పుట:Grandaalayasarvasvamu sanputi 7sanchika 1jul1928.pdf/8

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెనుకటి తరగతివారికన్న కొంత విద్యాగంధము కల్గి తమంతట తాము విద్యాభివృద్ధి చేసికొనలేనివారు మరియొక తరగతివారు. వీరి యుపయోగము కొరకు తగిన కూడలి స్థానములందు తాత్కాలికపాఠశాలలు పెట్టవచ్చును. వీటిని ప్రతిదినము సామాన్య పాఠశాలలవలె నడుప నవసరములేదు. వారమునకు గంట మొదలు రెండు గంటలవర కుంచిన చాలును. ఆయాప్రాంతముల నుండు విద్యార్థుల యవసరములను బట్టియు అభిరుచులను బట్టియు బోధానాంశములను మార్చవచ్చును.

ఇక తమంతట తామే జ్ఞానాభివృద్ధి చేసికొన గలవారు మరియొక తరగతివారు. వీరల యుపయోగముకొరకు సంచార గ్రంథాలయ పేటికలును స్థాయి గ్రంథాలయములును స్థాపించవలసి యున్నది.

ఈ సంస్థలు నడుపువారెవరు?

తాత్కాలికపు పాఠశాలలను నడుపుటకు ఆయాప్రాంతములందు స్థాపించబడియుండు సెకండరీ పాఠశాలలయందలి ఉపాధ్యాయులు మిక్కిలి యుపకరింతురు. సంచారోపన్యాసకులను పంపుటయు కరపత్రములను ప్రచురణచేయుటయు, తాత్కాలిక పాఠశాలలో జరుగు విద్యాభ్యాసమును తగుపద్ధతుల నడుచునట్లు చేయుటయు ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘముయొక్క విధిగా నుండవలెను. అందు కనుబంధముగ జిల్లాసంఘము లుండవలెను. సంచార గ్రంథాలయ పేటికలను స్థాపించి గ్రామములవెంట త్రిప్పుట లోకలు బోర్డుల మూలమునను మ్యూన్సిపాల్టీలవల్లను జరుపవచ్చును.

పూర్వమువలె కేవలము ప్రజలనుండి ఈసంస్థకు ద్రవ్యము చేకూరదు. మరియు అనధికారులు మాత్రమే నడుపు సంస్థకు నిరంతర కృషి యుండవలెనన్న కొన్ని కట్టుదిట్టము లుండవలెను తప్పక వచ్చెడి ద్రవ్యాదాయ ముండవలెను. స్థానిక ప్రభుత్వమునుండియి స్థానిక స్వపరిపాలనా సంఘములనుండియు వచ్చెడి వార్షికవిరాళములచే ఈ గ్రంథాలయసంస్థలు నడుపుట యవసరము. కేవలము అప్పుడప్పు డిచ్చు యథేచ్ఛాదానముల మీదనే ఈసంస్థలు ద్రవ్యముకొరకై యాధార