పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/9

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

పడి యుండినచో పని తృప్తికరముగా జరుగదు. కాని అట్టి వార్షికవిరాళములు బంధకములై యుండగూడదు.

-సూరి వేంకట నరసింహశాస్త్రి

గ్రంథాలయముల పలుకుబడి - అమెరికా దేశము

(డాక్టరు సుధీంద్రబోసుగారు)

అమెరికా దేశమందు పట్టణములయందేగాక పల్లెలయందు గూడ కలిసి పదునెనిమిది వేల గ్రంథాలయములు గలవు. ఈగ్రంథాలయములు ప్రభుత్వము వారిచేతను, వ్యక్తులవలననుగూడ నిర్వహింపబడుచున్నవి. మనదేశమందు మసీదులు, చెర్చిలు, దేవాలయములు కలసి ఎన్నిగలవో, అమెరికా దేశమం దన్నిగ్రంథాలయములు గలవు. అందుచేత వానికొరకై ఖర్చుపడుద్రవ్యము అసంఖ్యాకమైయున్నది.

మనదేశమందు గ్రంథాలయముల యుపయోగము కొలదిజనులకుమాత్రమే ప్రత్యేకింపబడి యున్నది. అమెరికా దేశమందలి గ్రంథాలయోద్యమమును గూర్చి చదువుకొనుటకై, ఐరోపా దేశమునుండి అనేకమందిని పంపుచున్నారు. మనదేశమునుండి ఎంతమందిని పంపినారు? అమెరికాదేశమందలి గ్రంథాలయము జనులందరియొక్క యుపయోగము నిమిత్తమును ఏర్పడినది. అందుచేత నిరోధములేమియు లేకుండ ఆదేశమందలి గ్రంథాలయములు జనులందరికిని అందుబాటులో నుండును. మానవుని విజ్ఞానమునకు ఆవశ్యకములైన శాస్త్ర గ్రంథములు, చరిత్ర గ్రంథములు మొదలగు అన్ని శాఖల గ్రంథములును వానియందు దొరకును. చదువరికి కావలసిన సదుపాయము లన్నింటిని గ్రంథాలయములు చేయుచుండును.

ఆదేశ గ్రంథాలయము లన్నింటియందును చదువుకొనుటకు ప్రత్యేకగదు లుండును. పరిశోధన చేయువారు ప్రత్యేకముగా పరి