ. ఇట్టికథ లనేకములందు వర్ణింపఁబడినవి. ఈకధలను సోమనాథుఁడు సర్వసామాన్య భాషయగు తేట తెనుఁగులో ద్విపదలతో గూర్చెను. ఇందు జాను తెనుఁగుమాటలు, వీనుల విందుగు జాతీయములు గోచరించుచున్నవి. = = పొన్నూరు = పొరుగూరు, కోర = పాత్ర,కమ్మ = తీపిదనము, ప్ర్రాచి = చద్ది. బెడంగెనో - తొణికెనో. మీదుపోవుట = దృష్టిదోషముతగులుట, చిక్కించు = విడిచి పెట్టు, కుడు కెడు = కుడుక (పిడత) + ఎడు. ఓగిరము = అన్నము. పన్నారులు = దొంతెర, లోని పాత్రము, పోలెలు—పోళీలు = భష్యువిశేషములు, పాశము = పాయసము; పులఖండము = కండచ క్కెర . = == = "