Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.1, No.3 (1916).pdf/142

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

286

 
లొక్కపువునఁ బానీయముఁ గ్రుక్క గొందు
వెక్క పూవును గీతితో నుత్సవింతు.
అంతు లేనియాక సమునఁ గొంతసేపు,
కుటిలపవన వీచికలందుఁ గొంతసేపు,
కువలయోన్మీల రేఖలఁ గొంత సేపు,
త్రుళ్ళిపడుచుఁ దిరిగెదుమ త్తునివిధాన.. . . . . ౧౦

తుమ్మెద

చంచలుఁడనౌదు నవనికిఁ జలన మొసఁగ,
విరహినగుదుశుష్కితులకుఁ బ్రేమదార్ప,
మత్తుడనగుదు జతలకు మత్తువెట్ట.
లేదు లేదనృతంబిందు లేశమయిన.. . . . . ౧౧


ఒక్కపువుపొంతనాడుదు, నెక్కపూవు
పజ్జఁబాడుదు మెక పూవు సెజ్జమీద
శిశువువలె నిదురింతు నీ చిత్రదశల
చక్కదనములు లేక నా జన్మమేల?. . . . . ౧౨


చిత్తచాంచల్యమన్నను సిగ్గులేదు
మతిభ్రమణమనినను నవమానపడను,
నన్ను నాపూల నెడఁదీసి భిన్న భిన్న
మార్గములకీడ్వకున్న నమస్కరింతు.. . . . . ౧౩


తారలన్నను,మణులన్న తనయులన్న
పులుఁగులన్న, గీతములన్న, పూవులన్న
నామవాచక భేదముల్ నాకు మాత్ర
మన్నియును బూవులేయగు నార్ద్రదృష్టి.. . . . . ౧౪


పూల కొఱక యిపుట్టితి, పూలలోని,
తీయ తేనెను దీయుచుఁదిరుగువాఁడ;
నెపుడు నాడుచుఁ బాడుచునిదియె - నిజము,
భ్రమయొ; యున్మాదమో; కైపొ; వలపొ సొలపొ!. . . . . ౧౫


ఈమధువ్రతమును తుదకెల్లజరిపి
వదలుదును తేనెపెరలతోఁ బాటుపృధివిఁ -
పిదపనరయుఁడు చంచలహృదయచంచ
రీకగీతిసంగ్రహమును బ్రీతితోడ.. . . . . ౧౬


ప్రేమచేఁ జెమ్మగిల్లిన హృదయ రాగ
ములను నడిపింప కాల్వలెందులకు త్రవ్వ?
నడువనిమ్ము నచ్చినభంగి నెడుపు లొలయు
వాలకముతో నెడా పెడ వాఁకలట్లు.. . . . . ౧౭

గ్రంథ భాండాగారములు దేశౌన్నత్యమునకు ప్రా ధాన్యములు. వానియందుండు గ్రంధబాహుళ్యమునుబ ట్టియు, గ్రంథాత్కృష్ట్యమును బట్టియు ఉపయోగము హెచ్చుచుండును. అవి సూదంటురాలవంటివి. దేశము నందున్న జనులందరికిని అవి జ్ఞానాభివృద్ధిని జేయుటయే గాక కనివినియెరుగని యనేకోద్గ్రంధముల సహాయము నొసంగుచున్నవి. అందుచేత విద్యాభివృద్ధియగుటయే గాక, దేశమింకను అనేక విధముల నభివృద్ధినొందుటకు గావలసిన మార్గముల నెల్ల అచట మనము కనుగొన గలము.

ఆధునిక గ్రంధభాండాగారోద్యమంబున కెల్ల అమెరికా దేశము నాయకమణియని జెప్పనగును. ఆ దేశము నందలి గొప్ప పట్టణములలో “వాషింగుటను” పట్టణము మిక్కిలి వినుతికెక్కినది. ఈ పట్టణమునందు ఆ దేశ ప్రభుత్వమువారిచే గొప్ప గ్రంథాలయమొకటి నిర్మింపబడియున్నది. ప్రధమము నందిది రు 1500 లు విలువగల గ్రంథములతో 'కాపిటల్' అనుభవనమున ప్రారంభింపబడినది. ఈ భవనమున రాజ్యశాసన నిర్మాణ సంఘ సభ్యులందరుకూడి అమెరికా దేశమునకు చట్టములను నిర్మించుచుందురు. అమెరికా దేశ పురోభివృద్ధికంతకును పునాది